Best-selling cars in February: కార్ల అమ్మకాల్లో మారుతి సుజుకి తిరుగులేని ఆధిపత్యం కనబరుస్తోంది. ఫిబ్రవరిలో అమ్ముడైన టాప్ -10 కార్లలో 7 మారుతి మోడల్ కార్లే ఉండటం గమనార్హం. భారత ప్రజలు ఎక్కువగా హ్యాచ్ బ్యాక్ కార్ల కొనుగోలుకే మొగ్గు చూపినట్లు అమ్మకాలను బట్టి చూస్తే తెలుస్తోంది. టాప్ -10 కార్లలో 4 మాత్రమే SUV మోడళ్లు ఉన్నాయి. బ్రెజ్జా, నెక్సాన్, పంచ్, క్రేటా వంటి కార్లు ఉన్నాయి. ఫిబ్రవరిలో అత్యధికంగా అమ్ముడైన SUVలలో మారుతి సుజుకి బ్రెజ్జా కారు టాప్ లో ఉంది. ఇక హ్యాచ్ బ్యాక్ కార్లతో పాటు ఓవరాల్ గా చూస్తే మారుతి సుజుకి బాలెనో అగ్రస్థానంలో నిలిచింది.
ప్యాసింజర వాహనాల్లో SUV సెగ్మెంట్ ఇప్పుడు 42 శాతం కంటే ఎక్కువ వాటాను కలిగి ఉంది. ఫిబ్రవరి నెలలో మారుతి సుజుకి బాలెనో ఫిబ్రవరిలో 18,592 యూనిట్లతో అగ్రస్థానంలో ఉండగా.. తర్వాతి స్థానంలో మారుతి సుజుకి స్విఫ్ట్ 18,412 యూనిట్ల అమ్మకాలతో రెండో స్థానంలో, మూడో స్థానలో మారుతి సుజుకి ఆల్టో 18,114 మూడోస్థానంలో ఉంది. టాప్-10 కార్లలో ఒక్క సెడాన్ మాత్రమే చోటు దక్కించుకుంది. మారుతి సుజుకి డిజైర్ 16,798 యూనిట్ల అమ్మకాలతో టాప్-10లో స్థానం దక్కించుకుంది.
Read Also: Etela Rajender: ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు.. చనిపోయిన బిడ్డకు ట్రీట్మెంట్ ఇచ్చారు
ఇక SUV విభాగంలో మారుతి సుజుకి బ్రెజ్జా టాప్ లో ఉంది. ఆ తరువాతి స్థానాల్లో టాటా నెక్సాన్, టాటా పంచ్, హ్యుందాయ్ క్రేటా ఉన్నాయి. అతి తక్కువ కాలంలో ఎక్కువ అమ్మకాలను నమోదు చేసిన SUVగా టాటా పంచ్ స్థానం సంపాదించింది. ఫిబ్రవరి నెలలో టాటా పంజ్ 11,169 యూనిట్లు అమ్ముడయ్యాయి.
ఫిబ్రవరిలో అత్యధికంగా అమ్ముడైన 10 కార్లు:
1) మారుతి సుజుకి బాలెనో – 18,592 యూనిట్లు
2) మారుతి సుజుకి స్విఫ్ట్ – 18,412 యూనిట్లు
3) మారుతి సుజుకి ఆల్టో – 18,114 యూనిట్లు
4) మారుతి సుజుకి వ్యాగన్ఆర్ – 16,889 యూనిట్లు
5) మారుతి సుజుకి డిజైర్ – 16,798 యూనిట్లు
6) మారుతి సుజుకి బ్రెజ్జా – 15,787 యూనిట్లు
7) టాటా నెక్సాన్ – 13,914 యూనిట్లు
8) మారుతి సుజుకి ఈకో – 11,352 యూనిట్లు
9) టాటా పంచ్ – 11,169 యూనిట్లు
10) హ్యుందాయ్ క్రెటా – 10,421 యూనిట్లు