Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ మిస్ అయ్యారా?.. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఫుల్ వీడియో మీకోసమే!
- వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్
- 18 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి
- వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఫుల్ వీడియో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaibhav Sooryavanshi Batting Highlights vs Zimbabwe: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి తన విధ్వంసకర బ్యాటింగ్‌తో క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరిచాడు. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన ఈ 15 ఏళ్ల యువ ఆటగాడు.. తొలి సిరీస్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. మూడు మ్యాచ్‌ల్లో వరుసగా 14, 13, 15 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. దాంతో అతడిపై విమర్శలు వచ్చాయి. ‘ఐపీఎల్ ఫామ్ ఏమైంది’, ‘అంతర్జాతీయ క్రికెట్ అంటే ఆషామాషీ కాదు’ అంటూ విమర్శించారు.
అయితే జింబాబ్వే పర్యటనలో మాత్రం వైభవ్ సూర్యవంశీ తన అసలు సత్తాను ప్రపంచానికి చూపించాడు. ఈ సిరీస్‌కు సీనియర్ వికెట్‌కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ ఎంపిక కాకపోవడంతో వచ్చిన అవకాశాన్ని బుడ్డోడు రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. గురువారం హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన తొలి టీ20లో వైభవ్ మొదటి బంతి నుంచే దూకుడుగా ఆడాడు. ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగుతూ 18 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేశాడు. మొత్తంగా 19 బంతులు ఎదుర్కొన్న అతడు 4 ఫోర్లు, 4 భారీ సిక్సర్లతో 50 పరుగులు చేసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతడి మెరుపు ఇన్నింగ్స్‌తో భారత్ లక్ష్యాన్ని కేవలం 13.2 ఓవర్లలోనే ఛేదించింది.
Also Read
- ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
- Team India Record: టీ20ల్లో టీమిండియా నయా రికార్డు.. ప్రపంచంలోని మొదటి జట్టు..!
- ODI Double Centuries: వన్డేల్లో డబుల్ సెంచరీలు బాదిన భారత బ్యాటర్లు వీరే.. రోహిత్, గిల్ మాత్రం ఎంతో ప్రత్యేకం!
- India vs Pakistan: "అసలు మజా అప్పుడే".. దాయాదుల మధ్య పసిడి పోరు..
అయితే ఈ మ్యాచ్‌ను చాలా మంది అభిమానులు ప్రత్యక్షంగా వీక్షించలేకపోయారు. జింబాబ్వే పర్యటన మ్యాచ్‌లకు భారత్‌లో జియోహాట్‌స్టార్‌లో లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో లేకపోవడంతో చాలామంది క్రికెట్ ప్రేమికులు వైభవ్ విధ్వంసకర ఇన్నింగ్స్‌ను మిస్ అయ్యారు. ఈ మ్యాచ్‌కు ఫ్యాన్‌కోడ్ యాప్‌లో మాత్రమే ప్రత్యక్ష ప్రసారం అందుబాటులో ఉండటంతో ప్రతి ఒక్కరికీ చూసే అవకాశం దక్కలేదు.
జింబాబ్వేలో సిరీస్ జరుగుతుండడంతో లైవ్ స్ట్రీమింగ్ జియో హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది. ఫ్యాన్ కోడ్ యాప్‌లో లైవ్ స్ట్రీమింగ్ కావడంతో చాలా మంది మ్యాచ్ మిస్ అయ్యారు. ఒకవేళ మీరు కూడా భారత్, వైభవ్ సూర్యవంశీ మెరుపు బ్యాటింగ్‌ను చూడలేకపోయి ఉంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బుడ్డోడి అద్భుతమైన షాట్లు, సిక్సర్లు, ఫోర్లు, హాఫ్ సెంచరీ పూర్తి చేసిన క్షణాలతో కూడిన ఫుల్ వీడియో ఇప్పుడు అందుబాటులో ఉంది. భారత క్రికెట్‌కు మరో భవిష్యత్ సూపర్ స్టార్‌గా గుర్తింపు పొందుతున్న వైభవ్ విధ్వంసకర ఇన్నింగ్స్‌ను చూసి ఆస్వాదించండి.
Vaibhav Sooryavanshi 50(19) against Zimbabwe 1st T20 ball by ball pic.twitter.com/jQ782ssRcN
— Smithian49 (@Markie49SS) July 24, 2026
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?