Physical assault on minor girl: మహిళలు, బాలికలపై అఘాయిత్యాలకు అడ్డుకట్ట పడటం లేదు. రోజుకు ఎక్కడోచోట అత్యాచారం ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఎక్కువగా తెలిసిన వారే అత్యాచారాలకు పాల్పడుతున్నారు. తాజాగా భూతవైద్యం పేరుతో ఓ మాంత్రికుడు మైనర్ బాలికపై పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టాడు. బాలిక గర్భం దాల్చడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన దేశరాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది.
Read Also: IND vs AUS 2nd Test: జడేజా దెబ్బ.. పేకమేడలా కూలిన ఆస్ట్రేలియా.. 113 పరుగులకే ఆలౌట్
ఢిల్లీకి చెందిన ఓ భూతవైద్యుడు 14 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆమె తల్లి భూతవైద్యం కోసం ఓ మాంత్రికుడి వద్దకు తీసుకెల్లింది. భూతవైద్యం ముసుగులో నిందితుడు బాలికపై పలుమార్లు అత్యాచారానికి చేశాడు. బాలిక రెండు నెలల గర్భిణి అని తేలడంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఢిల్లీ పోలీసులు పోక్సో చట్టం కింద నిందితుడిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై లోతుగా విచారిస్తున్నారు.
ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న బాబా హరిదాస్ నగర్ పోలీసులు శుక్రవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గత కొంత కాలంగా బాలిక ఆరోగ్యం బాగా లేదు.. ఆ తరువాత దీన్ని అలుసుగా భావించి నిందితుడు తరుచుగా బాలిక ఇంటికి వచ్చి, తల్లిని గది నుంచి బయటకు పంపి బాలికపై అత్యాచారం చేసేవాడు. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై పోక్సో, అత్యాచారం సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.