Encounter: మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఎన్‌కౌంటర్.. మైలారపు అడెల్లు భార్య మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2 Naxals killed in encounter with security forces on Maharashtra-Chhattisgarh border: మహారాష్ట్ర, చత్తీస్ గఢ్ సరిహద్దుల్లో పోలీసులు, నక్సలైట్ల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. మహారాష్ట్రలోని గడ్చిరోలి, చత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లాల పోలీసులు సంయుక్తంగా ఈ మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ నిర్వహించారు. శుక్రవారం ఉదయం ఈ ఎన్ కౌంటర్ జరిగింది. ఒక మహిళా మావోయిస్టుతో పాటు ఇద్దరు నక్సల్స్ మరణించారు. ఇరు వర్గాల మధ్య ఎన్ కౌంటర్ జరుగుతున్న సమయంలో మరికొంత మంది నక్సలైట్లు అడవిలోకి పారిపోయినట్లుగా పోలీస్ అధికారులు వెల్లడించారు. ఈ ఎన్ కౌంటర్ లో కీలక మావోయిస్టు మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్ భార్య కంతి లింగవ్వ(35) మరణించింది. లింగవ్వ స్వస్థలం నిర్మల్ జిల్లా కడెం.
Read Also: Gurnam Singh: బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే దేశవ్యాప్తంగా రైతుబంధు..
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
గడ్చిరోలి పోలీస్ సీ-60 యూనిట్, చత్తీస్ గఢ్ డీఆర్జీ పోలీసులు సరిహద్దులోని దమ్రంచ అటవీ ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తుండగా.. నక్సలైట్లు తారసపడ్డారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. నక్సలైట్లు ఆరోమేటిక్ రైఫిళ్లను ఉపయోగిస్తూ పోలీసులపైకి కాల్పులు జరపడంతో భద్రతా దళాలు ఎదురుకాల్పులకు దిగాయి. ఎన్‌కౌంటర్ స్థలంలో ఇద్దరు నక్సలైట్ల మృతదేహాలు లభ్యమయ్యాయని, ఆ ప్రాంతంలో ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని గడ్చిరోలి పోలీసు సూపరింటెండెంట్ నీలోత్‌పాల్ తెలిపారు. గడ్చిరోలి పోలీసులు, బీజాపూర్ పోలీసుల బృందాలు దమ్రంచ అడవుల్లో పెట్రోలింగ్‌ను కొనసాగిస్తున్నారు.
ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతం తెలంగాణ సరిహద్దుల్లోనే ఉంది. భూపాలపల్లి జిల్లాను అనుకునే మహారాష్ట్రలోని గడ్చిరోలి, చత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లాలు ఉన్నాయి. భౌగోళికంగా ఈ మూడు రాష్ట్రాలను గోదావరి, ఇంద్రావతి నదులు వేరు చేస్తున్నాయి. ఇరు వైపులా దట్టమైన అటవీ ప్రాంతం ఉంది. ఈ ఎన్ కౌంటర్ తో ములుగు, భూపాలపల్లి జిల్లాల పోలీసులు కూడా అప్రమత్తం అయ్యారు. అడెల్లు భాస్కర్ పోలీసులకు మోస్ట్ వాంటెడ్ గా ఉన్నాడు. గతంలో కుమ్రం భీం ఆసిఫాబాద్లో పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టు ఉద్యమాన్ని మళ్లీ ప్రారంభించాలని అడెల్లు భావిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..