Rahul Gandhi: రాహుల్ గాంధీ ప్రస్తుతం దేశరాజకీయాల్లో వినిపిస్తున్న పేరు. ఆయనకు క్రిమినల్ పరువునష్టం కేసులో రెండేళ్లు జైలు శిక్ష విధించింది సూరత్ కోర్టు. అయితే అతడికి పై కోర్టులో అప్పీల్ చేసుకునేందుకు 30 రోజుల బెయిల్ మంజూరు చేశారు న్యాయమూర్తి. ఈ శిక్ష ఏకంగా రాహుల్ గాంధీ ఎంపీ పదవి పోయేలా చేసింది. శిక్ష పడిన వెంటనే పార్లమెంటరీ సెక్రటరీ రాహుల్ గాంధీపై లోక్ సభ సెక్రటేరియట్ అనర్హత వేటు వేస్తూ నోటిఫికేషన్ జారీ అయింది.
రాహుల్ గాంధీ తన ఎంపీ పదవని కోల్పోవడానికి ప్రధాన కారణం ‘‘ప్రజాప్రతినిధ్య చట్టం -1951’’. ఈ చట్టంలోని 8(3) సెక్షన్ ప్రకారం అనర్హత వేటు పడింది. ఈ చట్టాల ప్రకారం ఓ వ్యక్తి ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, చివరకు సర్పంచ్ కు రెండేళ్ల లేదా రెండేళ్ల కన్నా ఎక్కువ కాలం పడితే ఈ చట్టాల ప్రకారం అనర్హతకు గురవుతాడు. శిక్ష విధించిన వెంటనే అనర్హతకు గురవుతాడు.
రాహుల్ గాంధీ చించేసిన చట్టం..
అయితే గతంలో ఈ చట్టంలో 8(4) అనే సెక్షన్ తీసుకురావడానికి మన్మోహన్ సింగ్ ప్రయత్నించింది.. దీని ప్రకారం ఒక ఎంపీపై అనర్హత వేటు పడితే 90 రోజుల వరకు అనర్హత వేటు పడకుండా కాపాడుతుంది. దీనిపై మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. అయితే దీన్ని రాహుల్ గాంధీ తీవ్రంగా వ్యతిరేకించి, సొంత పార్టీ తీసుకువచ్చిన చట్టాన్నే మీడియా ముఖంగా చించేశాడు. అప్పట్లో ఈ చర్య సంచలనంగా మారింది. శిక్ష పడిన నిందితులకు 90 రోజులు ఇవ్వడం సరికాని చెబుతూ చట్టప్రతులను చించేశాడు. ఆ తరువాత 90 రోజలు వ్యవధిపై లిల్లి థామస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు 2013లో తీర్పు ఇస్తూ.. 8(4) సెక్షన్ చట్టవిరుద్ధం అని చెబుతూ తీర్పు చెప్పింది. వెంటనే అనర్హత అమలు కావాలని చెప్పింది.
నాయనమ్మ ఇందిరా గాంధీ తీసుకువచ్చిన చట్టమే..
ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే..రాహుల్ గాంధీ నాయనమ్మ మాజీ ప్రధాని ఇందిరాగాంధీనే రెండేళ్ల శిక్ష పడిన వారికి అనర్హత విధించాలని మొదటిసారిగా ఈ చట్టాన్ని తీసుకువచ్చారు. ఎమర్జెన్సీ సమయంలో సుబ్రమణ్యం స్వామిని పదవి నుంచి తొలగించేందుకు ఎంపీగా డిస్ క్వాలిఫై చేసేందుకు ఆమె ఈ చట్టాన్ని తీసుకువచ్చిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇక సుప్రీంకోర్టు 2013లో ఇచ్చిన తీర్పు ప్రకారం చట్టప్రకారం రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడింది.
9 yrs ago, had Rahul Gandhi not torn the ordinance passed by the UPA govt, which repealed the historic decision of the Supreme Court, saving the convicted MPs from disqualification, today he wouldn't have been disqualified. What an irony! pic.twitter.com/NcwxfyMVP9
— Priti Gandhi – प्रीति गांधी (@MrsGandhi) March 24, 2023