India vs Pakistan: సరిగ్గా 20 ఏళ్ల క్రితం మార్చి 1, 2003 ప్రపంచ కప్ లో జరిగిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఎవరూ మరిచిపోరు. శివరాత్రి రోజే సచిన్ టెండూల్కర్ శివాలెత్తి పాకిస్తాన్ పై ఆడాడు. ఓ రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ టీమ్ పై శివతాండమే చేశాడు. వసీం అక్రమ్, వకార్ యూనస్, షోయబ్ అక్తర్ వంటి బౌలర్లను చీల్చి చెండాడాడు. భారీ స్కోర్ సాధించి, భారత్ ను ఓడిద్దాం అని అనుకున్న పాకిస్తాన్ కు సచిన్ చుక్కలు చూపించాడు. భారత్…
February Temperature: ఎండాకాలం ఇంకా పూర్తిగా రానేలేదు. అప్పుడు సూర్యుడు తన ప్రకోపాన్ని చూపిస్తున్నాడు. ఫిబ్రవరి నుంచే ఎండల తీవ్రత నమోదు అయింది. ఉదయం పూట కాస్త చలిగా ఉన్నప్పటికీ మధ్యాహ్నం మాత్రం ఎండల తీవ్రత ఎక్కువగానే ఉంటోంది. దేశంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.
Stray Dogs Issue: దేశంలో వీధికుక్కల దాడులు ఇటీవల కాలంలో చర్చనీయాంశం అయ్యాయి. తెలంగాణలో వీధికుక్కులు ఏకంగా ఓ నాలుగేళ్ల బాలుడిపై దాడి చేసి దారుణంగా చంపాయి. ఇదే విధంగా పలు రాష్ట్రాల్లో చిన్నారులపై వీధి కుక్కలు దాడులు చేశాయి. ఇదిలా ఉంటే జార్ఖండ్ బీజేపీ ఎమ్మెల్యే బిరంచి నారాయణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జార్ఖండ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో వీధికుక్కల అంశాన్ని లేవనెత్తారు.
S Jaishankar's Strong Reply To UK Minister: ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ రూపొందించిన ‘ ఇండియా: ది మోదీ క్వశ్చన్’ డాక్యుమెంటరీ తీవ్ర వివాదాస్పదం అయింది. 2002 గుజరాత్ అల్లర్ల నేపధ్యంలోొ అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోదీపై ఆరోపణలు గుప్పిస్తూ రెండు భాగాల డాక్యుమెంటరీని ప్రసారం చేసింది. అయితే ఈ డాక్యుమెంటరీ వివాదం ఇటు భారత్ లో అటు యూకేలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. భారత్ ప్రభుత్వం అయితే దీన్ని ఏకంగా ‘‘ వలసవాద మనస్తత్వం’’ అంటూ ఘాటు…
Health Benefits Of Beer: ఆల్కాహాల్ తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య నష్టాలు ఉంటాయని అంతా చెబుతుంటారు. అయితే కొన్ని సార్లు మితంగా తీసుకునే ఆల్కాహాల్ కూడా ఆరోగ్యానికి ప్రయోజనం చేకూరుస్తుంటుంది. ముఖ్యంగా బీర్ వల్ల 5 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బీర్ ను మితంగా తాగడం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఎక్కువగా ఇష్టపడే పానీయాల్లో బీర్ కూడా ఒకటి. ఇక వేసవి కాలంలో అయితే బీర్ వినియోగం తారాస్థాయికి చేరుకుంటుంది. బీర్ ను మితంగా తీసుకోవడం వల్ల…
Meghalaya: నాగాలాండ్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రాల ఎన్నికల రిజల్ట్ మార్చి 2న వెలువడబోతున్నాయి. ఇదిలా ఉంటే త్రిపురలో సొంతంగా బీజేపీ అధికారంలో వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అన్నీ అంచనా వేశాయి. దీంతో పాటు నాగాలాండ్ రాష్ట్రంలో మిత్రపక్షం ఎన్పీపీతో కలిసి బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది.
Al Badr Terrorist shot dead in Pakistan: భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేసిన ఉగ్రవాదులు ఒక్కొక్కరుగా హతం అవుతున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపుతున్నారు. భారత్ మోస్ట్ వాంటెడ్ హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాది బషీర్ అహ్మద్ పీర్ అలియాస్ ఇంతియాజ్ ఆలంను ఇటీవల పాకిస్తాన్ రావల్పిండి నగరంలో గుర్తు తెలియని వ్యక్తులు పాయింట్ బ్లాక్ లో కాల్చిచంపారు. ఇదిలా ఉంటే ఆదివారం మరో ఉగ్రవాది ఇలాగే హతమయ్యాడు. పాక్ ఉగ్రవాద సంస్థ అల్ బదర్ మాజీ కమాండర్ సయ్యద్ ఖలీద్ రజాను గుర్తు…
North Korea: ఉత్తర కొరియా ప్రత్యేకంగా దీని గురించి చెప్పాల్సిన పని లేదు. ఆ దేశ అధ్యక్షుడు, నియంత కిమ్ జోంగ్ ఉన్ పాలనలో అక్కడి చట్టాలను ఉల్లంఘిస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయో ఊహకు కూడా అందవు. పాశ్చాత్య దేశాల సినిమాలు, సీరియళ్లు, టీవీ షోలు చూస్తే అక్కడ చాలా కఠిన శిక్షలు ఉంటాయి. చిన్నవారు, పెద్దవారు అనే తేడా ఉండదు. శిక్షల పరిమాణంలో తక్కువ ఉండదు. కిమ్ నిరంకుశంలో ఉత్తరకొరియా ప్రజలకు మిగతా ప్రపంచం ఒకటి ఉందనేది కూడా తెలియదు.
PM Narendra Modi: దేశంలో వేగంగా విమానయాన రంగం విస్తరిస్తోందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. మరికొన్ని రోజుల్లో కర్ణాటకలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో అక్కడి అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నారు మోదీ. మరోసారి కర్ణాటకలో అధికారం చేజిక్కించుకోవాలని అనుకుంటోంది బీజేపీ. దీంతో భాగంగానే కొద్ది రోజుల వ్యవధిలో రెండుసార్లు కర్ణాటకలో పర్యటించారు ప్రధాని. ఇదిలా ఉంటే సోమవారం శివమొగ్గలో నిర్మించిన విమానాశ్రయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. హవాయ్ చెప్పులేసుకునే వారు కూడా విమానం ఎక్కాలన్న తమ సంకల్పం ఇప్పుడు నెరవేరుతోందని అన్నారు.
Woman Fights Wild boar: ఎంతటి కష్టం వచ్చినా కూడా తన బిడ్డలను కాపాడుకుంటుంది అమ్మ. తన పిల్లలకు కష్టం వస్తుందంటే ఎందాకైనా పోరాడుతుంది. తాజాగా ఇలాంటి ఘటనే చత్తీస్ గఢ్ రాష్ట్రంలో జరిగింది. తన కూతురును రక్షించుకోవడానికి 30 నిమిషాల పాటు అడవి పందితో పోరాడింది. చివరకు తాను ప్రాణాలు కోల్పోయి, కూతురును రక్షించుకుంది. ఈ విషాదకర సంఘటన చత్తీస్ గఢ్ రాష్ట్రంలోని కోర్బా జిల్లాలో జరిగింది. తల్లి ప్రేమకు ప్రతిరూపంగా నిలిచింది ఈ ఘటన.