Venu Goapl Reddy
Author- NTV Telugu-
Earthquake: నేపాల్‌లో 4.3 తీవ్రతతో భూకంపం.. 24 గంటల్లో రెండోసారి
Earthquake: హిమాలయ దేశం నేపాల్ వరస భూకంపాలతో వణికిపోతోంది. ఆదివారం రెండుసార్లు భూకంపాలు వచ్చాయి. తాజాగా రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ(ఎన్సీఎస్) వెల్లడించింది. ఆదివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఈ భూకంపం వచ్చింది. భూమికి 5 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం కేంద్రీకృతమైంది. -
Iran: మహ్సా అమిని మరణాన్ని కవర్ చేసిన ఇద్దరు మహిళ జర్నలిస్టులకు జైలు శిక్ష..
Iran: గతేడాది ఇరాన్ దేశాన్ని మహ్స అమిని అనే యువతి మరణం ఓ కుదుపుకుదిపేసింది. మత సంప్రదాయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే ఇరాన్లో హిజాబ్ వ్యతిరేక నిరసనలు మిన్నంటాయి. హిజాబ్ సరిగా ధరించలేదని కుర్దిష్ యువతి అయిన మహ్సా అమినిని మోరాలిటీ పోలీసులు అరెస్ట్ చేసి కొట్టడంతో ఆమె మరణించింది. ఈ మరణం ఇరాన్ వ్యాప్తంగా హిజాబ్ ఉద్యమానికి కారణమైంది. మహిళలు, యువత పెద్ద ఎత్తున ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. అక్కడి సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ఆందోళనలు… -
Azam Khan: “మేము ఎన్కౌంటర్ కావొచ్చేమో”.. యూపీ నేత ఆజం ఖాన్ కీలక వ్యాఖ్యలు..
Azam Khan: ఆజం ఖాన్.. ఒకప్పుడు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాన్ని శాసించారు. ఎస్పీ కీలక నేతగా ఉన్న ఆజం ఖాన్, అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో యూపీలో కీలకంగా వ్యవహరించారు. ఎప్పుడైతే యోగి ఆదిత్యనాథ్ అధికారంలోకి వచ్చారో, అప్పటి నుంచి పాత కేసులు ఒకదాని తర్వాత ఒకటి ఆజం ఖాన్ ని చుట్టుముట్టాయి. ప్రస్తుతం ఆయనకు ప్రాణభయం పట్టుకుంది. -
JaiShankar: “పదే పదే భారత వ్యవహారాల్లో జోక్యం”.. 41 మంది కెనడా దౌత్యవేత్తల తొలగింపుపై జైశంకర్..
JaiShankar: ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ కెనడాలోని సర్రే ప్రాంతంలోని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. అయితే ఈ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించినప్పటి నుంచి ఇరు దేశాల మధ్య తీవ్ర దౌత్య వివాదం చెలరేగింది. పలు సందర్భాల్లో కెనడా, భారత దేశాన్ని కావాలనే కవ్విస్తోంది. ఇటీవల కూడా భారత్ లో కెనడా ప్రజలు భద్రంగా లేరని చెబుతూ వారికి ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది. భారత్ లోని 41 మంది కెనడా… -
Israel-Hamas War: హమాస్ తీవ్రవాదులను వేటాడేందుకు ఇజ్రాయిల్ స్పెషల్ యూనిట్..
Israel-Hamas War: అక్టోబర్ 7న ఇజ్రాయిల్ పై హమాస్ ఉగ్రవాదులు భయానక దాడికి పాల్పడ్డారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఇజ్రాయిల్ లోని ప్రజలను ఊచకోత కోశారు. మొత్తం 1400 మంది వరకు ప్రజలు మరణించారు. ఇజ్రాయిల్ కనీవిని ఎరగని రీతిలో దాడి జరిగింది. దీంతో ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న ఇజ్రాయిల్ హమాస్ ఉగ్రవాద సంస్థను నేలమట్టం చేసేందుకు సిద్ధమైంది. -
Pentagon Report: భారత సరిహద్దుల్లో పెరిగిన చైనా సైనిక ఉనికి.. 500కు పైగా న్యూక్లియర్ వార్‌హెడ్స్..
Pentagon Report: భారత-చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో డ్రాగన్ కంట్రీ లైన్ ఆఫ్ ఆక్చువల్ కంట్రోల్(ఎల్ఏసీ) వెంబడి 2022లో సైనికి ఉనికిని, మౌలిక సదుపాయాల నిర్మాణాన్ని పెంచింది. ఈ విషయాలను అమెరికా పెంటగాన్ నివేదిక వెల్లడించింది. ‘పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా’ నివేదిక 2023 ప్రకారం.. భూగర్భ నిల్వ సౌకర్యాలు, కొత్త రోడ్లు, డ్యూయల్ పర్పస్ ఎయిర్ పోర్టులు, హెలిప్యాడ్ల నిర్మాణాలు ఎల్ఏసీ వెంబడి పెరిగాయి. -
INDIA bloc: ఇండియా కూటమిలో లుకలుకలు.. కాంగ్రెస్‌పై అఖిలేష్ యాదవ్ విమర్శలు..
INDIA bloc: 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని, ప్రధాని నరేంద్రమోడీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ తో పాటు టీఎంసీ, ఆర్జేడీ, శివసేన(ఉద్ధవ్), జేడీయూ, ఆప్, సమజ్ వాదీ(ఎస్పీ) పార్టీలు ‘ఇండియా’ పేరుతో కూటమిని కట్టాయి. అయితే ఇప్పటికే ఈ కూటమికి సంబంధించి మూడు సమావేశాలు జరిగాయి. సీట్ల సర్దుబాటుపై కసరత్తు చేస్తోంది. ఇదిలా ఉంటే సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మాత్రం కూటమి తీరుపై ఆగ్రహంతో ఉన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారు. -
India’s aid to Gaza: గాజాకు భారత్ భారీ సాయం.. 6.5 టన్నుల వైద్య సామాగ్రి..
India's aid to Gaza: ఇజ్రాయిల్, హమాస్ యుద్ధం నడుమ గాజాలోని సాధారణ పాలస్తీనా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడు ఏ రాకెట్ ఎటునుంచి వస్తుందో అని, ఎక్కడ ఏ బాంబు పేలుతుందో అని భయపడుతున్నారు. మరోవైపు ఇజ్రాయిల్ గాజా స్ట్రిప్ ని దిగ్భంధించింది. ఉత్తర గాజాలోని ప్రజలను సురక్షితమైన దక్షిణ ప్రాంతాలకు వెళ్లాలని సూచించడంతో, ఆ ప్రాంతంలోని 10 లక్షల మందిలో 7 లక్షల మంది దక్షిణ వైపు వెళ్లారు. -
Israel: హిజ్బుల్లా డేంజరస్ గేమ్ ఆడుతోంది.. లెబనాన్‌ని యుద్ధంలోకి లాగుతోంది..
Israel: ఇజ్రాయిల్-హమాస్ మధ్య యుద్ధం భీకరంగా సాగుతోంది. అక్టోబర్ 7న ఇజ్రాయిల్ పై హమాస్ ఉగ్రవాదులు క్రూరమైన దాడి చేశారు. కిబ్బుట్జ్‌లోకి ప్రవేశించి ప్రజలను చిన్నాపెద్ద, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా ఊచకోత కోశారు. -
India-Canada: ట్రూడోని చూసి ఇండియాలో నవ్వుకుంటున్నారు.. కెనడా ప్రతిపక్ష నేత విమర్శలు..
India-Canada: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోపై అక్కడి ప్రజలు, ప్రతిపక్ష నేతలు తీవ్ర అసంతృప్తి వెల్లగక్కుతున్నారు. ఇప్పటికే కెనడా ‘హౌసింగ్ సంక్షోభం’లో కూరుకుపోయింది. అక్కడి ప్రజలకు ఉండటానికి ఇళ్లు దొరకని పరిస్థితి ఉంది. మరోవైపు ఉగ్రవాదులు, గ్యాంగ్ స్టర్లకు కెనడా స్వర్గధామంగా మారింది. రాజకీయ కారణాల వల్ల కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఖలిస్తానీ వేర్పాటువాదులకు మద్దతుగా నిలుస్తున్నారు. దీని కారణంగా కెనడా-ఇండియాల మధ్య దౌత్య వివాదం రగులుతోంది.
తాజావార్తలు
-
Tamil Nadu: బంగారం, డబ్బులు ఎక్స్పోజ్ చేస్తూ రీల్స్.. వీడియోలు చూసి కేజీ గోల్డ్, భారీగా డబ్బు కొట్టేసిన దొంగలు..
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు రెడీ.. తీర్పు కోసం ఎదురుచూపులు.!
-
Asian Games 2026: మహిళల కబడ్డీలో భారత్ జయభేరి.. ఇరాన్‌పై ఉత్కంఠ విజయం.. గోల్డ్ మెడల్ కైవసం
-
KCR: తెలంగాణ ఆత్మగౌరవ ధిక్కార స్వరం చాకలి ఐలమ్మ..
-
Uttam Kumar Reddy: “రిఫరీపైనే అనుమానం వస్తే ప్రజాస్వామ్యానికే ప్రమాదం”.. ఈసీ, బీజేపీపై మంత్రి ఫైర్..
ట్రెండింగ్
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!