Maharashtra: దేశంలో అత్యాచారాలకు అడ్డుకట్టపడటం లేదు. మృగాళ్లు బరితెగించి ప్రవర్తిస్తున్నారు. ఒంటరిగా ఆడపిల్ల కనబడితే కామాంధులు రెచ్చిపోతున్నారు. నిర్భయ, దిశ, పోక్సో వంటి కఠిన చట్టాలు ఉన్నా కూడా రేపిస్టులు భయపడటం లేదు. ప్రతీ రోజు ఎక్కడో చోట అత్యాచార ఉదంతం బయటకు వస్తూనే ఉంది. తాజాగా తన బాయ్ ఫ్రెండ్ తో బయటకు వెళ్లిన బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు దుండగులు.
Read Also: Madhya Pradesh Court : చిట్ ఫండ్ కంపెనీ యజమానికి 250ఏళ్ల జైలు శిక్ష
వివరాల్లోకి వెళితే..మహారాష్ట్రలోని పాల్ఘర్ లో బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. తన బాయ్ ఫ్రెండ్ తో ఈవినింగ్ వాక్ కు వెళ్లిన బాలికపై ఇద్దరు వ్యక్తులు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. బాలిక, ఆమె ప్రియుడు సమీపంలోని కొండపైకి వెళ్లారు. ఇద్దరు వెళ్తుండాన్ని గమనించిన ఇద్దరు వ్యక్తులు వారిని వెంబడించారు. కొండపైకి చేరుకోగానే ప్రియుడిని బెదిరించారు. ప్రియుడు వారితో వాగ్వాదం చేసుకోగా.. అతడిపై, బాలికపై బీర్ బాటిళ్లతో దాడి చేసి, ప్రియుడిని బట్టలు చించేసి చెట్టుకు కట్టేశారు. తర్వాత బాలికను వేరే ప్రాంతానికి తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. బాధితురాలి పర్సును నిందితులు కాల్చేశారు.
నిందితుల నుంచి తప్పించుకున్న బాలిక ఇంటికి చేరుకుంది. అయితే బాయ్ ఫ్రెండ్ ను చెట్టుకు కట్టేసిన గంటల తర్వాత పోలీసులు రక్షించారు. 22, 25 ఏళ్ల వయస్సు ఉన్న ఇద్దరు నిందితులు అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులను ఒక రోజు తర్వాత అరెస్ట్ చేసి స్థానిక మెజిస్ట్రేట్ హాజరు పరిచారు. నిందితులు ముంబైలోని శివారు ప్రాంత విరార్ లోని సాయినాథ్ నగర్ ప్రాంతానికి చెందిన వాళ్లుగా గుర్తించారు. ఇద్దరిపై అత్యాచార సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.