Health Benefits Of Beer: ఆల్కాహాల్ తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య నష్టాలు ఉంటాయని అంతా చెబుతుంటారు. అయితే కొన్ని సార్లు మితంగా తీసుకునే ఆల్కాహాల్ కూడా ఆరోగ్యానికి ప్రయోజనం చేకూరుస్తుంటుంది. ముఖ్యంగా బీర్ వల్ల 5 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బీర్ ను మితంగా తాగడం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఎక్కువగా ఇష్టపడే పానీయాల్లో బీర్ కూడా ఒకటి. ఇక వేసవి కాలంలో అయితే బీర్ వినియోగం తారాస్థాయికి చేరుకుంటుంది. బీర్ ను మితంగా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, జీర్ణక్రియ మెరుగుపడటం వంటి ప్రయోజనాలు ఉంటాయి.
1) ఎముకల ఆరోగ్యానికి మంచిది:
ఎముకల ఆరోగ్యానికి బీర్ మంచిది. బీర్ అనేది డైటరీ సిలికాన్ యొక్క మూలం. ఎముకల ఆరోగ్యానికి ముఖ్యమైన ఖనిజం. మితంగా బీర్ తాగడం వల్ల ఎముకల సాంద్రత పెరుగుతుంది. ఎముకలు పలుచబడటాన్ని నిరోధిస్తుంది. ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
2) జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
బీర్‌లో ఉండే కరిగే ఫైబర్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు దీనిని జీర్ణక్రియకు బాగా సహాయపడతాయి. దీంతో పాటు బీర్ లో చేదుగా ఉండే ఆమ్లాలు ఉంటాయి. ఇవి జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి, ఆహారం జీర్ణం అవడాన్ని మెరుగుపరుస్తాయి.
Read Also: Mobile Phones: ఇద్దరు విద్యార్థుల ప్రాణాలను బలిగొన్న మొబైల్‌ఫోన్లు
3) గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
తక్కువ మొత్తంలో బీర్ వినియోగం వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. బీర్ లో యాంటీ ఆక్సిడెంట్లు, ముఖ్యంగా ప్లేవనాయిడ్స్, ఫినోలిక్ యాసిడ్లు ఉంటాయి. ఇవి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మరియు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉన్నాయని తేలింది.
4) డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
మితంగా బీరు తాగడం వల్ల డయాబెటిస్ ప్రమాదం తగ్గుతుంది. ఇన్సులిన్ సెన్సిటివిీని మెరుగుపరుస్తుందని పలు అధ్యయాల్లో తేలింది. డయాబెటీస్ కేర్ జర్నల్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, మితమైన బీర్ వినియోగం మధ్య వయస్కులు, వృద్దుల్లో టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
5) మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
తక్కువ మొత్తంలో బీర్ వినియోగం ఒత్తడిని, ఆందోళన స్థాయిలను తగ్గిస్తుంది. మెరుగైన ఆరోగ్య స్థితికి దోహదపడుతుంది. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
అయితే ఎక్కువగా బీర్ తీసుకుంటే మానసిక ఆరోగ్య సమస్యలు వస్తాయి. అయితే ఈ ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ రావాలంటే కేవలం ఒక గ్లాస్ బీర్ మాత్రమే తీసుకోవాలి. ఎక్కువగా బీర్ తాగితే.. లివర్ సంబంధిత వ్యాధులు, హై బీపీ, ఊబకాయం వంటి అనారోగ్య సమస్యల్లో పడవచ్చు.