World's first solar car Light Year 0: ప్రపంచవ్యాప్తంగా కర్భన్ ఉద్గారాలను తగ్గించుకోవాలని అన్ని దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. దీంతో సంప్రదాయ పెట్రోల్, డిజిల్ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలు వస్తున్నాయి. ఇప్పటికే టెస్లా వంటి కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లతో పాటు ట్రక్కులను తీసుకువచ్చింది. రానున్న రోజుల్లో పూర్తిగా వాహనరంగాన్ని ఎలక్ట్రిక్ వాహనాలే ఏలే అవకాశం ఉంది. దీనికి తగ్గట్లుగానే అన్ని ఆటోమేకింగ్ కంపెనీలు తమ ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లో లాంచ్ చేస్తున్నాయి. ఇండియాలో టాటాతో పాటు మహీంద్రా, ఎంజీ, హ్యుందాయ్ వంటి…
Pune man found Zika virus positive: ప్రపంచం గత మూడేళ్లుగా కరోనా వైరస్ తో కష్టాలు పడుతోంది. దీనికి తోడు ఇటీవల మంకీపాక్స్ వైరస్ కూడా ప్రపంచాన్ని కలవరపెట్టింది. భారత్ లో కూడా పదికి పైగా మంకీపాక్స్ కేసులు నమోదు అయ్యాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం మరోసారి జికా వైరస్ కలవరం మొదలైంది. మహరాష్ట్రలో ఓ వ్యక్తితో జికా వైరస్ గుర్తించారు. పుణేలోని బవ్ధాన్ ప్రాంతంలో 67 ఏళ్ల వ్యక్తికి జికా వైరస్ సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం వెల్లడించింది.
Google CEO Sundar Pichai Receives Padma Bhushan In California: టెక్ దిగ్గజం ఆల్ఫాబెట్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కు పద్మభూషణ్ అవార్డును ప్రధానం చేశారు అమెరికాలోని భారత రాయబారి. 2022లో ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ విభాగంలో ఆయనకు పద్మభూషణ్ అవార్డును ప్రకటించింది భారత ప్రభుత్వం. ఈ ఏడాది 17 మందికి అవార్డుల్లో ప్రకటిస్తే అందులో సుందర్ పిచాయ్ కూడా ఉన్నారు. శుక్రవారం శాన్ ఫ్రాన్సిస్కోతో తన సన్నిహితులు, కుటుంబసభ్యుల మధ్య భారతదేశ మూడో అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నారు. అమెరికాలో భారత…
America's warning on China's objections: భారత్, అమెరికా కలిసి సైనిక విన్యాసాలు చేస్తున్నాయి. ‘యుద్ అభ్యాస్’పేరుతో ఉత్తరాఖండ్ లో ఇరు దేశాల సైనికులు సైనిక విన్యాసాలు చేస్తున్నారు. చైనా సరిహద్దు ఎల్ఓసీకి కేవలం 100 కిలోమీటర్ల దూరంలోనే ఈ సైనిక విన్యాసాలు జరిగాయి. అయితే ఈ సైనిక విన్యాసాలపై చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత్ 1993,96 ఒప్పందాలను ఉల్లంఘిస్తుందని ఆరోపించింది. ఇదిలా ఉంటే ఈ విషయంలో భారత్ కు అండగా నిలిచింది అమెరికా.
Madras High Court Bans Mobile Phones In Temples Across Tamil Nadu: దేవాలయాల్లో మొబైల్ ఫోన్లను బ్యాన్ చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది మద్రాస్ హైకోర్టు. తమిళనాడు వ్యాప్తంగా ఉన్న అన్ని దేవాలయాల్లో మొబైల్ ఫోన్లపై నిషేధాన్ని విధించింది. దేవాలయాల పవిత్రతను కాపాడేందుకు తమిళనాడులోని అన్ని దేవాలయాల్లో మొబైల్ ఫోన్లను నిషేధించాలని మద్రాస్ హైకోర్టు మదురై బేంచ్ హిందూ రిలిజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్ శాఖను ఆదేశించింది.
Maharashtra woman harassed by live-in partner: దేశవ్యాప్తంగా శ్రద్ధావాకర్ హత్య సంచలనం సృష్టించింది. అత్యంత కిరాతకంగా శ్రద్ధ సహజీవన భాగస్వామి అఫ్తాబ్ పూనావాలా అత్యంత దారుణంగా 35 ముక్కలుగా చేసి చంపేశాడు. ప్రస్తుతం ఈ కేసులో అఫ్తాబ్ ను పోలీసులు విచారించారు. పాలీగ్రాఫ్ టెస్టులో సంచలన విషయాలు వెల్లడించారు అఫ్తాబ్. శ్రద్ధా తనను విడిచి వేరేవాళ్లతో వెళ్లిపోతుందనే చంపేసి ముక్కలుగా చేశానని వెల్లడించాడు. శ్రద్ధాతో లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్న సమయంలోనే మరో 20 మంది హిందూ మహిళలతో సంబంధాలు నెరిపినట్లు…
High salt is a threat to heart health: మన శరీరంలో జీవక్రియలు సక్రమంగా జరగడానికి ఉప్పు అనేది కీలకం. సోడియం మనశరీరంలో ఫ్లూయిడ్స్ ని బ్యాలెన్స్ చెస్తుంది. కండరాలు, నరాల కదలికలకు సహాయపడుతుంది. మితంగా తీసుకుంటే ఉప్పు శరీరానికి సహాయకారిగా పనిచేస్తుంది. ఎప్పుడైతే ఉప్పు అధికంగా తీసుకుంటామో అప్పుడు గుండె, కిడ్నీలు, నరాలపై ప్రభావం పడుతుంది. ఇది దీర్ఘకాలంలో కిడ్నీల వైఫల్యానికి, గుండెపొటుకు కారణం అవుతుంది.
Physical assault on minor girl in mumbai: దేశంలో రోజుకు ఎక్కడో చోట అత్యాచారాల ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. వావీ వరసలు, చిన్నా పెద్ద అనే తారతమ్యాలు మరిచి మృగాళ్లు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇదిలా ఉంటే స్కూల్ లో చదువుకునే మైనర్ విద్యార్థులు కూడా ఈ నేరాలకు పాల్పడుతుండటం కలవరపెడుతోంది. ఇటీవల హైదరాబాద్ లో ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. తోటి విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు.
Outbreak of Covid-19 in China: చైనాలో కోవిడ్ ఉద్ధృతి తగ్గడం లేదు. గత కొన్ని రోజులుగా అక్కడ 30 వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. కొత్తగా దేశంలో గురువారం 34,980 కోవిడ్-19 కేసులు నమోదు అయ్యాయి. వీరిలో 30,702 మందికి లక్షణాలు లేవని అక్కడి జాతీయ ఆరోగ్య కమిషన్ శుక్రవారం వెల్లడించింది. అంతకుముందు రోజు బుధవారం 36,061 కరోనా కేసులు నమోదు అయ్యాయి. కరోనా వైరస్ విజృంభన ప్రారంభం అయిన తర్వాత చైనాలో ఇప్పటి వరకు 5,233 మంది మరణించారు. డిసెంబర్…
Encounter between police and Naxalites at Koyyur 23 years ago: నక్సలైట్స్ ఉద్యమ చరిత్రలోనే నెత్తుటి జ్ఞాపకంగా నిలిచింది కొయ్యూర్ ఎన్కౌంటర్. మావోయిస్టులకు భారీ దెబ్బగా భావిస్తుంటారు. భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం కొయ్యూర్ గ్రామం( ఒకప్పటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా)వద్ద 1999 డిసెంబర్ 2న పోలీసులు, పీపుల్స్ వార్ దళాల మధ్య భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో పీపుల్స్ వార్ ముగ్గురు కీలక నేతలను కోల్పోయింది. అప్పటి కేంద్ర కమిటీ సభ్యుడు నల్లా ఆదిరెడ్డ,…