Donald Trump: తనపై అభియోగాలు మోపితే మరణాలు, విధ్వంసమే అని ట్రంప్ హెచ్చరించారు. స్టార్మీ డేనియల్స్ హుష్ మనీ విచారణలో అభియోగాలు మోపితే బాగుండంటూ మాన్ హట్టన్ అటార్నీని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి హెచ్చరించారు. అధ్యక్ష ఎన్నికల ముందు పోర్న్ స్టార్ తో సంబంధాల గురించి బయటపడకుండా డబ్బులతో ప్రలోభపెట్టాడనే కేసును మాన్ హట్టన్ అటార్నీ విచారించేందుకు సిద్ధం అయిందని, తనపై అభియోగాలు మోపి రోజుల్లో అరెస్ట్ చేస్తారని ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు ట్రంప్.
మాన్ హాటన్ ప్రాసిక్యూటర్లు మాట్లాడుతూ.. మాజీ అధ్యక్షుడు ట్రంప్ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారంటూ మండిపడ్డారు. వచ్చే వారం విచారణ జరగనున్న స్టార్మీ డేనియల్స్ హుష్ మనీ కేసులో జోక్యం చేసుకునేలా తోటి రిపబ్లిక్ నాయకులను ప్రేరేపించారని మాన్ హాటన్ ప్రాసిక్యూటర్లు ఆరోపించారు, తాము ట్రంప్ బెదిరింపులకు భయపడబోమని ప్రాసిక్యూటర్లు ప్రకటించిన తర్వాత ట్వంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. మాన్ హాటన్ డిస్ట్రిక్ట్ అటార్నీ ఆల్విన్ బ్రాగ్, ట్రంప్ కు మధ్య గత శనివారం నుంచి మాటల యుద్ధం నడుస్తోంది.
Read Also: Extramarital Affair: ప్రియురాలి కోసం భార్య హత్య.. సినిమా స్టైల్‌లో స్కెచ్.. చివర్లో ట్విస్ట్
మోసం కారణంగా తాను 2020 ఎన్నికల్లో ఓడిపోయానని ట్రంప్ చెబుతున్నారు. చరిత్రలో ఏ ప్రెసిడెంట్ కు రాని మెజారిటీని తాను సాధించినట్లు, ఇప్పటి వరకు రిపబ్లిక్ పార్టీ నుంచి ప్రెసిడెంట్ పోటీలో అగ్రగామి ఉన్న తనపై నేరం మోపవచ్చని, ఏ నేరం జరగలేదని అందరికి తెలిసినప్పుడు, తప్పుడు అభియోగాలు మోపితే విధ్వంసం తప్పదని, ఇది మన దేశానికి విపత్తుగా మారగలదని అని ట్రూత్ సోషల్ లో పోస్ట్ చేశారు.
అడల్ట్ పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్ అసలు పేరు స్టెఫానీ క్లిఫోర్డ్. ట్రంప్ ఈ పోర్న్ స్టార్ తో తనకు ఉన్న లైంగిక సంబంధాలను దాచి పెట్టేందుకు ఆమె నోరును మూయించేందుకు డబ్బు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ట్రంప్ ఈ ఆరోపణలను ఖండించారు. 2016లో అధ్యక్ష ఎన్నికల ముందు ట్రంప్ మాజీ న్యాయవాది మైఖేల్ కోహెన్ 1,30,000 డాలర్లను ఇచ్చారని అభియోగాలు ఉన్నాయి. ప్రస్తుతం కోహెన్ వివిధ ఆరోపణలపై జైలు పాలయ్యాడు.