7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vivo Y500s launched: వివో (vivo) నుండి మిడ్ రేంజ్ బడ్జెట్ శ్రేణిని పెంచుతూ Vivo Y500s ఫోన్‌ను చైనాలో లాంచ్ చేసింది. ఈ వివో Y500sలో 6.75 అంగుళాల HD+ LCD డిస్‌ప్లే ఉండగా.. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ ఉండటం వల్ల స్క్రోలింగ్, గేమింగ్ అనుభవం స్మూత్‌గా ఉంటుంది. ఇక ఫోన్ లో Snapdragon 4 Gen 2 ప్రాసెసర్ ఉపయోగించారు. ఇది ఆక్టా-కోర్ CPU, Adreno 613 GPUతో వస్తూ రోజువారీ వినియోగానికి సరిపడే పనితీరును అందిస్తుంది. 12GB వరకు ర్యామ్, 512GB వరకు స్టోరేజ్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. ఆండ్రాయిడ్ 16 ఆధారిత OriginOS 6పై ఈ ఫోన్ పనిచేస్తుంది.
ఫోటోగ్రఫీ కోసం 50MP రియర్ కెమెరా (f/1.8 అపర్చర్) ఇవ్వబడింది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8MP ఫ్రంట్ కెమెరా ఉంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, Wi-Fi, బ్లూటూత్, GPS, NFC, USB టైపు-C వంటి అన్ని అవసరమైన ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్‌లో యాక్సిలెరోమీటర్, అంబియంట్ లైట్ సెన్సర్, ప్రాక్సిమిటీ సెన్సర్, ఎలక్ట్రానిక్ కంపాస్ వంటి సెన్సర్లు ఉన్నాయి. అదనంగా IR రిమోట్ కంట్రోల్ ఫీచర్ కూడా ఉంది. సెక్యూరిటీ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ సపోర్ట్ అందించారు.
Also Read
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
- Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
- Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
- Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
Vivo Y500sలో 7200mAh భారీ బ్యాటరీ ప్రధాన హైలైట్. 44W ఫాస్ట్ చార్జింగ్‌తో పాటు రివర్స్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. స్టీరియో డ్యూయల్ స్పీకర్లు ఉండటం వల్ల ఆడియో అనుభవం మెరుగ్గా ఉంటుంది. ఫోన్ బరువు సుమారు 219 గ్రాములు కాగా, స్లిమ్ డిజైన్‌తో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. చైనాలో ఈ ఫోన్ ప్రారంభ ధర CNY 1,800 (రూ. 24,800)గా ఉంది. 12GB + 256GB అండ్ 8GB + 512GB వేరియంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. గెలాక్సీ సిల్వర్, ఆబ్సిడియన్ బ్లాక్, ఫీనిక్స్ గోల్డ్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!