Cement Rates: గత కొంత కాలంగా సిమెంట్ రేట్లు పెరిగిపోతున్నాయి. సామాన్యుడి ఇల్లు కట్టుకునే కలను కలగానే మిగులుస్తున్నాయి. అయితే ఈ ఏడాది మాత్రం సిమెంట్ ధరలు దిగి వస్తాయిని ప్రముఖ రేటింగ్ సంస్థ క్రిసిల్ అంచనా వేసింది. గత నాలుగేళ్లలో 4 శాతం వార్షికి వృద్ధి రేటుతో సిమెంట్ ధరలు పెరిగాయి. తాజా పరిణామాల వల్ల కొంత తగ్గుతాయని అంచాన వేస్తోంది.
2022-23 ఆర్థిక సంవత్సరంలో 50 కిలోమీల బస్తా ధర జీవిత కాల గరిష్టమైన రూ. 391 కు చేరింది. దీనికి కోవిడ్-19 పరిణామాలు కూడా తోడయ్యాయి. బొగ్గు లాంటి ముడిసరుకుల ధరలు పెరగడం, ఆ తరువాత రష్యా-ఉక్రెయిన్ పరిణామాల వల్ల రేట్లు పెరిగాయి. ప్రస్తుతం సిమెంట్ పరిశ్రమలో తీవ్ర పోటీ పెరగడం, ముడి సరుకు వ్యయాలు తగ్గియి, దీంతో ధరలు స్వల్పంగా తగ్గే అవకాశం ఉందని తెలిపింది. ఎన్నికల ముందు ఏడాది అయినందున, సిమెంట్ గిరాకీలో వృద్ధి 8-19 శాతం ఉంటే అవకాశమున్నా కూడా ధరలు పెరగకపోవచ్చని అంచనా వేసింది. ఏడాది క్రితంతో పోలిస్తే 2 శాతం తగ్గి బస్తా ధర రూ.382-385కి దిగి రావచ్చని అంచనా వేస్తున్నారు.
Read Also: Dowry Harassment: పెళ్లైన ఏడాదికే వివాహిత ఆత్మహత్య.. ఆ వేధింపులు భరించలేకే..
2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆస్ట్రేలియా బొగ్గు ధర టన్నుకు 344 డాలర్లు ఉండగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 150-200 డాలర్లకు తగ్గొచ్చని క్రిసిల్ పరిశోధన విభాగం అసోసియేట్ డైరెక్టర్ కౌస్తవ్ మజుందార్ అంచానా వేస్తున్నారు. ఈ ఏడాదిలో బ్రెంట్ ముడి చమురు ధర కూడా 17 శాతం తగ్గవచ్చనే అంచనాల నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరం రెండో అర్థభాగంలో డిజిల్ రేట్లు కూడా తగ్గే అవకాశం ఉంది. బొగ్గు, ఇంధనం ఈ రెండి ధరలు తగ్గుతుండటం కూడా సిమెంట్ ధరలు దిగివచ్చేందుకు దోహదం చేస్తాయని అంచనా.. 2022-23 నాలుగో త్రైమాసికింలో బస్తా ధర 1 శాతం తగ్గి ధర రూ. 388కి దిగివచ్చింది. పరిశ్రమల మధ్య పోటీ ఉండటం వల్ల కంపెనీలు ధరల పెంపు జోలికి వెళ్లడం లేదు. గిరాకీ స్థిరంగా ఉన్నప్పటికీ చాలా ఏళ్ల తర్వాత తొలిసారి వర్షకాలానికి ముందు ఏప్రిల్, మే నెలల్లో కంపెనీలు రేట్లను పెంచలేదు.