NIA, IT raids across the country: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ), ఐటీ డిపార్ట్మెంట్లు మంగళవారం దాడులు నిర్వహిస్తున్నాయి. గ్యాంగ్ స్టర్- టెర్రర్ లింకులపై ఎన్ఐఏ విస్తృతంగా దాడులు చేస్తోంది. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ, చండీగఢ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ మరియు మధ్యప్రదేశ్లోని 72 ప్రదేశాల్లో ఏకకాలంలో దాడులు చేస్తోంది. ఉత్తరప్రదేశ్లోని పిలిభిత్లో ఆయుధాల సరఫరాదారు ఇంటిపై ఎన్ఐఏ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో పాకిస్తాన్ నుంచి సరఫరా చేసిన వస్తువులను కనుక్కున్నారు. గ్యాంగ్ స్టర్లు లారెన్స్ బిష్ణోయ్-నీర్జ్…
Maoists warning letter to Congress: మావోయిస్టులు కాంగ్రెస్ పార్టీకి వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని చెబుతూ చత్తీస్ ఘడ్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ మావోయిస్టులు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. పశ్చిమ బస్తర్ డివిజన్ మావోయిస్టు కమిటీ కార్యదర్శి మోహన్ పేరుతో లేఖను విడుదల చేశారు. చత్తీస్ ఘడ్ లో సీఎం భూపేష్ బఘేల్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని ఆరోపించింది మావోయిస్టు పార్టీ.
Parliament: ప్రతిపక్ష ఎంపీలపై రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖర్ సీరియస్ అయ్యారు. సభా నియమాలను, సభా హక్కులను ఉల్లంఘించారనే ఆరోపణల నేపథ్యంలో 12 మంది ప్రతిపక్ష ఎంపీల పేర్లను రాజ్యసభ ప్రివిలేజెస్ కమిటీకి సిఫారసు చేశారు. ఇందులో 9 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉండగా, ముగ్గురు ఆప్ ఎంపీలు ఉన్నారు. కమిటీ పరిశీలించి, దర్యాప్తు చేసి నివేదికను సమర్పించాలని జగ్దీప్ ధన్ఖర్ ఆదేశించారు. దీనికి అనుగుణంగా ఎంపీలపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
Pakistan Economic Crisis:రాజకీయ అస్థిరత, తీవ్ర ఆర్థిక సంక్షోభం దాయాది దేశం పాకిస్తాన్ ను ఇబ్బందుల్లోకి నెట్టేశాయి. ఆ దేశ రక్షణ మంత్రి ఏకంగా పాకిస్తాన్ ఇప్పటికే దివాళా తీసిందని వ్యాఖ్యానించడం చూస్తే ఆ దేశ పరిస్థితి ఏంటో తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇటీవల సంక్షోభం నుంచి బయటపడేందుకు పాకిస్తాన్, అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్)తో చర్చలు నిర్వహించింది. అయితే ఐఎంఎఫ్ పెట్టిన పాకిస్తాన్ ఒప్పుకోకపోవడంతో ఈ ఒప్పందంపై స్పష్టత రాలేదు.
father kills daughter: తన కూతురు రాత్రి వేళల్లో లవర్ తో మాట్లాడుతోందని ఓ తండ్రి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. దీనికి కుటుంబ సభ్యులు సహకరించారు. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని చక్రధర్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చైసాబాలో చోటు చేసుకుంది. ఈ హత్య నుంచి తప్పించుకునేందుకు కూతురు లవర్ ను నిందితుడిగా చిత్రీకరించేందుకు తండ్రితో పాటు అతని ఇద్దరు కొడుకులు విశ్వప్రయత్నం చేశారు.
MyGate Lays Off: ఐటీ సెక్టార్ లో లేఆఫ్ పర్వం కొనసాగుతూనే ఉన్నాయి. గతేడాది చివర్లో ప్రారంభం అయిన ఐటీ ఉద్యోగుల తొలగింపు ఈ ఏడాది కూడా కొనసాగుతోంది. ఈ ఏడాది జనవరిలో వేల సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోయారు. ఇప్పటికే ప్రపంచ దిగ్గజ ఐటీ కంపెనీలైన అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా వంటివి వేలల్లో తమ ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఆర్థికమాంద్యం భయాల వల్ల ఇప్పటికే చాలా కంపెనీలు ఖర్చులను తగ్గించుకునే పేరుతో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ ప్రభావం ఎక్కువగా అమెరికా, యూరప్ దేశాల్లో…
Medical Miracle: హెచ్ఐవీ, క్యాన్సర్ తో పోరాడుతున్న ఓ రోగి రెండు వ్యాధుల నుంచి పూర్తిగా కోలుకున్నాడు. ఇలా ఒకే సమయంలో రెండు ప్రాణాంతక జబ్బులతో బాధపడే రోగిని ‘ డ్యూసెల్డార్ప్ పేషెంట్’గా వ్యవహరిస్తారు. ప్రాణాంతకమైన క్యాన్సర్ అయిన ల్యూకేమియా కోసం స్టెమ్ సెల్ చికిత్స తీసుకున్న తర్వాత సదరు రోగి క్యాన్సర్, హెచ్ఐవీ నుంచి కోలుకున్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. ఇలా కోలుకున్న వ్యక్తులు ప్రపంచంలో ముగ్గురే ఉన్నారు. గతంలో బెర్లిన్, లండన్ లోని ఇద్దరు రోగులు ఇలాగే కోలుకున్నారు. తాజాగా ఫ్రాన్స్…
Roopa vs Rohini: కర్ణాటకలో ఇద్దరు మహిళా సివిల్ అధికారుల మధ్య వార్ చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు. కర్ణాటక దేవాదాయ కమిషనర్ ఐఏఎస్ అధికారి రోహిణి సింధూరిపై కర్ణాటక హస్తకళల అభివృద్ధి మండలి మేనేజింగ్ డైరెక్టర్ ఐపీఎస్ రూపా డి. మౌద్గిల్ వ్యక్తిగత విమర్శలకు దిగారు. ఫేస్ బుక్ వేదికగా రూపా, రోహిణి ఫోటోలు షేర్ చేసి ఆరోపణలు చేశారు.
Turkey Earthquake: భూకంపంలో అల్లాడుతున్న టర్కీని మరోసారి భూకంపం భయపెట్టింది. రెండు వారాల క్రితం 7.8, 7.5 తీవ్రతతో వచ్చిన భూకంపాలకు టర్కీ, సిరియా దేశాలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఇదిలా ఉంటే సోమవారం మరోసారి భూకంపం వచ్చింది. 6.4 తీవ్రతతో దక్షిణ టర్కీ నగరం అయిన అంటిక్యాలో భూకంపం సంభవించింది. దీని ప్రకంపనలు సిరియా, లెబనాన్, ఈజిప్ట్ వరకు వెళ్లాయి. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రీకృతం అయినట్లు యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ తెలిపింది.
Elon Musk Old video Goes Viral: ప్రపంచ కుబేరుల్లో అగ్రస్థానంలో ఉన్నారు ఎలాన్ మస్క్. టెస్లా, స్పేస్ ఎక్స్ తో పాటు ఇటీవల ట్విట్టర్ ను కూడా సొంతం చేసుకున్నారు. తను ఏ రంగంలో అడుగుపెట్టినా సక్సెస్ అవ్వాల్సిందే. అంతలా వ్యాపార సామ్రాజ్యంలో మస్క్ దూసుకుపోతున్నారు. ఇదిలా ఉంటే ఎలాన్ మస్క్ దాదాపుగా 25 ఏళ్ల క్రితం ఇంటర్నెట్ గురించి చెప్పిన మాటలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. రాబోయే రోజుల్లో ఇంటర్నెట్ ప్రపంచాన్ని ఏలుతుందని ఆయన అన్నారు. సరిగ్గా…