Farooq Abdullah on Pathaan controversy: బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ నటించిన ‘పఠాన్’మూవీ వివాదాస్పదం అయింది. ఈ సినిమాలోని ‘బేషరం రంగ్’ పాటు ఈ వివాదానికి కేంద్రంగా మారింది. ఈ పాటలో హీరోయిన్ దీపికా పదుకొణె కాషాయరంగు బికినీలో కనిపించడంతో పాటు పాటలో అసభ్యత ఎక్కువగా ఉండటంతో హిందూ సంస్థలు, బీజేపీ పార్టీ ఈ పాటను తొలగించాలని లేకపోతే సినిమాను బ్యాన్ చేస్తామని హెచ్చరించారు. మరోవైపు ముస్లిం సంఘాలు కూడా ఈ పాటపై అభ్యంతరం తెలుపుతున్నాయి.
Read Also: Paris Shooting: పారిస్‌లో కాల్పులు.. ముగ్గురు మృతి
ఇదిలా ఉంటే పఠాన్ వివాదంపై జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా శుక్రవారం స్పందించారు. పఠాన్ సినిమాకు మద్దతుగా నిలుచున్నారు. అంటే కాషాయం హిందువులది.. ఆకుపచ్చ ముస్లింలదా..? అని ప్రశ్నించారు. ఆవు హిందువులది, ఎద్దు ముస్లింలకు చెందినదా..? ఏంటిది అని ప్రశ్నించారు.
ఈ సినిమాలో దీపికా పదుకొణె కాషాయ రంగు బికినీ ధరించడంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం సినిమాకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలను తొలగించకుంటే సినిమాను బ్యాన్ చేస్తామని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి నరోత్తమ్ మిశ్రా వార్నింగ్ ఇచ్చారు. ఇదే విధంగా మహరాష్ట్రలోని బీజేపీ నాయకుడు ఇలాగే పఠాన్ సినిమాకు వార్నింగ్ ఇచ్చారు.