India's Cuisine Ranked Fifth In The List Of Best Cuisines Of The World: ప్రపంచ అత్యుత్తమ వంటకాల జాబితాలో భారత్ ఐదోస్థానంలో నిలిచింది. టేస్ట్ అట్లాస్-2022 ప్రపంచ అత్యత్తమ వంటకాల ర్యాంకులను ప్రకటించింది. పదార్థాలు, వంటకాలు, పానీయాలు ఇలా మూడు కేటగిరీల్లో ప్రజల నుంచి ఓట్లను కోరింది. ఓట్ల ఆధారంగా ర్యాంకును కేటాయించింది. ఈ జాబితాలో ఇటలీ మొదటిస్థానంలో నిలవగా.. గ్రీస్, స్పెయిన్, జపాన్ దేశాల తర్వాత ఐదోస్థానంలో భారత్ చేరింది. మొత్తంగా భారతదేశం 4.54 పాయింట్లను సాధించింది.
Delivery Drone Crashes On Delhi Metro Tracks: ఢిల్లీలో ఓ డ్రోన్ కలకలం సృష్టించింది. ఢిల్లీ మెట్రో రైల్ ట్రాక్ పై డ్రోన్ కూలిపోవడం అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించింది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు రైలు పట్టాలపై డ్రోన్ కూలిపోయింది. దీంతో ఢిల్లీ మెట్రో జసోలా విహార్ స్టేషన్ కొద్ది సేపు మూసేశారు. రంగంలోకి దిగిన పోలీసులు డ్రోన్ ను స్వాధీనం చేసుకుని విచారణ ప్రారంభించారు. విచారణలో ఇది ఫార్మా కంపెనీకి చెందిన డ్రోన్ గా తేలింది.
Marriage cheater arrested in Tamil Nadu:ప్రస్తుత కాలంలో అమ్మాయిల అంచానాలను అందుకుంటేనే పెళ్లిళ్లు జరుగుతున్నాయి. చాలా మంది యువకుల వయస్సు 35-40 ఏళ్లకు చేరుకున్నా వివాహాలు కావడం లేదు. ఇదో కోణం అయితే కొంత మంది అమ్మాయిలు మాత్రం బెస్ట్ కావాలంటూ.. మోసగాళ్ల చేతుల్లో పడుతున్నారు. వారిని పెళ్లి చేసుకున్న తర్వాత కానీ తెలియడం లేదు అసలు బాగోతం. ఉద్యోగం ఉందని నమ్మించి యువతులను బుట్టలో వేసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే తమిళనాడు రాష్ట్రంలో జరిగింది.
Covid BF.7 Variant May Not Be As Serious In India As In China: చైనాను కల్లోలం సృష్టిస్తోంది కరోనా కొత్త వేరియంట్. ఒమిక్రాన్ బీఎఫ్-7 వేరియంట్ వల్ల చైనాలో ఉప్పెనలా కరోనా కేసులు వస్తున్నాయి. అక్కడ గడిచిన 20 రోజుల్లోనే దాదాపుగా 25 కోట్ల కేసులు నమోదు అయినట్లు తెలుస్తోంది. వచ్చే వారంలో ఒకే రోజు 3.7 కోట్ల కేసులు నమోదు అవుతాయని పలు అంతర్జాతీయ సంస్థలు అంచనావేస్తున్నాయి. ఇప్పటికే చైనా రాజధాని బీజింగ్ తో పాటు వాణిజ్య రాజధాని…
On Actor Tunisha Sharma's Death, BJP MLA's "Love Jihad" Theory: సీరియల్ నటి తునీషా శర్మ మరణంపై రాజకీయ దుమారం రేగుతోంది. ఆమె మరణంలో లవ్ జిహాద్ కోణం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మహారాష్ట్రలో పాల్ఘర్ జిల్లాలోని వాసాయిలో తునీషా శర్మ ఓ టీవీ షో సెట్ లో ఆత్మహత్యకు పాల్పడింది. ‘అలీ బాబా: దస్తాన్-ఇ-కాబుల్’ అనే టీవీ షోలో తునీషా శర్మ సహ నటుడు షీజాన్ మహ్మద్ ఖాన్ వల్లే తను ఆత్మహత్యకు పాల్పడిందనే వాదనలు వినిపిస్తున్నాయి. తాజాగా తునీషా…
Taliban Bans Women From Working In NGOs: మహిళల స్వేచ్ఛపై మరోసారి తాలిబాన్ పాలకులు ఉక్కుపాదం మోపారు. ఆఫ్ఘనిస్తాన్ లో అధికారం చేపట్టినప్పటి నుంచి తాలిబాన్లు మహిళలపై ఆంక్షలు విధిస్తూనే వస్తున్నారు. మహిళలను వంటింటికే పరిమితం చేశారు. బయటకు వెళ్లాలన్నా పూర్తిగా హిజాబ్ ధరించి, కుటుంబంలోని మగవారిని తోడు తీసుకెళ్లాలనే నియమాలను విధించారు. ఇదిలా ఉంటే మరోసారి మహిళలపై ఆంక్షలు విధించింది అక్కడి తాలిబాన్ గవర్నమెంట్.
Biggest Arms Recovery, Forces Stop Major Pak Attempt In Kashmir: దాయాది దేశం పాకిస్తాన్ ప్రశాంతంగా ఉన్న జమ్మూ కాశ్మీర్ లో అలజడులు రేపేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత నుంచి భారత భద్రతా బలగాలు ఉగ్రవాదులను వెంటాడి వేటాడి మట్టుబెడుతున్నాయి. దీంతో కొత్తగా హైబ్రీడ్ టెర్రిరిజాన్ని కూడా ప్రారంభించాయి ఉగ్రవాద సంస్థలు. అమాయకులైన పౌరులను కాల్చి చంపేస్తున్నాయి. అయితే ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న వారిని కూడా భద్రతా బలగాలు చంపేస్తున్నాయి. దీంతో కాశ్మీర్లో మళ్లీ ఉగ్రవాద చర్యలను…
India to receive 3rd squadron of S-400 air defence missile system: ఉక్రెయిన్-రష్యాల మధ్య యుద్ధం జరుగుతున్నా, ప్రపంచ దేశాలు రష్యాపై ఆంక్షలు విధిస్తున్నా.. భారత్, రష్యాల మధ్య బంధం బలంగానే ఉంది. స్వాతంత్య్రం అనంతరం నుంచి భారత రక్షణ రంగ వ్యవస్థ ఎక్కువగా రష్యా మీదే ఆధారపడుతోంది. చాలా సందర్భాల్లో వెస్ట్రన్ దేశాలు భారత్ కు మద్దతు తెలపకున్నా.. రష్యా అండగా నిలిచింది. ఈ నేపథ్యంలోనే భారత రక్షణ కోసం అత్యంత శక్తివంతమైన క్షిపణి నిరోధక వ్యవస్థ ఎస్-400ను రష్యాను…
UP Man Kills Live-In Partner: ఢిల్లీలో శ్రద్ధావాకర్ హత్య దేశంలో ఎంత సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే. ఈ ఘటన తర్వాత దేశంలో అనేక ప్రాంతాల్లో సహజీవనంలో ఉన్న తమ భాగస్వామని హత్య చేసిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇదిలా ఉంటే ఉత్తర్ ప్రదేశ్ లో కూడా ఇలాంటి ఓ హత్యే తాజాగా వెలుగులోకి వచ్చింది. నిందితుడు తనతో లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్న మహిళను ఏడు నెలల క్రితం చంపేసినట్లు పోలీసులు గుర్తించారు.
VHP warning on Christmas celebrations: క్రిస్మస్ వేడుకలపై హిందూ సంస్థ విశ్వహిందూ పరిషత్(వీహెచ్పీ) వార్నింగ్ ఇచ్చింది. మధ్యప్రదేశ్ భోపాల్ లోని పాఠశాలలు విద్యార్థులు ఎవరూ కూడా శాంతాక్లాజ్ వేషధారణ ధరించేందుకు అనుమతించకూడదని హెచ్చరించింది. ఇదే విషయంపై భోపాల్ నగరంలోని అన్ని విద్యాలయాలకు వీహెచ్పీ లేఖలు రాసింది. సనాతన హిందూ మతం, సంస్కృతిని విశ్వసించే విద్యార్థులను క్రిస్మస్ చెట్లను తీసుకురావానలి.. శాంటాక్లాజ్ దుస్తులు ధరించాలని బలవంతం చేస్తున్నారని ఆరోపించింది.