Asaduddin Owaisi: ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మహారాష్ట్ర థానే జిల్లాలోని ముంబ్రా సబర్బన్ ప్రాంతంలో బహిరంగ ర్యాలీలో పాల్గొన్నారు. ఉద్దవ్ ఠాక్రే పార్టీ, పార్టీ గుర్తను కోల్పోవడంపై తనకు సానుభూతి లేదని ఆయన అన్నారు. ముంబ్రా ఎందుకు ఉనికిలోకి వచ్చింది.. ముంబై నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చే బలవంతం చేసింది ఎవరు..? టాడా కింద ప్రజలను జైళ్లలోకి నెట్టిన రోజులను తాను మరిచిపోలేదని అసద్ అన్నారు. ఎన్సీపికి చెందిన అజిత్ పవార్, సుప్రియా సూలే నాయకులు కాగలిగితే, ఉద్ధవ్ ఠాక్రే తండ్రి పుణ్యమా అని నాయకుడిగా మారగలిగితే, ఏక్ నాథ్ షిండే- దేవేంద్ర ఫడ్నవీస్ లు నాయకులు కాగలిగితే, మహారాష్ట్ర ముస్లింలు ఎందుకు వారిలా ఉండలేరని ప్రశ్నించారు.
Read Also: Khalistan: భారత్‌పై విషాన్ని చిమ్మిన అమృత్‌పాల్ సింగ్.. పంజాబ్ స్వతంత్రం అవుతుందని ప్రగల్భాలు..
ముస్లిం ఐక్యత కోసం అసదుద్దీన్ ఓవైసీ పిలుపునిచ్చారు. నినానాదాలు చేయడం ద్వారా మనం ఒక్కటి కాలేదమని, ఐక్యంగా ఓట్లు వేసి నాయకులుగా మారిండి అని అన్నారు. ఔరంగాబాద్ పేరును శంభాజీ నగర్ గా మార్చి విషయాన్ని ప్రస్తావంచి ఓవైసీ ఈ అంశంపై శరద్ యాదవ్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. మా ప్రార్థన స్థలంపై దాడి గురించి నేను శరద్ పవార్ ను అడగాలని అనుకుంటున్నానని, విశాల్ ఘర్ లోని 500 ఏళ్ల నాటి పురాతన మందిరంపై దాడి గురించి ఆయన ఏం మాట్లాడలేదని, కానీ పూణేలో మాత్రం ముస్లిం ఓట్లు అడుగుతున్నారని అన్నారు.
రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తానని అంతా నన్ను నిందిస్తుంటారు కానీ నేను నిజం మాట్లాడుతున్నాని ఓవైసీ అన్నారు. ముస్లిం రిజర్వేషన్ల గురించి ఏ పార్టీ కూడా మాట్లాడదని, ముస్లింలకు మహారాష్ట్రలో రిజర్వేషన్లు ఉండకూడదా..? అని ప్రశ్నించారు. భూమిలేని ముస్లింలు మహరాష్ట్రలో ఉన్నారని, కానీ పవార్ దాని గురించి మాట్లాడరని అన్నారు.