Shreyas Iyer: 7 మ్యాచ్‌ల నిరీక్షణకు తెర.. రెండు చెత్త రికార్డుల నుంచి శ్రేయస్‌కు విముక్తి!
- తొలి టీ20లో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం
- శ్రేయస్ అయ్యర్‌కు వ్యక్తిగతంగా కూడా కలిసొచ్చిన తొలి టీ20
- రెండు చెత్త రికార్డుల నుంచి శ్రేయస్‌కు విముక్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shreyas Iyer Breaks Unwanted T20I Captaincy Records: జింబాబ్వే పర్యటనను టీమిండియా ఘన విజయంతో ప్రారంభించింది. గురువారం హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన తొలి టీ20లో భారత్ 7 వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టును ఓడించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ విజయం భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు వ్యక్తిగతంగా కూడా కలిసొచ్చింది. సర్పంచ్ సాబ్ కెప్టెన్సీ చేపట్టాక వరుస పరాజయాలు వెంటాడగా.. ఈ విజయం అతడికి భారీ ఊరటను ఇచ్చింది.
టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత శ్రేయస్ అయ్యర్ తొలి ఏడు మ్యాచ్‌ల్లో ఒక్క విజయం కూడా అందుకోలేదు. ఐర్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో భారత్ 2-0తో ఓడిపోగా.. ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో 4-0తో పరాజయం పాలైంది. మరో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. మొత్తం ఏడు మ్యాచ్‌ల్లో ఆరు ఓటములు, ఒక మ్యాచ్ ఫలితం లేకుండా ముగియడంతో.. భారత జట్టు టీ20 చరిత్రలోనే అత్యంత సుదీర్ఘ విజయరహిత పరంపరను నమోదు చేసింది. అయితే జింబాబ్వేపై విజయం సాధించడం ద్వారా ఆ చెత్త రికార్డుకు బ్రేక్ పడింది.
Also Read
- WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
- Rohit Sharma: రోహిత్ శర్మకు ప్రమాదం.. బస్ దిగుతుండగా కాలుజారి పడిపోయిన హిట్ మ్యాన్..
- BCCI: అతడు కెప్టెన్ అయ్యాకే అంతా మారింది.. బీసీసీఐ మైండ్ బ్లాక్ డెసిషన్.. పాక్ మాజీ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు!
- Virat Kohli: ఫేవరేట్ బ్యాటింగ్ పార్ట్నర్, డేంజరస్ బౌలర్, బెస్ట్ కెప్టెన్ ఎవరు?.. విరాట్ కోహ్లీ సమాధానాలు ఇవే!
అంతేకాదు శ్రేయస్ అయ్యర్ మరో చెత్త రికార్డు నుంచి కూడా విముక్తి పొందాడు. అంతర్జాతీయ టీ20ల్లో వరుసగా ఏడు టాస్‌లు గెలిచి కూడా.. ఒక్క మ్యాచ్ గెలవని కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్ నిలిచాడు. ఈ చెత్త రికార్డు జాబితాలో బల్గేరియా మాజీ కెప్టెన్ ప్రకాశ్ మిశ్రా (ఏడు మ్యాచ్) తో కలిసి శ్రేయస్ సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు జింబాబ్వేపై విజయం సాధించడంతో ఆ అపజయ పరంపరకు కూడా బ్రేక్ పడింది. అర్జెంటీనాకు చెందిన హెర్నాన్ ఫెన్నెల్ ఆరు మ్యాచ్‌లతో తర్వాతి స్థానంలో ఉన్నాడు.
జింబాబ్వేతో జరిగిన తొలి టీ20లో భారత్ అన్ని విభాగాల్లో ఆధిపత్యం చెలాయించింది. ముందుగా బౌలర్లు జింబాబ్వేను 125/7కే పరిమితం చేశారు. అనంతరం 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ 18 బంతుల్లోనే అర్ధశతకం బాదడంతో భారత్ లక్ష్యాన్ని 13.2 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో టీమిండియా కొత్త ఆరంభం చేసింది. వరుస పరాజయాల తర్వాత వచ్చిన ఈ విజయం జట్టుకు మాత్రమే కాకుండా కెప్టెన్‌గా అయ్యర్‌కు కూడా ఎంతో ఆత్మవిశ్వాసాన్ని అందించింది. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ అదే జోరును కొనసాగించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భారత్ చూస్తోంది.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!