Egg Pickle Recipe : నాలుకపై నర్తించే రుచి.. ఇంట్లోనే కోడిగుడ్డు పచ్చడి.. తయారీ విధానం ఇలా..!
- 10 నిమిషాల్లో రెడీ అయ్యే ఎగ్ పచ్చడి
- గోల్డెన్ ఫ్రైతో ప్రత్యేక రుచి
- మసాలా మిక్స్‌లో అసలు మ్యాజిక్
- నిల్వ ఉండేలా చేయాలంటే ఈ చిట్కా పాటించండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Easy Egg Pickle Recipe at Home in Telugu : సాధారణంగా పచ్చడి అనగానే మనకు ఆవకాయో, చికెన్ పచ్చడో గుర్తుకు వస్తుంది. కానీ, వీటికి ఏమాత్రం తీసిపోని విధంగా, కేవలం పది నిమిషాల్లో నోరూరించే కోడిగుడ్డు పచ్చడి (Egg Pickle) తయారు చేసుకోవచ్చు. ముక్క చెదరకుండా, మసాలాలు చక్కగా పట్టి, వేడి వేడి అన్నంలో కలిపి తింటే ఆ మజానే వేరు. ఈ వెరైటీ పచ్చడిని పక్కా కొలతలతో ఎలా చేయాలో ఈ ఆర్టికల్‌లో చూద్దాం.
కావలసిన పదార్థాలు:
Also Read
- Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
- Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే 'రాగి బిస్కెట్లు'.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
- Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
- Ragi Samosa Recipe: మైదాకు చెక్.. రాగితో టేస్టీ, హెల్తీ సమోసాలు ట్రై చేయండి.. తయారీ విధానం ఇదిగో!
- కోడిగుడ్లు (ఉడకబెట్టినవి)
- నూనె (వేగించడానికి సరిపడా)
- అల్లం వెల్లుల్లి పేస్ట్
- కారం, ఉప్పు, పసుపు
- గరం మసాలా లేదా ఆవపిండి
- నిమ్మరసం
తయారీ విధానం:
1. గుడ్లను సిద్ధం చేయడం:
మొదటగా కోడిగుడ్లను గట్టిగా ఉడకబెట్టి, పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. గుడ్లు వేయించేటప్పుడు పేలకుండా ఉండాలంటే వాటిపై చాకుతో చిన్న గాట్లు పెట్టడం మర్చిపోవద్దు.
2. గోల్డెన్ ఫ్రై:
ఒక బాణలిలో నూనె వేడి చేసి, ఉడకబెట్టిన గుడ్లను అందులో వేయాలి. ఇవి పైన క్రిస్పీగా, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు దోరగా వేయించి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా వేయించడం వల్ల పచ్చడిలో గుడ్డు ముక్క గట్టిగా ఉండి రుచిని ఇస్తుంది.
3. మసాలా తయారీ:
గుడ్లు వేయించిన అదే నూనెలో (అవసరమైతే కొంచెం నూనె తగ్గించుకోవచ్చు) అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. ఆ తర్వాత మంటను తగ్గించి తగినంత ఉప్పు, కారం, పసుపు , గరం మసాలా వేసి బాగా కలపాలి. మసాలాలు మాడిపోకుండా జాగ్రత్త పడాలి.
4. పచ్చడి ఫినిషింగ్:
ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న కోడిగుడ్లను ఈ మసాలా మిశ్రమంలో వేసి, ప్రతి గుడ్డుకు మసాలా పట్టేలా నెమ్మదిగా కలుపుకోవాలి. మసాలా అంతా గుడ్లకు పట్టిన తర్వాత స్టవ్ ఆపేసి మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి.
కీలకమైన చిట్కా:
పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాతే అందులో నిమ్మరసం కలపాలి. వేడిగా ఉన్నప్పుడు కలిపితే పచ్చడి చేదు వచ్చే అవకాశం ఉంటుంది. నిమ్మరసం కలపడం వల్ల పచ్చడికి మంచి పులుపు రావడమే కాకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.
ఎప్పుడూ తినే కూరలు తిని బోర్ కొట్టినప్పుడు లేదా ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఈ కోడిగుడ్డు పచ్చడి ఒక అద్భుతమైన ఆప్షన్. తక్కువ శ్రమతో తయారయ్యే ఈ పచ్చడిని గాజు సీసాలో భద్రపరుచుకుంటే కొన్ని రోజుల పాటు తాజాగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి..
తాజావార్తలు
-
Arjuna: పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు పాన్-ఇండియా మూవీ.. టైటిల్ ఇదేనట?
-
Hyderabad Traffic Police : డ్రైవింగ్ చేస్తూ సెల్‌ఫోన్ వాడిన 3600 మంది పట్టుకున్న పోలీసులు..
-
Nitesh Tiwari: ఆ ఒక్క ఫైట్ సీన్ కోసమే ఆరున్నరేళ్లు.. ‘రామాయణ’ మూవీపై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!
-
Trafficking: ఫెర్టిలిటీ సెంటర్లలో త్వరలోనే తనిఖీలు.. కఠిన చర్యలకు మల్కాజ్గిరి సీపీ హెచ్చరిక..
-
DG Charu Sinha: మహిళల భద్రత ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!