Flipkart Food Delivery: ఫుడ్ డెలివరీ రంగంలోకి ఫ్లిప్‌కార్ట్ గ్రాండ్ ఎంట్రీ.. స్విగ్గీ, జొమాటోకు కొత్త సవాల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Flipkart Food Delivery: ఫుడ్ డెలివరీ రేసులోకి ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడానికి ముమ్మరంగా సిద్ధమవుతోంది! వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఈ సంస్థ భారత్‌లో త్వరలోనే తన ఫుడ్ డెలివరీ సేవలను ప్రారంభించనుందని సమాచారం. ప్రారంభంలో భాగంగా ముందుగా బెంగళూరు నగరంలో పైలట్ ప్రాజెక్ట్‌గా ఈ సేవలను అందుబాటులోకి తేనుంది. అక్కడ వచ్చే ఫలితాలు, సాంకేతికతను పరిశీలించిన తర్వాతే ఇతర ప్రధాన నగరాలకు దీనిని విస్తరించాలని యోచిస్తోందట. ఇప్పటికే తీవ్ర పోటీ ఉన్న ఫుడ్ డెలివరీ మార్కెట్లో నిలదొక్కుకోవడానికి కస్టమర్లకు బలమైన, ఆకర్షణీయమైన ఆఫర్లతో కూడిన ప్రతిపాదనలను సిద్ధం చేసే పనిలో ఫ్లిప్‌కార్ట్ నిమగ్నమైంది. ఈ సేవలను ప్రత్యేక యాప్ ద్వారా అందించడంతో పాటు ‘ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్’ (ONDC) ప్లాట్‌ఫామ్‌పై కూడా అందుబాటులో ఉంచే అంశాన్ని సంస్థ పరిశీలిస్తోంది. అయితే, ఈ సర్వీస్ లాంచ్ సమయంపై ఫ్లిప్‌కార్ట్ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.
ఒకవైపు ఫుడ్ డెలివరీలోకి అడుగుపెడుతున్న తరుణంలోనే, మరోవైపు ఫ్లిప్‌కార్ట్ తీవ్రమైన వ్యాపార వివాదాల్లో చిక్కుకోవడం గమనార్హం. ఫ్లిప్‌కార్ట్ మార్కెట్లో పోటీని దెబ్బతీసేలా అనుచిత, వివక్షాపూరిత వ్యాపార విధానాలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ ‘ఫోరమ్ ఫర్ ఇంటర్నెట్ రిటైలర్స్, సెల్లర్స్ అండ్ ట్రేడర్స్’ (FIRST) సంస్థ ఇటీవల కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) ని ఆశ్రయించింది. ఫ్లిప్‌కార్ట్ GST మినహాయింపుల ద్వారా దాదాపు 3,000 కోట్ల రూపాయల నిధులను సమకూర్చుకుందని, ఆ సొమ్ముతో భారీ డిస్కౌంట్లు ఇస్తూ స్వతంత్రంగా వ్యాపారం చేసుకునే చిన్న అమ్మకందారుల పొట్టకొడుతోందని ఈ ఫిర్యాదులో తీవ్రస్థాయిలో ఆరోపించింది.
Also Read
- Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
- October 15: అక్టోబర్ 15 నుంచి ఏటీఎంలలో సరికొత్త రూల్స్! ఇక ఆ చిక్కులు ఉండవు..
- EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
తాజావార్తలు
-
IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!