Nikki Haley Comments on Pakistan, China: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు భారతసంతతికి చెందిన నిక్కీ హేలీ ప్రకటించారు. రిపబ్లికన్ పార్టీ నుంచి ఆమె పోటీలో నిలబడనున్నారు. ఈ మేరకు ఆమె ఇప్పటి నుంచి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. తాజాగా ఆమె పాకిస్తాన్, చైనా దేశాలపై విరుచుకుపడ్డారు. ఈ రెండు దేశాలను చెడ్డ దేశాలుగా విమర్శించారు. తాను అధికారంలోకి వస్తే అమెరికాకు వ్యతిరేకంగా ఉన్న దేశాలను నిధులను ఇవ్వబోమని స్పష్టం చేశారు.
అమెరికా ప్రజల కష్టాన్ని వృథా కానివ్వనని, మన పక్షాలన నిలబడే మిత్ర దేశాలకు మాత్రమే సాయం అందిస్తామని అన్నారు. అమెరికా గత ఏడాది విదేశీ సాయం కోసం 46 బిలియన్లను ఖర్చు చేసిందని, పన్ను చెల్లింపుదారుల డబ్బు ఎక్కడికి వెళ్తుందో, వారు తెలుసుకునే హక్కు ఉంటుందని, ఇది ఎక్కువగా అమెరికా వ్యతిరేక దేశాలకు వెళ్తుందని తెలుస్తుందని అన్నారు. కొన్ని ఏళ్లుగా అమెరికా, ఇరాన్ కు 2 బిలియన్ డాలర్లను ఇచ్చిందని, అయితే ఆ దేశం అమెరికానే సవాల్ చేస్తుందని అన్నారు.
Read Also: Asaduddin Owaisi: ముస్లింలు శరద్ పవార్, ఠాక్రే, షిండేలా ఉండలేరా..?
జో బిడెన్ పరిపాలన పాకిస్తాన్ సైనిక సహాయాన్ని పున:ప్రారంభించిందని, పాక్ డజన్ కు పైగా తీవ్రవాద సంస్థలకు నిలయంగా ఉందని ఆరోపించారు. మిత్రదేశం ఇజ్రాయిల్ కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న పాలస్తీనాకు కూడా అమెరికా నిధులు వెళ్తున్నాయని అన్నారు. యూఎన్ లో అమెరికాపై వ్యతిరేకతను ప్రదర్శించే జింబాబ్వే కు కూడా వందల మిలియన్ డాలర్లను ఇచ్చిందని ఆమె ఆరోపించారు. పర్యావరణ కార్యకలాపాల కోసం చైనాకు అమెరికా డబ్బులు ఇస్తోందని, ప్రమాదం అని తెలసినా అమెరికా ఇలా చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఒక జో బైడెన్ ప్రభుత్వానికి మాత్రమే పరిమితం కాలేదనని, రిపబ్లికన్లు, డెమక్రాట్లు గత కొన్ని దశాబ్ధాలుగా ఇలాగే చెస్తున్నారని, నేను అధికారంలో వస్తే ఇలాంటివి నిలిపివేస్తానని హామీ ఇచ్చారు. ట్రంప్ హయాంలో పాకిస్తాన్ కు దాదాపుగా 2 బిలియన్ డాలర్ల సైనిక సహాయాన్ని నిలిపివేసిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు.