PM Modi: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు గుజరాత్ హైకోర్టులో చుక్కెదురు అయింది. ప్రధాని నరేంద్రమోదీ డిగ్రీ వివరాలను వెల్లడించాలని గుజరాత్ యూనివర్సిటీని ఆదేశిస్తూ జారీ అయిన ఉత్తర్వులను ఆ రాష్ట్ర హైకోర్టు ఈ రోజు కొట్టేసింది. ఆ సమాచారం అవసరం లేదని కోర్టు పేర్కొంది. ఈ వివరాలు అడిగినందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు రూ. 25,000 జరిమానా విధించింది. కేజ్రీవాల్ నాలుగు వారాల్లో గుజరాత్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీలో డబ్బును డిపాజిట్ చేయాలని ఆదేశించింది.
Poster War In Telangana: తెలంగాణలో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా రాజకీయం వేడెక్కింది. ముఖ్యంగా భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్), భారతీయ జనతా పార్టీ(బీజేపీ)ల మధ్య పోస్టర్ వార్ ముదురుతోంది. నువ్వా నేనా అన్నరీతిలో పోస్టర్లు పెడుతూ ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు. మూడు రోజుల క్రితం ఉప్పల్-నారపల్లి ఫ్లై ఓవర్ పనులపై ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నిస్తూ పోస్టర్ వెలిసింది.
Covid-19: దేశంలో మళ్లీ కరోనా కేసుల పెరుగుదల కనిపిస్తోంది. గత నెల వరకు వందల్లో ఉన్న కేసుల సంఖ్య ప్రస్తుతం వేలల్లో నమోదు అవుతోంది. మరోవైపు ఢిల్లీలో కూడా కేసుల సంఖ్య పెరగడంపై అక్కడి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం అప్రమత్తం అయింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిాంచారు. పెరుగుతున్న కేసులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. కోవిడ్ పెరుగుదలపై ఢిల్లీ వాసులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ఎలాంటి పరిస్థితినైనా ఢిల్లీ సర్కార్ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని…
Bengaluru: మహిళపై హింస, అత్యాచారాలకు వ్యతిరేకంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో చట్టాలను తీసుకువచ్చినా.. మహిళలపై అఘాయిత్యాలకు అడ్డుకట్టపడటం లేదు. దేశంలో ఎక్కడో చోట అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. కామాంధులు బరితెగించి మహిళలపై లైంగిక నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా బెంగళూర్ లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. మహిళను బలవంతంగా తీసుకెళ్లి కదిలే కారులోనే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
Congress: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడంపై పలు విదేశాలు స్పందిస్తున్నాయి. ఇప్పటికే అమెరికా, జర్మనీలు పరిస్థితిని గమనిస్తున్నామంటూ వ్యాఖ్యలు చేశాయి. అయితే నిన్న జర్మనీ విదేశాంగ మంత్రిత్వ శాఖ రాహుల్ గాంధీ అనర్హతపై స్పందించింది. ‘‘ భారత్ లో రాహుల్ గాంధీకి జైలు శిక్ష, లోక్ సభ సభ్యత్వం కోల్పోవడం వంటి అంశాలను మేం గమనిస్తున్నాం, ఈ కేసులో ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రాలు వర్తిస్తాయి. రాహుల్ గాంధీ పైకోర్టుకు అప్పీల్ చేసుకోవచ్చు.’’ అని జర్మనీ పేర్కొంది.
Howrah Ram Navami clashes: అనుకన్నట్లుగానే దేశంలోని పలు ప్రాంతాల్లో రామనవమి ఊరేగింపు సమయంలో అల్లర్లు జరిగాయి. గుజరాత్ వడోదరా, మహరాష్ట్ర ఔరంగాబాద్, బెంగాల్ హౌరాల్లో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు తలెత్తాయి. ముఖ్యంగా హౌరాలో ఈ అల్లర్లు హింసాత్మకంగా మారాయి. ఆందోళనకారులు పలు వాహానాలకు నిప్పుపెట్టారు. ఇదిలా ఉంటే ఈ అల్లర్లు అధికార త్రుణమూల్ కాంగ్రెస్(టీఎంసీ), బీజేపీల మధ్య తీవ్ర రాజకీయ వివాదంగా మారింది.
Helicopters Crash: అమెరికాలో ఘోర ప్రమాదం జరిగింది. రెండు బ్లాక్ హాట్ హెలికాప్టర్లు కుప్పకూలాయి. ఈ ఘటనలో 9 మంది అమెరికన్ సైనికులు మరణించారు. బుధవారం రాత్రి సమయంలో ఈ ఘటన జరిగింది. ఆర్మీ శిక్షణలో ఈ ప్రమాదం జరిగినట్లు మిలిటరీ అధికార ప్రతినిధి గురువారం తెలిపారు. కూలిపోయిన హెలికాప్టర్లు 101వ వైమానిక విభాగానికి చెందినవని, తొమ్మిది మంది సైనికులు మరణించారని దీని ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ ఆంథోనీ హోఫ్లర్ తెలిపారు.
New Parliament: ప్రధాని నరేంద్రమోదీ కొత్త పార్లమెంట్ భవనాన్ని ఆకస్మికంగా సందర్శించారు. నిర్మాణ పనులను అడిగి తెలుసుకున్నారు. అక్కడే ఉన్న కార్మికులతో ముచ్చటించారు ప్రధాని. దాదాపుగా గంట పాటు అక్కడే గడిపారు. పనులను క్షణ్ణంగా పరిశీలించారు. ప్రధాని వెంట లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కూడా ఉన్నారు. కొత్త పార్లమెంట్ ఆకస్మిక తనిఖీకి వెళ్లడం ఇదే కొత్త కాదు. గతంలో సెప్టెంబర్ 2021లో కూడా ఇలాగా పార్లమెంట్ కాంప్లెక్స్ ను మోదీ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Aam Aadmi Party: ప్రధాని నరేంద్రమోదీని టార్గెట్ చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) విమర్శలు గుప్పిస్తోంది. ఇప్పటికే ఢిల్లీలో ఆప్ వర్సెస్ బీజేపీగా రాజకీయ పోరాటం కొనసాగుతోంది. ద్వేషాన్ని ఆపడానికి, విధానాలు రూపొందించడానికి, ఈ దేశ వ్యవస్థాపకుల కలలను సాకారం చేయడానికి భారతదేశానికి విద్యావంతులైన ప్రధాని అవసరమని ఆప్ ఈ రోజు శ్రీనగర్ లో వ్యాఖ్యానించింది.
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీరామ నవమిని జరుపుకునే భక్తులు దయచేసి ముస్లిం ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచించారు. రామ నవమి ఊరేగింపులను శాంతియుతంగా జరుపుకోవాలని ఆమె అభ్యర్థించారు. రంజాన్ జరుగుతున్నందున ముస్లిం ప్రాంతాలకు దూరంగా ఉండాలని, శాంతియుతంగా పండగ జరుపుకోవాలని, హింసను సృష్టించవద్దని కోరారు. ఊరేగింపుల్లో కత్తుల, చాకులతో వస్తామని కొందరు బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని, అయితే ఇది క్రిమినల్ నేరం అని మర్చిపోవద్దని, కోర్టులు మిమ్మల్ని విడిచిపెట్టవని హెచ్చరించారు.