Congress: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడంపై పలు విదేశాలు స్పందిస్తున్నాయి. ఇప్పటికే అమెరికా, జర్మనీలు పరిస్థితిని గమనిస్తున్నామంటూ వ్యాఖ్యలు చేశాయి. అయితే నిన్న జర్మనీ విదేశాంగ మంత్రిత్వ శాఖ రాహుల్ గాంధీ అనర్హతపై స్పందించింది. ‘‘ భారత్ లో రాహుల్ గాంధీకి జైలు శిక్ష, లోక్ సభ సభ్యత్వం కోల్పోవడం వంటి అంశాలను మేం గమనిస్తున్నాం, ఈ కేసులో ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రాలు వర్తిస్తాయి. రాహుల్ గాంధీ పైకోర్టుకు అప్పీల్ చేసుకోవచ్చు.’’ అని జర్మనీ పేర్కొంది.
అయితే రాహుల్ గాంధీ విషయంపై స్పందించినందుకు పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ జర్మనీకి థాంక్స్ తెలుపుతూ ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఎలా అనగదొక్కుతున్నారో రాహుల్ గాంధీ ఉదంతం నిదర్శమని ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్నందుకు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు.
Read Also: Radhika Apte: 14 ఏళ్ల తర్వాత స్పెషల్ ఆఫీసర్ అవతారం ఎత్తిన సాధారణ హౌజ్ వైఫ్
అయితే దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలు కాంగ్రెస్ ను ఇరకాటంలో పడేశాయి. విదేశాల జోక్యం కాంగ్రెస్ కోరుతోందని బీజేపీ కేంద్ర మంత్రులు విమర్శలు గుప్పిస్తోంది. దీంతో కాంగ్రెస్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. భారతదేశ సమస్యలను, ప్రజాస్వామ్యాన్ని మేం రక్షించుకోలమని నిన్న కాంగ్రెస్ తెలిపింది. దీంతో ఇతరుల జోక్యం అవసరం లేదన్నట్టుగా వ్యాఖ్యలు చేసింది. ఇదిలా ఉంటే మాజీ కాంగ్రెస్ నేత, రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ కూడా స్పందించారు. మనం ముందుకు వెళ్లడానికి మనకు అండదండలు అవసరం లేదని నేను భావిస్తున్నాను, విదేశాల నుంచి మనకు ఆమోదం అవసరం లేదని సిబల్ అన్నారు.
2019 లోక్ సభ ఎన్నికల ముందు కర్ణాటక కోలార్ లో ప్రసంగిస్తూ.. మోదీ ఇంటి పేరున్న వారంతా దొంగలే అని రాహుల్ కామెంట్స్ చేశారు. దీనిపై బీజేపీ గుజరాత్ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ పరువునష్టం దావా వేశారు. ఇటీవల సూరత్ కోర్టు ఈ కేసులో రాహుల్ గాంధీని దోషిగా తేల్చి రెండేళ్లు జైలు శిక్ష విధించింది. ప్రజాప్రాతినిధ్య చట్టం-1951 ప్రకారం ఎవరైనా ప్రజాప్రతినిధికి రెండేళ్లు లేదా అంతకన్నా ఎక్కువ కాలం జైలు శిక్ష పడితే అతడు పదవికి అనర్హుడు అవుతాడు. ఈ చట్టం ప్రకారమే రాహుల్ గాంధీ పదవి ఊడింది.