వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో, అతని భార్యను అమెరికా సైన్యం అరెస్ట్ చేసింది. శనివారం తెల్లవారుజామున పెద్ద ఎత్తున సైనిక దాడి చేసి అందుపులోకి తీసుకుంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.
ఇది కూడా చదవండి: Trump-Iran: ఇంకా ఎవరైనా చనిపోతే ఖబడ్దార్.. ఖమేనీకి ట్రంప్ గట్టి వార్నింగ్
ఇక నికోలస్ మదురోను అమెరికాకు తీసుకెళ్లిపోవడంతో వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిగ్జ్ బాధత్యలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టగానే అమెరికా చర్యలను తప్పుపట్టారు. మదురోను నిర్బంధించడం సరికాదని, వెంటనే విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: PM Modi: సోమనాథ్.. కోట్లాది మంది ఆత్మశక్తి.. ప్రధాని మోడీ ప్రత్యేక వ్యాసం!
తాజాగా ఇదే అంశంపై ట్రంప్ స్పందించారు. వెనిజులా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు అమెరికా చేయాలనుకుంటున్న పనులను చేసేందుకు డెల్సీ రోడ్రిగ్జ్ సుముఖంగా ఉండాలన్నారు. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. ఆమె సరైన నిర్ణయాలు తీసుకోకపోతే మదురో కంటే ఘోరమైన గతి పడుతుందన్నారు. వెనిజులాపై అమెరికా నియంత్రణకు అంగీకరించాల్సిందేనని.. అప్పుడే ఆ దేశాన్ని పునర్నిర్మించగలమని చెప్పారు. తాము చెప్పినట్లు చేస్తే వెనిజులాలో అమెరికా దళాలు మోహరించబోవు అని ట్రంప్ తేల్చిచెప్పారు.
