Vijayapriya Nithyananda: విజయప్రియ నిత్యానంద ఎవరు..? ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పలువురు ఆమె గురించి సెర్చ్ చేస్తున్నారు. భారత్ తో అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న వివాదాస్పద మతగురువు నిత్యానంద ‘కైలాస’ అనే ప్రత్యేక దేశాన్ని స్థాపించారు. అయితే ఈ దేశానికి ప్రతినిధులుగా ఇటీవల ఐక్యరాజ్యసమితిలో విజయప్రియ నిత్యానంద కనిపించారు. తనను తాను ‘యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస’ ప్రతినిధిగా పరిచయం చేసుకున్నారు.
Tripura Election Results: ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్లే త్రిపులో బీజేపీ భారీ విజయం సాధించింది. కమ్యూనిస్టుల కంచుకోటను కూల్చిన బీజేపీ వరసగా రెండో సారి ఆ రాష్ట్రంలో అధికారాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధం అయింది. ఈ రోజు వెల్లడించిన అసెంబ్లీ ఫలితాల్లో మ్యాజిక్ ఫిగర్ ను దాటి మెజారిటీ స్థానాలు సాధించింది. త్రిపులో మొత్తం 60 స్థానాలు ఉంటే ఇప్పటికే బీజేపీ 34 చోట్ల విజయం సాధించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే 26 చోట్ల విజయం సాధించగా.. మరో 8 చోట్ల ఆధిక్యంలో…
BJP: జాతీయ పార్టీల నిధుల్లో బీజేపీ టాప్ లో నిలిచింది. ఏకంగా సగానికి పైగా నిధులు ఒక్క భారతీయ జనతా పార్టీకే వచ్చాయి. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన వివరాల ప్రకారం.. 2020-21లో అన్ని జాతీయ పార్టీల మొత్తం నిధుల్లో 58 శాతం నిధులు బీజేపీకి వచ్చాయి. 2021-22లో నాలుగు జాతీయ పార్టీలు తమ మొత్తం ఆదాయంలో 55.09 శాతాన్ని ఎలక్టోరల్ బాండ్ల విరాళాల ద్వారా సేకరించాయి.
Russia: భారత్ ప్రతీష్టాత్మకంగా జీ20 సమావేశాలను నిర్వహిస్తోంది. ఈ ఏడాది భారత్ జీ20కి అధ్యక్షత వహిస్తోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, చైనా- అమెరికాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ సమావేశాలు జరుగుతున్నాయి. మరోవైపు భారత్ పేదరిక నిర్మూలన, ఆహార, ఇంధన భద్రత, ఉగ్రవాదంపై పోరుపై చర్చించాలని అనుకుంటోంది. ఇదిలా ఉంటే పాశ్చాత్య దేశాలు మాత్రం రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని సమావేశాల్లో లేవనెత్తాలని చూస్తున్నాయి. ఇటీవల బెంగళూర్ వేదికగా జరిగి జీ20 ఆర్థిక మంత్రుల సమావేశంలో కూడా యుద్ధంపై ఏకాభిప్రాయం కోసం పలుదేశాలు ఒత్తడి తీసుకువచ్చాయి. అయితే రష్యా,…
Farooq Abdullah comments on Mallikarjun Kharge: ముందుగా ఎన్నికల్లో గెలుద్ధాం, ఆ తరువాత ప్రధాని ఎవరు అవుతారో చూద్దాం అని కాశ్మీర్ నేత, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్డుల్లా అన్నారు. కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను ఉద్దేశిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చెన్నైలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ 70వ జన్మదిన వేడుకల సందర్భంగా జరిగిన కార్యక్రమంలో అబ్దుల్లా ఈ వ్యాఖ్యలు చేశారు. ఫరూక్ అబ్దుల్లా, మల్లికార్జున్ ఖర్గే, సమాజ్‌వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్, రాష్ట్రీయ జనతాదళ్‌కు చెందిన…
Fruits And Vegetables Storage: కూరగాయలను, పండ్లను కలిపి స్టోర్ చేసినప్పుడు కొన్ని సందర్భాల్లో పాడవడం, మొలకెత్తడం చూస్తుంటాం. అయితే కూరగాయను, పండ్లను చెడిపోకుండా నిల్వ చేయడం చాలా ముఖ్యం. ముఖ్యంగా 5 రకాల పండ్లు, కూరగాయలను ఎప్పుడు కలిపి నిల్వ చేయకూడదు.
Record in Railway Fines: సెంట్రల్ రైల్వేస్ ముంబై డివిజన్ అరుదైన రికార్డును సాధించింది. టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న ప్రయాణికుల నుంచి రూ. 100 కోట్లను జరిమానాల రూపంలో వసూలు చేసింది. దీంతో భారతీయ రైల్వేల్లో అద్భుతమైన రికార్డ్ సృష్టించిన తొలి డివిజన్ గా ముంబై నిలిచింది. ఏప్రిల్ 2022 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 18 లక్షల మంది టికెట్ లేని ప్రయాణికుల నుంచి ఈ మొత్తాన్ని వసూలు చేేసింది. గతేడాది ఇది రూ. 60 కోట్లుగా ఉంది. టికెట్ లేకుండా…
Heatwave Advisory: దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఫిబ్రవరి నెలలో రికార్డు స్థాయిలో గరిష్ట సగటు ఉష్ణోగ్రతలు పెరిగాయి. మార్చి నుంచి మే వరకు పలు దేశంలోని చాలా ప్రాంతాల్లో వడగాలుల వీస్తాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. ఈ నేపధ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ బుధవారం హీట్‌వేవ్ అడ్వైజరీని జారీ చేసింది. ఈ ఏడాది ఊహించిన దాని కన్నా వేసవి తీవ్రత ఎక్కువగా ఉంటుందని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషన్ మార్గదర్శకాలను జారీ చేశారు.
Arvind Kejriwal: ఢిల్లీ మద్యంపాలసీలో ఎలాంటి తప్పు లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. మనీష్ సిసోడియా ఢిల్లీ అభివృద్ధి కోసం పనిచేశారని, అందుకే సిసోడియాను అరెస్ట్ చేశారని, మంచి పని జరగాలని ప్రధాని కోరుకోవడం లేదని కేజ్రీవాల్ ఆరోపించారు. ఢిల్లీ ప్రభుత్వం చేసిన మంచి పనిని ఆపడానికే తన క్యాబినెట్ మంత్రులు మనీష్ సిసోడియా,సత్యేందర్ జైన్లను కటకటాల వెనక్కి నెట్టారని అన్నారు.
Twitter Down: మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ మరోసారి పనిచేయలేదు. కొన్ని గంటల పాటు నెటిజెన్లు తమ ట్వీట్లను, లాగిన్ సమస్యలను ఎదుర్కొన్నారు. ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను సొంతం చేసుకున్న తర్వాత పలుమార్లు ఇలాగే ట్విట్టర్ డౌన్ అయింది. తాజాగా బుధవారం ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్ అంతరాయాన్ని ఎదుర్కొంది.