13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lenovo Idea Tab Pro Gen 2 Launch: లెనోవో (Lenovo) భారత మార్కెట్లో కొత్త టాబ్లెట్ లెనోవో ఐడియా ట్యాబ్ ప్రో జెన్ 2 (Lenovo Idea Tab Pro Gen 2) ను అధికారికంగా విడుదల చేసింది. గత వారం నుంచే టీజర్లతో ఆసక్తి రేకెత్తించిన ఈ టాబ్లెట్, పెద్ద స్క్రీన్‌తో పాటు ప్రొడక్టివిటీ, ఎంటర్టైన్‌మెంట్, క్రియేటివ్ పనులను సులభంగా నిర్వహించాలనుకునే వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని రూపొందించబడింది. ల్యాప్‌టాప్‌కు ప్రత్యామ్నాయంగా ఉపయోగించుకునే విధంగా ఇందులో అనేక ఆధునిక ఫీచర్లు అందించారు.
ఈ టాబ్లెట్‌లో 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే ఇవ్వబడింది. 3540 x 2190 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో పాటు 144Hz రిఫ్రెష్ రేట్ అందుబాటులో ఉంది. 99% DCI-P3 కలర్ గ్యామట్ సపోర్ట్ తో విజువల్స్ మరింత బాగా కనిపిస్తాయి. హై బ్రైట్‌నెస్ మోడ్‌లో 800 నిట్స్ వరకు బ్రైట్‌నెస్ అందుతుంది. అలాగే పేపర్ లాంటి వీయింగ్ అనుభవం కోసం యాంటీ-గ్లేర్ మ్యాట్ ఎడిషన్‌ను కూడా లెనోవో అందిస్తోంది.
Also Read
- Lenovo ThinkBook 14x: లెనోవా ThinkBook 14x వచ్చేసింది.. 120Hz OLED డిస్‌ప్లే, Core Ultra ప్రాసెసర్
- Starlink India Row: ‘మార్కెట్ గుత్తాధిపత్యం కోసమే అడ్డుకుంటున్నారు’.. Starlink Indiaపై ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు
- Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
- IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. ఈ టాబ్లెట్లో స్నాప్ డ్రాగన్ 8s జెన్ 4 చిప్‌సెట్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 12GB ర్యామ్, 512GB స్టోరేజ్‌తో వస్తుంది. ఆండ్రాయిడ్ 16 పై నడిచే ఈ డివైస్‌కు ఆండ్రాయిడ్ 18 వరకు అప్డేట్స్ అందుతాయని కంపెనీ వెల్లడించింది. 10,200mAh భారీ బ్యాటరీతో పాటు 45W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఇందులో ఉంది.
ఆడియో అనుభవాన్ని మెరుగుపరచడానికి JBL ట్యూన్ చేసిన క్వాడ్ స్పీకర్లు, డాల్బీ ఆటమ్స్ సపోర్ట్‌తో అందించారు. ఫోటోగ్రఫీ, వీడియో కాల్స్ కోసం 13MP రియర్ కెమెరా, 8 MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.

ధర విషయానికి వస్తే.. Lenovo Idea Tab Pro Gen 2 భారతదేశంలో రూ. 39,999కి లాంచ్ అయింది. మే 1 నుంచి లెనోవో అధికారిక వెబ్‌సైట్, ఈ-కామర్స్ ప్లాట్‌ఫార్మ్స్, రిటైల్ స్టోర్లలో విక్రయాలు ప్రారంభమవుతాయి. పరిమిత కాలం పాటు రూ. 3,000 వరకు బ్యాంక్ డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంటుంది.
తాజావార్తలు
-
Nana Patekar: తరతరాలను అలరించిన గొప్ప నటుడు.. నానా పటేకర్‌కు గబ్బర్, జింక్స్ నివాళులు!
-
Delhi Police: రాహుల్, ప్రియాంక గాంధీలపై FIR.. అసలు కాంగ్రెస్ నిరసనలో ఏం జరిగింది?
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
Hindi on Medicine Covers: తమిళం, ఇంగ్లిష్తో పాటు హిందీ.. మందుల కవర్లపై రగడ, ఆసుపత్రుల్లో పంపిణీ నిలిపివేత
-
Nana Patekar First Love: నానా పటేకర్ తొలి ప్రేమ వెనుక ఇంత విషాదకరమైన కథ ఉందా?
ట్రెండింగ్
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?