PM Narendra Modi: కర్ణాటక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాని నరేంద్రమోదీ ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. శనివారం దావణగేరేలో రోడ్ షోలో పాల్గొన్నారు. ఇదిలా ఉంటే హఠాత్తుగా ఓ వ్యక్తి ప్రధాని కాన్వాయ్ దగ్గరకు పరిగెత్తుతూ వెళ్లే ప్రయత్నం చేశాడు. వెంటనే అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. గతంలో కర్ణాటక హుబ్బళ్లి జిల్లాలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఇలా ప్రధాని పర్యటనలో భద్రతా ఉల్లంఘన జరగడం ఇది రెండోసారి. మోదీకి దగ్గరగా వెళ్లాలనుకున్న వ్యక్తని కొప్పల్ జిల్లాకు చెందిన యువకుడిగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం పోలీసులు అతడిని విచారిస్తున్నారు.
Read Also: Khalistan: ఢిల్లీలో త్రివర్ణ పతాకానికి బదులు ఖలిస్తాన్ జెండా ఎగరేస్తాం..
వ్యక్తి బారికేడ్స్ దాటడం చూసిన సీనియర్ పోలీస్ అధికారి అలోక్ కుమార్ అతడి వైపు పరిగెత్తుకుంటూ అడ్డుకున్నాడు. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(ఎస్పీజీ) కమాండోలు కూడా అతడిని ఆపేందుకు ప్రయత్నించారు. కొప్పల్ జిల్లాకు చెందిన బస్వరాజ్ కటరి అనే యువకుడు పీఎం మోదీని చూసేందుకు దావణగేరెకు వచ్చాడని పోలీసులు వెల్లడించారు. అతడిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని, మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.
ఈ ఏడాది జనవరిలో కర్ణాటకల హుబ్బల్లి పర్యటనలో ఓ బాలుడు అకాస్మాత్తుగా రోడ్డుపైకి వచ్చి ప్రధానికి దగ్గరగా వెల్లగలిగాడు. ఆఖరు నిమిషంలో ఎస్పీజీ అతడిని అడ్డగించింది. ప్రధానికి దండ వేసేందుకు బాలుడు వచ్చాడు. ప్రస్తుతం కర్ణాటక అసెంబ్లీ పదవీకాలం మే 24తో ముగుస్తుంది. ఈలోపే ఎప్పుడైనా ఎన్నికల కమిషన్, ఎన్నికల తేదీలను ప్రకటించే అవకాశం ఉంది.
As being reported in a section of media, there was no breach in security as such of Hon’ble PM at Davangere today. It was an unsuccessful attempt
He was caught immediately by myself and SPG at a safe distance
Appropriate action is being taken in this regard pic.twitter.com/qsqdoBCszN
— alok kumar (@alokkumar6994) March 25, 2023