Balakot Airstrike: బాలాకోట్ దాడులకు జరిగి నాలుగేళ్ల అయింది. పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ 2019 ఫిబ్రవరి 14న పుల్వామా దాడి పాాల్పడినందుకు గట్టిగా బుద్ది చెప్పింది. పుల్వామా ఎటాక్ లో 46 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది మరణించారు. ఈ ఘటనపై యావత్ దేశం పాకిస్తాన్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోసారి ఇలాంటి ఘటన పాల్పడాలంటే పాక్ వెన్నులో వణుకు పుట్టేలా గుణపాఠం చెప్పాలని భారత్ భావించింది. ఈ నేపథ్యంలో బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. పాక్ భూభాగంలోకి వెళ్లి మరీ…
Priyanka Gandhi criticizes BJP: చత్తీస్గఢ్ రాజధాని రాయపూర్ వేదికగా కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మూడు రోజుల పాటు జరిగిన ఈ సమావేశాలు ఆదివారంతో ముగియనున్నాయి. 2024 ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడానికి పార్టీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వచ్చే ఎన్నికల్లో మిత్రపక్షాలు అన్నీ కలిసి బీజేపీని ఎదుర్కోవాలని తీర్మానం చేశాయి. ఇదిలా ఉంటే చివరి రోజు రాహుల్ గాంధీతో పాటు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రసంగించనున్నారు.
Kashmiri Pandit shot dead: జమ్మూ కాశ్మీర్ లో మరోసారి రెచ్చిపోయారు ఉగ్రవాదులు. గత కొంత కాలంగా అమాయకులను, మైనారిటీలను, వలస కూలీలు, హిందూ పండిట్లను టార్గెట్ చేస్తూ దాడులు చేస్తున్నాయి. హైబ్రీడ్ టెర్రరిజాన్ని అవలంభిస్తున్నాయి ఉగ్రవాద సంస్థలు. ఇదిలా ఉంటే తాజాగా మరో కాశ్మీరీ పండింట్ ను కాల్చి చంపారు ఉగ్రవాదులు. పుల్వామా జిల్లాలో ఆదివారం కాశ్మీరీ పండిట్ వర్గానికి చెందిన సంజయ్ శర్మని ఉగ్రవాదులు కాల్చిచంపారని పోలీసులు వెల్లడించారు.
Pakistan: పాకిస్తాన్ లో ఇప్పుడో యువతి వీడియో తెగవైరల్ అవుతోంది. ఎంబీబీఎస్ డాక్టర్ అయిన పాకిస్థానీ అమ్మాయి షాజీయా ఎలా మోసపోయిందనే వీడియోని ఫిబ్రవరి 20న సయ్యద్ బాసిత్ అలీ అధికారిక యూట్యూబ్ ఛానెల్ లో పోస్ట్ చేశారు. ఇది ప్రస్తుతం పాకిస్తాన్ చాలా వైరల్ అవుతోంది. ఆ అమ్మాయి మోసపోయిన తీరును చూసి చాలా మంది బాధపడుతున్నారు. ఇంపోర్ట్-ఎక్పోర్ట్ వ్యాపారం అని చెప్పుకున్న ఓ కుటుంబంలోకి డాక్టర్ అయిన షాజియా కోడలుగా వెళ్లింది. తీరా ఐదారు నెలల తర్వాత అసలు విషయం బయటపడింది.
Google now lays off robots: గతేడాది టెక్ ఉద్యోగుల లేఆఫ్స్ ఈ ఏడాది కూడా కొనసాగతున్నాయి. జనవరి నెలలో ప్రముఖ కంపెనీలు భారీగా ఉద్యోగులను తొలగించాయి. ఇప్పటికే దిగ్గజ ఐటీ కంపెనీలు గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్, ట్విట్టర్, అమెజాన్ వంటి కంపెనీలు వేలల్లో తమ ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. గూగుల్ ఇటీవల 12,000 మంది ఉద్యోగులను తొలగించింది. ఇదిలా ఉంటే ఉద్యోగులనే కాదు, సంస్థలో పనిచేస్తున్న రోబోలను కూడా తొలగిస్తున్నట్లు గూగుల్ నిర్ణయం తీసుకుంది.
Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీస్ సిసోడియాను సీబీఐ ప్రశ్నించనుంది. ఈ కేసులో నమోదు అయిన ఛార్జీషీట్ లో సిసోడియా పేరు కూడా ఉంది. అయితే గత ఆదివారమే సీబీఐ ముందు సిసోడియా హాజరుకావాాల్సి ఉన్నా, విచారణకు మరింత సమయం కోరారు. తాను బడ్జెట్ సిద్ధం చేసే పనిలో ఉన్నానని అందుకే మరింత గడువు కావాలని కోరారు. దీంతో ఈ రోజు విచారణకు హాజరుకాబోతున్నారు.
Pakistan: పాకిస్తాన్ లో ఇస్లామిక్ మతఛాందసవాదులు ఎంతలా పెరిగి పోయారంటే దైవదూషణ పేరుతో ప్రాణాలు తీస్తున్నారు. ఏకంగా పోలీస్ స్టేషన్ల పై దాడులు చేస్తూ ప్రజలను చంపేస్తున్నారు. తాజాగా పాకిస్తాన్ తొలి ట్రాన్స్జెండర్ న్యూస్ యాంకర్ పై కాల్పులు జరిపారు దుండగులు. మార్వియా మాలిక్ (26) లాహోర్ లో ఫార్మసీ నుంచి తన ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో తుపాకీ దాడికి గురైంది.
Nikki Haley Comments on Pakistan, China: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు భారతసంతతికి చెందిన నిక్కీ హేలీ ప్రకటించారు. రిపబ్లికన్ పార్టీ నుంచి ఆమె పోటీలో నిలబడనున్నారు. ఈ మేరకు ఆమె ఇప్పటి నుంచి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. తాజాగా ఆమె పాకిస్తాన్, చైనా దేశాలపై విరుచుకుపడ్డారు. ఈ రెండు దేశాలను చెడ్డ దేశాలుగా విమర్శించారు. తాను అధికారంలోకి వస్తే అమెరికాకు వ్యతిరేకంగా ఉన్న దేశాలను నిధులను ఇవ్వబోమని స్పష్టం చేశారు.
Asaduddin Owaisi: ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మహారాష్ట్ర థానే జిల్లాలోని ముంబ్రా సబర్బన్ ప్రాంతంలో బహిరంగ ర్యాలీలో పాల్గొన్నారు. ఉద్దవ్ ఠాక్రే పార్టీ, పార్టీ గుర్తను కోల్పోవడంపై తనకు సానుభూతి లేదని ఆయన అన్నారు. ముంబ్రా ఎందుకు ఉనికిలోకి వచ్చింది.. ముంబై నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చే బలవంతం చేసింది ఎవరు..? టాడా కింద ప్రజలను జైళ్లలోకి నెట్టిన రోజులను తాను మరిచిపోలేదని అసద్ అన్నారు. ఎన్సీపికి చెందిన అజిత్ పవార్, సుప్రియా సూలే నాయకులు కాగలిగితే, ఉద్ధవ్ ఠాక్రే తండ్రి పుణ్యమా…
Russia Accuses West: భారత్ లో జరుగుతున్న జీ20 సమావేశాలను అస్థిర పరిచేందుకు వెస్ట్రన్ దేశాలు ప్రయత్నిస్తున్నాయంటూ రష్యా మండిపడింది. రష్యాకు వ్యతిరేకంగా ఈ వేదికను ఉపయోగించుకోవాలని అనుకుంటున్నాయని శనివారం ఆరోపించింది. అమెరికా, యూరోపియన్ యూనియన్, జీ7 దేశాలు రష్యా వ్యతిరేక మార్గంలో సమావేశాలను వాడుకుంటున్నాయని ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.