Pakistan: పాక్ తొలి ట్రాన్స్‌జెండర్ న్యూస్ యాంకర్‌పై కాల్పులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ లో ఇస్లామిక్ మతఛాందసవాదులు ఎంతలా పెరిగి పోయారంటే దైవదూషణ పేరుతో ప్రాణాలు తీస్తున్నారు. ఏకంగా పోలీస్ స్టేషన్ల పై దాడులు చేస్తూ ప్రజలను చంపేస్తున్నారు. తాజాగా పాకిస్తాన్ తొలి ట్రాన్స్‌జెండర్ న్యూస్ యాంకర్ పై కాల్పులు జరిపారు దుండగులు. మార్వియా మాలిక్ (26) లాహోర్ లో ఫార్మసీ నుంచి తన ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో తుపాకీ దాడికి గురైంది. ఈ దాడిలో తృటిలో ప్రాణాలతో బయటపడింది. శుక్రవారం ఈ ఘటన జరిగింది. పాకిస్థాన్‌లోని ట్రాన్స్‌జెండర్ల కోసం పోరాడుతున్నందుకు గత కొంత కాలంగా తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని మాలిక్ పోలీసులకు తెలిపారు. ఇదే దాడికి కారణం అని ఆమె పేర్కొన్నారు.
Read Also: Nikki Haley: పాక్, చైనాలు చెడ్డ దేశాలు.. అధికారంలోకి వస్తే శత్రు దేశాలకు నిధులు ఇవ్వం..
Also Read
- US: అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో అదరగొట్టిన చైనా రోబోలు.. వీడియో వైరల్
- Pakistan: పాక్‌లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
- Imran Khan: ‘‘బ్రిటన్ జోక్యం చేసుకోవాలి’’.. ఇమ్రాన్‌ఖాన్‌పై యూకే మాజీ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
- Netherlands: విమానం గాల్లో ఉండగా పేలిన పవర్ బ్యాంక్.. షాకైన ప్రయాణికులు.. ఆ తర్వాత ఏమైందంటే..!
ప్రాణ భయంతో లాహోర్ వదిలి ఇస్లామాబాద్, ముల్తాన్‌లకు మకాం మార్చినట్లు మాలిక్ తెలిపారు. శస్త్రచికిత్స కోసం లాహోర్ వచ్చినప్పుడు ఈ దాడి జరిగింది. 2018లో మొదటిసారిగా లింగమార్పిడి చేసుకున్న వ్యక్తిగా మాలిక్ పాకిస్తాన్ లో రికార్డు సృష్టించారు. ఈమె నిర్ణయాన్ని కుటుంబం కూడా వ్యతిరేకించింది. పాకిస్తాన్ ఫ్యాషన్ డిజైన్ కౌన్సిల్ ఏటా నిర్వహించే ప్రముఖ ఫ్యాషన్ షోలో మొదటి లింగమార్పిడి మోడల్‌గా కనిపించింది. కొద్ది రోజుల నుంచి కోహినూర్ టీవీలో యాంకర్ గా పనిచేస్తోంది. 10వ తరగతి చదువుతున్న సమయంలోనే కుటుంబానికి దూరం అయ్యానని, బ్యూటీ సెలూన్లలో పనిచేశానని, కాలేజీలో చేరడానికి డబ్బు సంపాదించినా, అది అంత సులభం కాదని ఆమె అన్నారు. వీధిలో భిక్షాటన చేస్తున్న హిజ్రా కథకు నా కథ భిన్నంగా ఏం లేదని ఆమె అన్నారు.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!