Pakistan: పెషావర్‌లో సిక్కు వ్యక్తికి కాల్చి చంపిన దుండగులు.. రెండు రోజుల్లో రెండో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ దేశంలో మైనారిటీలపై దాడులకు అడ్డుకట్టపడటం లేదు. హిందువులు, సిక్కులపై దాడులకు తెగబడుతున్నారు. తాజాగా ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్ రాజధాని పెషావర్ నగరంలో సిక్కు వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపారు. మన్మోహన్ సింగ్ అనే వ్యక్తి రషీద్ గర్హి నుంచి పెషావర్ లోని ఇంటీరియర్ సిటీ ప్రాంతానికి వెళ్తుండగా.. గుల్దారా చౌక్ కక్షల్ సమీపంలో కొందరు సాయుధ వ్యక్తులు అతనిపై దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన అతని ఆస్పత్రికి తరలించే లోపే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
గత 48 గంటల్లో ఇది రెండో ఘటన. శనివారం యక్కా టూట్ ప్రాంతంలో సిక్కు వ్యక్తిపి ఇలాగే దాడి జరిగింది. శుక్రవారం జరిగిన దాడిలో సిక్కు వ్యక్తి కాళ్లకు బుల్లెట్ గాయాలయ్యాయి. మార్చి నెలలో కూడా సిక్కు వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి హత్య చేశారు. ఖైబర్ ప్రావిన్సులో 15,000 మంది సిక్కులు పెషావర్ ప్రాంతంలో నివసిస్తున్నారు. ఎక్కువగా నగరంలోని జోగన్ షా పరిసరాల్లో నివసిస్తున్నారు. పెషావర్ నగరంలో ఎక్కువ మంది సిక్కులు వ్యాపారంలో ఉన్నారు. వీటితో పాటు ఫార్మసీలను నిర్వహిస్తున్నారు.
Also Read
- Pakistan: పాక్ ఆర్మీకి అమెరికా డ్రోన్లు.. ట్రంప్ కుమారులతో లింక్.!
- Trump-Houthi: సౌదీకి ట్రంప్ షాక్! హౌతీలతో రహస్య భేటీ.. అమెరికా సైడ్ అయినట్టేనా?
- US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
- Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
Read Also: Dowry Harassment: పెళ్లైన ఏడాదికే వివాహిత ఆత్మహత్య.. ఆ వేధింపులు భరించలేకే..
గతేడాది సెప్టెంబర్ లో ప్రముఖ సిక్కు హకీమ్ (యునానీ మెడికల్ ప్రాక్టీషనర్)ను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. 2018లో, ప్రముఖ సిక్కు కమ్యూనిటీ సభ్యుడు చరణ్‌జిత్ సింగ్‌ను పెషావర్‌లో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. అదేవిధంగా, న్యూస్ ఛానెల్ యాంకర్ రవీందర్ సింగ్ 2020లో నగరంలో హత్యకు గురయ్యారు. 2016లో పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ నేషనల్ అసెంబ్లీ సభ్యుడు సోరెన్ సింగ్ కూడా పెషావర్‌లో హత్య చేయబడ్డాడు.
పాకిస్తాన్ జనాభాలో 75 లక్షల మంది హిందువులు నివసిస్తున్నారు. మైనారిటీల్లో ఆ తరువాత స్థానాల్లో క్రైస్తవులు, సిక్కులు ఉన్నారు. హిందువులు కూడా పాకిస్తాన్ లో హింసకు గురవుతున్నారు. ముఖ్యంగా హిందువులు ఎక్కువగా సింధ్ ప్రావిన్సులో నివసిస్తున్నారు. ఇక్కడ హిందూ బాలికను కిడ్నాప్ చేసి బలవంతంగా మతం మార్చి, ముస్లిం వ్యక్తులకు ఇచ్చి వివాహం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
-
OTR: వైసీపీ ప్లాన్ రివర్స్! రేపల్లెలో ఫ్యాన్‌కు బ్రేక్!
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!