Khalistan sympathiser Amritpal Singh: ఖలిస్తానీ వేర్పాటువాద మద్దతుదారు అమృత్ పాల్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పంజాబ్ ప్రభుత్వాన్ని, భారతదేశాన్ని సవాల్ చేస్తూ హెచ్చరించారు. ఇటీవల అజ్నాలా పోలీస్ స్టేషన్ పై సాయుధులుగా వచ్చి దాడి చేశారు అమృత్ పాల్ సింగ్ మద్దతుదారులు. అతని అనుచరుడిని అరెస్ట్ చేయడంతో పెద్ద ఎత్తున ఖలిస్తానీ మద్దతుదారులు వచ్చి పోలీస్ స్టేషన్ పై దాడి చేశారు.
Bird Flu Outbreak In Jharkhand: జార్ఖండ్ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ వ్యాధి కలకలం సృష్టిస్తోంది. బొకారో జిల్లాలో ప్రభుత్వం నడిపే ఓ ఫౌల్ట్రీ ఫామ్ లో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందడంతో అక్కడి ప్రభుత్వం రక్షణ చర్యలు ప్రారంభించింది. వ్యాధి ప్రభావిత ప్రాంతంలోని 4000 కోళ్లు, బాతులను చంపే ప్రక్రియ ప్రారంభం అయింది. హెచ్5ఎన్1, ఏవియన్ ఇన్ ఫ్లూయెంజా వైరస్ రకం ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ‘కడక్ నాథ్’ కొళ్లలో గుర్తించారు. దీనివల్ల జిల్లాలోని లోహాంచల్ లోని కోళ్ల ఫారమ్ లో 800…
Alzheimers: చైనాలో 19 ఏళ్ల వ్యక్తికి మెదడుకు సంబంధించిన అరుదైన వ్యాధి ‘అల్జీమర్స్’ సోకినట్లు నిర్దారణ అయింది. జ్ఞాపకశక్తిపై ఈ వ్యాధి తీవ్రప్రభావాన్ని చూపిస్తుంది. సాధారణంగా వయసు పైబడిన వారికి మాత్రమే అరుదుగా ఈ వ్యాధి వస్తుంది. అయితే 19 ఏళ్ల వ్యక్తికి రావడం ప్రపంచంలో ఇదే తొలిసారని బీజింగ్ లోని క్యాపిటల్ మెడికల్ యూనివర్సిటీ, జువాన్ వు హాస్పిటల్ పరిశోధకులు వెల్లడించారు. యువకుడి జ్ఞాపకశక్తి రెండేళ్ల కాలంలో వేగంగా క్షీణించిందని పరిశోధకులు వెల్లడించారు.
Kiren Rijiju comments on pending cases: దేశంలో పెరుగుతున్న కేసులపై కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆందోళన వ్యక్తం చేశారు. ఇది న్యాయమూర్తుల తప్పు కాదని.. వ్యవస్థ తప్పు అని ఆయన అన్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు కేంద్రం అన్ని ప్రయత్నాలను చేస్తోందని అన్నారు. అనవసరమైన, వాడుకలోని చట్టాలను రద్దు చేయడం, కోర్టులో మౌళిక సదుపాయాలను మెరుగుపరచడం, సాంకేతికను వాడటం వంటివి చేస్తూ మెరుగైన వ్యవస్థ వైపే వెళ్తున్నామని అన్నారు.
Japan Earthquake: ప్రపంచంలో రోజు ఎక్కడో చోట భూకంపాలు వస్తూనే ఉన్నాయి. టర్కీ భూకంపం తర్వాత భూకంప మాట వింటనే జనాలు హడలిపోతున్నారు. శనివారం టర్కీలో 5.5 తీవ్రతతో మరోసారి భూకంపం వచ్చింది. 66 గంటల వ్యవధిలోనే 37 సార్లు భూప్రకంపనలు వచ్చాయి.
NIA court convicts 8 suspected IS operatives: కాన్పూర్ ఉగ్రవాద కుట్ర కేసులో 8 మంది అనుమానిత ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదులను ఎన్ఐఏ కోర్టు దోషులుగా తేల్చింది. లక్నోలోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఈ 8 మంది ఉగ్రవాద కుట్రలో పాలుపంచుకున్నారని కోర్టు వీరిని దోషులుగా నిర్దారించింది. ఉగ్రవాద అణిచివేతలో ఇది పెద్ద విజయం అని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) పేర్కొంది. అయితే త్వరలోనే వీరందరికి కోర్టు శిక్ష విధిస్తుందని ఎన్ఐఏ తెలిపింది.
Pakistan Economic Crisis: ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది పొరుగు దేశం పాకిస్తాన్. ఐఎంఎఫ్ సాయం కోసం ఎదురుచూస్తోంది. 1.1 బిలియన్ డాలర్లను ఐఎంఎఫ్ ఇస్తేనే ప్రస్తుతం పాకిస్తాన్ బతికిబట్టకడుతుంది. అయితే ఐఎంఎఫ్ పెట్టిన షరతులు కఠినంగా ఉన్నా కూడా పాక్ సర్కార్ అంగీకరించాల్సి వస్తోందని సాక్షాత్తు పాక్ ప్రధాని షెహజాబ్ షరీఫ్ అన్నారు. ఈ షరతుల నేపథ్యంలో పాకిస్తాన్ ఇబ్బడిముబ్బడిగా పన్నులు పెంచుతోంది. ఇప్పటికే ధరలు పెరిగి కష్టాల్లో ఉన్న పాక్ ప్రజలు మరింత కష్టాల్లోకి నెట్టేయబడుతున్నారు.
37 earthquakes strike Central Turkey in 66 hours: టర్కీ దేశాన్ని వరసగా భూకంపాలు వణికిస్తున్నాయి. ఈ నెల తొలివారంలో టర్కీని 7.8, 7.5 తీవ్రతతో ఉన్న రెండు శక్తివంతమైన భూకంపాలు తీవ్రంగా దెబ్బతీశాయి. టర్కీతో పాటు పొరుగున ఉన్న సిరియాలో కూడా తీవ్రంగా ఆస్తి, ప్రాణనష్టాలు వాటిల్లాయి. కొన్ని రోజలు వ్యవధిలోనే 1000కి పైగా ప్రకంపనలు వచ్చాయి. భూకంపం ధాటికి టర్కీ భూభాగం ఏకంగా 5-6 మీటర్ల వరకు పక్కకు కదిలింది అంటే ఎంత శక్తితో భూకంపాలు వచ్చాయో తెలుస్తోంది.
Lalu Prasad Yadav: కిడ్నీ మార్పిడి ఆపరేషన్ నుంచి కోలుకుంటున్న ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ బీజేపీని హెచ్చరించారు. శనివారం జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమి మహాగటబంధన్ ర్యాలీని ఉద్దేశిస్తూ వీడియోకాన్ఫరెన్స్ లో మాట్లాడారు. బీజేపీ దేశాన్ని కులం, మతం పేరుతో విభజించడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ దేశంలోని మైనారిటీలకు వ్యతిరేకం అని, మేము 2024 లోక్ సభ, 2025 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని తుడిచివేస్తాం అని అన్నారు.
Turkey Earthquake: వరస భూకంపాలతో టర్కీ అతలాకుతలం అవుతోంది. రెండు వారాల క్రితం టర్కీలో వచ్చిన భూకంపం ధాటికి ఆ దేశంతో పాటు పక్కనే ఉన్న సిరియా కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. రిక్టర్ స్కేలుపై 7.8, 7.5 తీవ్రతతో వచ్చిన వరస భూకంపాలు టర్కీ దక్షిణ ప్రాంతంతో తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఇప్పటికే ఈ రెండు దేశాల్లో కలిపి మరణాల సంఖ్య 50,000 వేలను దాటింది. ఇప్పుడిప్పుడే పునరావాస చర్యలు, ఇళ్ల పునర్నిర్మాణం వేగం అవుతోంది.