Kashmiri Pandit shot dead: జమ్మూ కాశ్మీర్ లో మరోసారి రెచ్చిపోయారు ఉగ్రవాదులు. గత కొంత కాలంగా అమాయకులను, మైనారిటీలను, వలస కూలీలు, హిందూ పండిట్లను టార్గెట్ చేస్తూ దాడులు చేస్తున్నాయి. హైబ్రీడ్ టెర్రరిజాన్ని అవలంభిస్తున్నాయి ఉగ్రవాద సంస్థలు. ఇదిలా ఉంటే తాజాగా మరో కాశ్మీరీ పండింట్ ను కాల్చి చంపారు ఉగ్రవాదులు. పుల్వామా జిల్లాలో ఆదివారం కాశ్మీరీ పండిట్ వర్గానికి చెందిన సంజయ్ శర్మని ఉగ్రవాదులు కాల్చిచంపారని పోలీసులు వెల్లడించారు.
Read Also: Pakistan: ఇంట్లో ఖరీదైన కార్లు.. చేసేది భిక్షాటన.. మోసపోయిన డాక్టర్..
మృతుడు దక్షిణ కాశ్మీర్ జిల్లాలోని అచన్ ప్రాంతంలో తన గ్రామంలో సాయుధ గార్డుగా పనిచేస్తున్నారు. సంజయ్ శర్మ స్థానికంగా ఉన్న మార్కెట్ కు వెళ్లిన క్రమంలో ఉగ్రవాదులు కాల్చి చంపారు. దీంతో అధికారులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి ఉగ్రవాదుల కోసం వేట సాగిస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. గతేడాది రాహుల్ భట్ అనే వ్యక్తిని ప్రభుత్వ కార్యాలయంలోనే కాల్చి చంపారు. దీని తర్వాత హిందూ మహిళా టీచర్ ని, అమ్రీన్ భట్ అనే టీవీ ఆర్టిస్టును ఇలాగే కాల్చిచంపారు. ఈ ఘటనల కారణంగా కాశ్మీర్ లోయలో ఉద్రిక్తత తలెత్తింది. ఈ ఘటనలకు పాల్పడిన టెర్రిస్టులను భద్రతా బలగాలు కాల్చిచంపాయి.