Bengal Elections: మళ్లీ 90 కొట్టిన బెంగాల్ ఓటర్లు.. రికార్డ్ స్థాయిలో ఓటింగ్..
- బెంగాల్ రెండో దశ ఎన్నికల్లో రికార్డ్ స్థాయి పోలింగ్..
- సాయంత్ర 5 గంటల వరకు 90 శాతం నమోదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengal Elections: పశ్చిమ బెంగాల్‌లో రెండో దశ పోలింగ్ బుధవారం జరిగాయి. ఈ దశలో కూడా బెంగాల్ ఓటర్లు భారీగా తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. మొదటి విడతలో బెంగాల్ పోలింగ్ శాతం 90 శాతాన్ని దాటింది. రెండో విడతలో సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ శాతం 89.99 శాతానికి చేరుకుంది. పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉందని ఎన్నికల సంఘం చెబుతోంది. సాయంత్రం 5 గంటల వరకు క్యూలో నిల్చున్న ఓటర్లు ఓటు వేసే అనుమతి ఉంది. 2021లో ఇదే 142 స్థానాలకు 80.4 శాతం ఓటింగ్ నమోదైంది. ఇప్పుడు దీనిని అధిగమించి ప్రజలు ఓటు వేశారు. బెంగాల్‌లో మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాలు 294 కాగా, ఏప్రిల్ 23న జరిగిన తొలి విడతలో 152 స్థానాలకు ఎన్నికలు జరిగాయి.
Read Also: Riyan Parag: జైలు శిక్షా లేక జరిమానా.. RR కెప్టెన్‌పై బీసీసీఐ కఠిన చర్యలు.?
Also Read
- Flight Ticket Price Control: విమాన టికెట్ల ధరలకు కళ్లెం.? కేంద్రం కొత్త రూల్స్.!
- Neha Bora: NSUIలో నేహా బోరా చిచ్చు.. కాంగ్రెస్ అతి ప్రాధాన్యంపై అసంతృప్తి..!
- Delhi Protest: అభిజిత్ దీప్కేతో పాటు పోలీసుల అదుపులో నేహా బోరా..
- CJP Protest: ఢిల్లీలో హైటెన్షన్.. సీజేపీకి వ్యతిరేకంగా, మోడీకి మద్దతుగా నినాదాలు..
జిల్లాల వారీగా చూస్తే అత్యధికంగా పూర్బ బర్ధమాన్ జిల్లాలో అత్యధికంగా 92.46 శాతం పోలింగ్ నమోదైంది. ఉత్తర కోల్‌కతా నియోజకవర్గంలో సాయంత్రం 5 గంటల నాటికి 87.77 శాతం ఓటింగ్ నమోదైంది. ఈ హై-ఓల్టేజ్ ఎన్నికల్లో అధికార టీఎంసీ, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు నడిచినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బెంగాల్ సహా తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, అస్సాం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మే 4న వెల్లడవుతాయి.
తాజావార్తలు
-
International Day for the Eradication of Poverty: పేదరికం అంటే ఆకలి మాత్రమే కాదు.. కొత్త సవాళ్లివే.!
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!