Pakistan: పాకిస్తాన్ లో ఇప్పుడో యువతి వీడియో తెగవైరల్ అవుతోంది. ఎంబీబీఎస్ డాక్టర్ అయిన పాకిస్థానీ అమ్మాయి షాజీయా ఎలా మోసపోయిందనే వీడియోని ఫిబ్రవరి 20న సయ్యద్ బాసిత్ అలీ అధికారిక యూట్యూబ్ ఛానెల్ లో పోస్ట్ చేశారు. ఇది ప్రస్తుతం పాకిస్తాన్ చాలా వైరల్ అవుతోంది. ఆ అమ్మాయి మోసపోయిన తీరును చూసి చాలా మంది బాధపడుతున్నారు. ఇంపోర్ట్-ఎక్పోర్ట్ వ్యాపారం అని చెప్పుకున్న ఓ కుటుంబంలోకి డాక్టర్ అయిన షాజియా కోడలుగా వెళ్లింది. తీరా ఐదారు నెలల తర్వాత అసలు విషయం బయటపడింది.
తన బాధను షాజియా వివరించింది. లాహోర్ లోని సంపన్నులు ఎక్కువగా నివసించే ప్రాంతంలో తన కుటుంబం ఉండేదని చెప్పింది. నా పెళ్లిని నా కుటుంబం నిర్ణయించిందని, మొదటి 4-5 నెలలు అద్భుతంగా గడిచాయని, నేను ఏ పనిచేయాల్సిన పని లేదని, జీవితాన్ని ఆస్వాదించమని అత్తమామలు చెప్పారని షాజియా వెల్లడించింది. తాను విలాసవంతంగా జీవించినట్లు తెలిపింది. ఇంట్లో జిమ్, స్మిమ్మింగ్ ఫూల్, ల్యాండర్ క్రూయిజర్, ఫార్చ్యూనర్ కార్లు, పని వాళ్లు ఇలా అంతా చూస్తే ధనిక కుటుంబం లాగే ఉండేదని చెప్పింది.
Read Also: Google: ఉద్యోగులను తీసేశారు.. ఇప్పుడు రోబోలను తొలగించిన గూగుల్..
అయితే 4-5 నెలల తర్వా షాజియా షాకింగ్ విషయాన్ని గుర్తించింది. తన ఇంట్లో ఒక్కొక్కరుగా బయటకు వెళ్లడాన్ని గమనించింది. కుటుంబంలోని యువకులు, ముసలివాళ్లు కార్లలో ఎక్కడికో వెళ్తున్నట్లు పసిగట్టింది. అయితే ఒక రోజు బిల్డింగ్ బేస్మెట్ లోకి వెళ్లి చూడగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అందులో బిచ్చగాళ్ల వేషధారణ కోసం ఉన్న దుస్తులు, ఇతర సామాన్లను చూసింది. దీంతో అసలు విషయం అర్ధం అయింది షాజియాకు. తన కుటుంబం అడుక్కోవడానికి కార్లలో బయటకు వెళ్తున్నట్లు తెలుసుకుంది. భిక్షాటన గెటప్ కోసం పర్సనల్ మేకప్ మ్యాన్ ను కూడా ఏర్పాటు చేసుకుంది సదరు కుటుంబం.
Read Also: RK Roja:లోకేష్ తీరు పిచ్చోడి చేతికి రాయి ఇచ్చినట్లుంది
ఒకసారి షాజియా, కుటుంబ సభ్యులను అనుసరించింది. తన అత్తామామ, ఇతర కుటుంబ సభ్యులు గుంపులుగుంపులుగా అడుక్కోవడాన్ని చూసింది. ఆ సమయంలో నా జీవితంపై నాకే విరక్తి పుట్టిందని, మంచి కుటుంబానికి చెందిన ఎంబీబీఎస్ డాక్టర్ అయిన నేను మోసపోయానని గ్రహించానని షాజియా చెప్పింది. మా అత్తగారు రెండు కాళ్లు లేని వ్యక్తిగా, నా భర్త చేతులకు పట్టీలు వేసుకుని ముందు ఓ గిన్నె ఉంచుకొని అడుక్కునే వాడని, ఇదంతా చూసి దాదాపుగా నెల రోజుల పాటు కుంగిపోయానని వెల్లడించారు.
డబ్బు కన్నా ఆత్మగౌరవం ముఖ్యం అనుకుని ప్రస్తుతం ఆ కుటుంబాన్ని విడిచి ఉంటోంది షాజియా. కాబోయే భర్తను చూసి మురిసిపోకండి అని, కుటుంబం గురించి తెలుసుకోండని, వారు నిజాయితీగా జీవిస్తున్నారో లేదో తెలుసుకోవాలని డాక్టర్ షాజియా ఇతర పాకిస్తానీ మహిళలకు సూచిస్తోంది.