Odisha: అప్పటికే 11 మంది పిల్లలు.. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుందని భార్యను గెంటేసిన భర్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Odisha: తనకు అప్పటికే 11 మంది పిల్లలు. చాలీచాలని బతుకులు. రెక్కడితే కానీ డొక్కాడని కుటుంబం. దీంతో ఆ మహిళ భర్తకు చెప్పకుండా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ (ట్యూబెక్టబీ ఆపరేషన్) చేయించుకుంది. ఇది తెలిసిన భర్త ఆమెను ఇంట్లో నుంచి గెంటేశాడు. ఆధునిక యుగంలో ఉన్న కూడా కొన్ని ప్రాంతాల్లో మూఢనమ్మకాల మత్తు వీడటం లేదు. ఈ ఘటన ఒడిశాలోని కియోంఝర్ జిల్లాలో జరిగింది. మూడు రోజుల క్రితం తన భర్త ఇంటి నుంచి వెళ్లగొట్టడంతో జానకి దేహూరి తన పిల్లలతో కలిసి దిమిరియా గ్రామంలోని తన ఇంటి బయటే ఉంటోంది.
ప్రతీ సంవత్సరం పిల్లలకు జన్మనివ్వడం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి స్థానిక ఆశా కార్యకర్త ద్వారా ఒప్పించడంతో మహిళ ట్యూబెక్టమీకి వెళ్లాలని నిర్ణయించుకుంది. పెళ్లయిన 11 ఏళ్లలో ఆమె 11 మంది పిల్లలకు జన్మనిచ్చింది, అయితే వారిలో ఒకరు మరణించారు. నా పిల్లలు పెరుగుతున్నప్పుడు ప్రతీ సంవత్సరం గర్భం దాల్చడం చాలా ఇబ్బందిగా ఉందని.. మా ఊరి ఆడవాళ్లు చాలా మంది కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నా.. నా భర్త అర్థం చేసుకోకుండా నన్ను ఇంట్లో నుంచి వెళ్లగొట్టారని జానకి చెబుతోంది.
Also Read
- September 2026 Salary Update: కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. సెప్టెంబర్ జీతం, పెన్షన్ రేపే ఖాతాల్లోకి!
- Gyanesh Kumar: ప్రతిపక్షాల విమర్శల మధ్య CEC జ్ఞానేష్ కుమార్.. ఆయన ఎవరు, నేపథ్యం ఏమిటి?
- Jaishankar-Rubio: రూబియోతో జైశంకర్ భేటీ.. రష్యా ఆంక్షల బిల్లుపై అభ్యంతరం
- Bihar: లైంగిక కేసు నిందితుడి చెంప పగలగొట్టిన న్యాయవాది
Read Also: Gujarat: మేనల్లుడి పెళ్లి.. జనాలపై నోట్ల వర్షం కురిపించిన మాజీ సర్పంచ్..
మరోవైపు ఆపరేషన్ చేయించుకుని భార్య నేరం చేసిందని ఆరోపిస్తున్నాడు ఆమె భర్త రవి. మేము భూయాన్ కమ్యూనిటికి చెందిన వారమని.. సమాజంలో ఉన్న నమ్మకం ప్రకారం ఆడవాళ్లకు ఆపరేషన్ చేస్తే నీళ్లు రావని.. నేను దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానం రవి దేహూరీ అన్నారు. ఒక వేళ భార్య ఇంట్లోకి వచ్చేప్రయత్నం చేస్తే చంపేందుకు మారణాయుధాలతో ఇంటి ముందే తిరుగుతున్నాడు.
తరచూ గర్భం దాల్చడం వల్ల జానకీ ఆరోగ్యం దెబ్బతిందని.. గర్భం దాల్చలేనంత బలహీనంగా మారిందని.. 10 మంది పిల్లలను పెంచడం కుటుంబానికి కష్టం అవుతోందని ఆశా వర్కర్ విజయ లక్ష్మీ బిస్వాల్ అన్నారు. దీంతో అధికారులు రవిని ఒపించి అతని భార్యను ఇంట్లోకి రానివ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఎంతకు ఒప్పుకోకపోవడంతో అధికారులు జానకీ, ఆమె పిల్లలను సంరక్షణ కేంద్రానికి తరలించి, భర్త రవిపై పోలీసుకు ఫిర్యాదు చేస్తామని అధికారులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Vivo Y600i: వివో Y600i లిస్టింగ్.. 6.87 అంగుళాల డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీ!
-
India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
-
Horror Stories : మళ్లీ హారర్ కామెడీ, హారర్ థ్రిల్లర్స్‌పై బాలీవుడ్ ఫోకస్
-
Tragedy: స్లీపర్ బస్సు అగ్నికి ఆహుతి.. 9 మంది ప్రయాణికులు మృతి
-
KVN : కేవియన్ ఖాతాలో మరో డిజాస్టర్.. బాక్సాఫీస్ బాంబ్‌గా హైవాన్
ట్రెండింగ్
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!