50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vivo TWS 5i Launched: వివో (Vivo) ఆడియో ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియోను పెంచుతూ కొత్త బడ్జెట్ ట్రూ వైర్‌లెస్ (TWS) ఇయర్‌బడ్‌లుగా Vivo TWS 5i ను చైనాలో లాంచ్ చేసింది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న Vivo TWS 5 & Vivo TWS 5 Hi-Fi మోడళ్లకు ఇది అప్డేటెడ్. తక్కువ ధరలో మంచి సౌండ్ క్వాలిటీ, దీర్ఘకాలిక బ్యాటరీ లైఫ్, గేమింగ్‌కు తక్కువ లేటెన్సీ వంటి ఫీచర్లతో ఈ ఇయర్‌బడ్‌లు వినియోగదారుల ముందుకు వచ్చాయి.
ఫీచర్ల పరంగా చూస్తే Vivo TWS 5i లో 10mm డైనమిక్ డ్రైవర్‌తో పాటు PU + PEEK పాలిమర్ డయాఫ్రామ్‌ను ఉపయోగించారు. DeepX 3.0 స్టీరియో సౌండ్ అండ్ స్పేషియల్ ఆడియో సపోర్ట్‌తో వినియోగదారులకు థియేటర్, కాన్సర్ట్ హాల్, రికార్డింగ్ స్టూడియో వంటి విభిన్న లిసనింగ్ మోడ్‌లు అందుబాటులో ఉన్నాయి. AAC, SBC, LC3 ఆడియో కోడెక్‌లకు సపోర్ట్ ఉంది. బాస్, వాయిస్ క్లారిటీ, హైస్ అన్ని బ్యాలెన్స్‌గా వినిపించేలా ట్యూన్ చేశారు. కాకపోతే, ఈ ఇయర్‌బడ్‌లలో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) లేదు. కానీ AI ఆధారిత కాల్ నాయిస్ రిడక్షన్ & విండ్ నాయిస్ సప్రెషన్ వంటి ఫీచర్లు అందించారు, దీంతో కాల్ సమయంలో క్లియర్ వాయిస్ అనుభవం పొందవచ్చు.
Also Read
- Xiaomi TV: Xiaomi TV S Pro RGB-Mini LED 2027 సిరీస్ లాంచ్.. 98 ఇంచెస్ స్క్రీన్, Dolby Atmos, HyperOS 4
- MIVI ONE 5G: మివి వన్ 5G భారత్‌లో లాంచ్.. Snapdragon 4 Gen 2, 120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ
- 144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
- 150+ స్పోర్ట్స్ మోడ్‌లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
కనెక్టివిటీ కోసం బ్లూటూత్ 5.4 సపోర్ట్‌తో పాటు డ్యూయల్ డివైస్ కనెక్టివిటీ కూడా ఉంది. ఒకేసారి రెండు డివైస్‌లకు కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. గేమింగ్ కోసం 42ms వరకు తక్కువ లేటెన్సీ మోడ్ అందుబాటులో ఉంది. ఇవి వివో, iQOO ఫోన్లలో BlueOS ఫీచర్లు పూర్తి స్థాయిలో పని చేస్తాయి. ఇందులో ఇన్‌స్టంట్ పేయరింగ్, కస్టమైజబుల్ పాప్-అప్ అనిమేషన్స్, రియల్-టైమ్ ట్రాన్స్‌లేషన్, ఇయర్‌బడ్ ట్రాకింగ్, AI వాయిస్ అలర్ట్స్ వంటి స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి.
బ్యాటరీ విషయానికి వస్తే.. ఒకసారి చార్జ్ చేస్తే 11.5 గంటల వరకు ప్లేబ్యాక్ లభిస్తుంది. చార్జింగ్ కేస్‌తో కలిపి మొత్తం 50 గంటల వరకు బ్యాటరీ లైఫ్ అందుతుంది. కేవలం 10 నిమిషాల చార్జ్‌తోనే సుమారు 4 గంటలు 5 నిమిషాల వినికిడి సమయం లభిస్తుందని కంపెనీ చెబుతోంది. IP54 రేటింగ్‌తో డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ కూడా ఉంది. డిజైన్ పరంగా ప్రతి ఇయర్‌బడ్ బరువు సుమారు 4.2 గ్రాములు మాత్రమే. చార్జింగ్ కేస్‌తో కలిపి మొత్తం బరువు 42 గ్రాముల వరకు ఉంటుంది. తేలికగా కాంపాక్ట్‌గా ఉండే ఈ ఇయర్‌బడ్‌లు రోజువారీ వినియోగానికి అనుకూలంగా ఉంటాయి.
ధర విషయానికి వస్తే, చైనాలో Vivo TWS 5i ధర CNY 119 (రూ. 1,600)గా నిర్ణయించారు. ఈ ఇయర్‌బడ్‌లు వైట్ స్పేస్, ఇంక్ బ్లాక్, స్కై బ్లూ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం వివో చైనా అధికారిక వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
తాజావార్తలు
-
Sorakaya Sarvapindi: టేస్టీతో పాటు సూపర్ హెల్తీ.. ఘుమఘుమలాడే ‘సొరకాయ సర్వపిండి’ తింటే ఎన్ని లాభాల్లో తెలుసా?
-
Uttar Pradesh: బరేలీ అల్లర్ల నిందితుడి ఇంటికి కాంగ్రెస్ అధ్యక్షుడు.. ముస్లిం ఓట్లే టార్గెట్.!
-
Mandadi : 100 కోట్ల క్లబ్లో సుహాస్-సూరిల ‘మండాడి’.. ప్రత్యేకంగా అభినందించిన కమల్
-
Harish Rao : హరీశ్ వర్సెస్ కాంగ్రెస్.. ఇక కోర్టులోనే.!
-
SIR row: CEC జ్ఞానేశ్ కుమార్‌పై అభిశంసన తీర్మానం.!
ట్రెండింగ్
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్‌లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!