Google now lays off robots: గతేడాది టెక్ ఉద్యోగుల లేఆఫ్స్ ఈ ఏడాది కూడా కొనసాగతున్నాయి. జనవరి నెలలో ప్రముఖ కంపెనీలు భారీగా ఉద్యోగులను తొలగించాయి. ఇప్పటికే దిగ్గజ ఐటీ కంపెనీలు గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్, ట్విట్టర్, అమెజాన్ వంటి కంపెనీలు వేలల్లో తమ ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. గూగుల్ ఇటీవల 12,000 మంది ఉద్యోగులను తొలగించింది. ఇదిలా ఉంటే ఉద్యోగులనే కాదు, సంస్థలో పనిచేస్తున్న రోబోలను కూడా తొలగిస్తున్నట్లు గూగుల్ నిర్ణయం తీసుకుంది.
Read Also: Delhi Liquor Case: లిక్కర్ కేసులో సీబీఐ విచారణ.. మనీష్ సిసోడియా “జైల్” ట్వీట్
ఫలహార శాలల్లో పనిచేసే రోబోలను గూగుల్ తొలగిస్తున్నట్లు సమాచారం. కాఫెటేరియాల్లో శుభ్రం చేసేందుకు వినియోగిస్తున్న ‘ఎవ్రీడే రోబో’ విభాగాన్ని గూగుల్ తొలగించనుంది. ఎవ్రీడే రోబోట్స్ అనేది ప్రయోగాత్మక రోబోటిక్స్ ప్రాజెక్ట్. 100కి పైగా వన్ ఆర్డ్మ్ రోబోలను అభివృద్ధి చేయడంతో, వివిధ రోబోటిక్స్ ప్రాజెక్టులపై 200 కంటే ఎక్కువ మంది పనిచేస్తున్నారు. ఈ రోబోలు కాఫెటేరియాలోని చెత్తను శుభ్రం చేయడంతో పాటు రీసైక్లింగ్ చేస్తుంది. ఇతర పనులతో పాటు తలుపులు తెరవడానికి రూపొందించారు. కోవిడ్ సమయంలో కాన్ఫరెన్స్ రూంలను శుభ్రం చేయడానికి వీటిని ఉపయోగించారు.
అయితే రోబోలు ఉపయోగకరంగా ఉన్నప్పటికీ.. రోబోట్లను నిర్వహించడానికి చాలా ఖర్చు అవుతోంది. వీటి నిర్వహణ కోసం ఒక్కో దానికి పదివేల డాలర్లు ఖర్చు అవుతుందని అంచనా. దీంతో బడ్జెట్ కోతల్లో భాగంగా ఈ ఖర్చులను తగ్గించుకోవడానికి రోబో విభాగాన్ని తీసేస్తున్నారు.