Supreme Court: రాహుల్ గాంధీకి పరువునష్టం కేసులో రెండు ఏళ్ల జైలు శిక్ష విధించిన తర్వాత రాజకీయం మారుతోంది. తాజాగా శుక్రవారం 14 ప్రతిపక్ష పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థల్ని దుర్వినియోగం చేస్తుందని ఆరోపిస్తూ అత్యున్నత న్యాయస్థానం తలుపుతట్టారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి), ఐటీ వంటి సంస్థలను దుర్వినియోగం చేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
Delhi Riots Case: 2020 ఈశాన్య ఢిల్లీ అల్లర్ సమయంలో ఇంటిలిజెన్స్ బ్యూరో అధికారి అంకిత్ శర్మను అత్యంత దారుణంగా హత్య చేశారు. చాంద్ బాగ్ పులియా సమీపంలోని ఖజూరి ఖాస్ డ్రెయినేజ్ కాలువ నుంచి అంకిత్ శర్మ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో ఈ హత్య సంచలనంగా మారింది. అంకిత్ శర్మ హత్యకు సంబంధించి ఆమ్ ఆద్మీ నేత తాహిర్ హుస్సెన్, మరో 10 మందిపై ఢిల్లీ కోర్టు గురువారం కిడ్నాప్, మర్డర్ అభియోగాలను మోపింది. అధికారి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు…
Women Pilots: భారతదేశంలో మొత్తం పైలెట్లలో 15 శాతం మహిళలే ఉన్నారు. ప్రపంచ సగటు కన్నా ఇది ఎక్కువ. ప్రపంచంలో మహిళా పైలెట్ల సగటు 5 శాతం మాత్రమే ఉంది. భారత దేశంలో మహిళా పైలెట్లు దీనికి మూడు రెట్లు అధికంగా ఉన్నారు. ప్రస్తుతం దేశంలోని వివిధ ఎయిర్ ఆపరేటర్లలో 67 మంది విదేశీ పైలెట్లు పనిచేస్తున్నారని ఓ నివేదికలో వెల్లడైంది.
Viral Video: జార్ఖండ్ లో ఓ చిన్న విమానం ప్రమాదానికి గురైంది. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే విమానం ఇంజన్ ఆగిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆన్ బోర్డ్ కెమెరా ఫ్లైట్ ప్రమాద దృశ్యాలను చిత్రీకరించింది. చివరకు ఓ ఇంటిలోకి గ్లైడర్ దూసుకెళ్లింది. అయితే ఈ ప్రమాదంలో పైలెట్, ప్యాసింజర్ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
Congress: కాంగ్రెస్ పార్టీ నేడు అత్యవసర సమావేశాన్ని నిర్వహించనుంది. ఇప్పటికే అన్ని రాష్ట్రాల పీసీసీ చీఫ్ లతో పాటు కీలక నేతలకు సమాచారం ఇచ్చారు. సాయంత్రం 5 గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో సమావేశం జరగనుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో సమావేశం జరుగబోతోంది.
Farooq Abdullah: అధికారంలో ఉండేందుకు శ్రీ రాముడి పేరును బీజేపీ ఉపయోగిస్తోందని, అయితే రాముడు హిందువులకు మాత్రమే దేవుడు కాదని అందరికి దేవుడే అని జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, ఎన్‌సి చీఫ్ డాక్టర్ ఫరూక్ అబ్దుల్లా అన్నారు. భగవాన్ రామ్ ప్రతి ఒక్కరికీ దేవుడు, ముస్లిం-క్రిస్టియన్, అమెరికన్, రష్యన్ ఇలా అతడిపై విశ్వాసం ఉన్నవారు చాలా మంది ఉన్నారని ఆయన అన్నారు.
Amazon: మామూలుగా ఏదైనా పోలీస్ ఆపరేషన్ జరుగుతుంటే జనాలు ఆ ప్రాంతం చుట్టువైపుల కూడా వెళ్లరు. అక్కడికి వెళ్తే ఎలాంటి సమస్యలు వస్తాయని భయపడుతుంటారు. కానీ అమెరికాలో మాత్రం ఓ అమెజాన్ ఎగ్జిక్యూటివ్ మాత్రం ఇలాంటి పరిస్థితుల మధ్య తన వృత్తి ధర్మాన్ని పాటించాడు. పోలీస్ ఆపరేషన్ కొనసాగుతున్న సమయంలో కూడా పార్సిల్ ఇచ్చేందుకు వెళ్లాడు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. అమెరికాలోని ప్రధాన మీడియా సంస్థలు దీనిపై వార్తల్ని ప్రసారం చేశాయి.
India at UNHRC: ప్రపంచవేదికలపై పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ అంశాన్ని, మానవహక్కుల గురించి చెబుతోంది. సమావేశం ఎజెండాతో సంబంధం లేకుండా వీటి గురించి ప్రస్తావిస్తూ భారత్ ను అభాసుపాలు చేసేందుకు ప్రయత్నిస్తోంది. భారత్ కూడా ఎప్పటికప్పుడు పాకిస్తాన్ ప్లాన్స్ ను తిప్పికొడుతోంది. తాజాగా ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో ప్రజాస్వామ్యం, మానవహక్కుల గురించి పాకిస్తాన్ మాట్లాడింది. అయితే దీన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ప్రజాస్వామ్యం గురించి ప్రపంచానికి పాకిస్తాన్ పాఠాలు చెప్పాల్సిన అవసరం లేనది స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.
Amritpal Singh: ఖలిస్తానీ వేర్పాటువాద నేత అమృత్ పాల్ సింగ్ గురించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పంజాబ్ లో విధ్వంసానికి పాల్పడేందుకు ప్లాన్ వేస్తున్నట్లు తేలింది. ఇప్పటికే ఇతడికి పాక్ ఐఎస్ఐ మద్దతు ఉన్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. పాకిస్తాన్ నుంచి ఆయుధాలు సేకరించే పనిలో ఉన్నాడని ఇంటెలిజెన్స్ అధికారులు వెల్లడించారు. పాక్ ఐఎస్ఐ నుంచి సేకరించిన ఆయుధాలను డీఅడిక్షన్ సెంటర్స్, జల్ పూర్ఖేడా వద్ద కొన్ని గురుద్వారాల్లో భద్రపరిచినట్లు ఆరోపణలు ఉన్నాయి. తన అనుచరులతో తుపాకులను బహిరంగంగా ప్రదర్శించాడు.
UK Parliament: యూకేలోని భారత హైకమిషన్ పై ఖలిస్తాని మద్దతుదారులు దాడులు అంశాన్ని యూకే హౌస్ ఆఫ్ కామన్స్‌లో గురువారం లేవనెత్తారు. బ్రిటన్ ఎంపీలు ఖలిస్తానీ పోకిరీలపై చర్యలు తీసుకోవాలని, భారత దౌత్యసిబ్బందికి భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ బాబ్ బ్లాక్‌మన్ పార్లమెంట్లో చర్చను తేవనెత్తారు. ప్రతిపక్ష లేబర్ పార్టీ ఎంపీ గారెత్ థామస్ మాట్లాడుతూ.. అలాంటివి పునరావృతం కాకుండా హౌస్ ఆఫ్ కామన్స్ నాయకుడిని చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు.