Dharam Gokhool: బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు మారిషష్ దేశాధ్యక్షులు ధర్మబీర్ గోఖూల్ దంపతులు.. ఆధికారిక పర్యటనలో భాగంగా విజయవాడకు వచ్చిన ఆయన ఆలయానికి విచ్చేశారు. ధర్మబీర్ గోఖూల్ కు అర్చకులు, వేద పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమంలో దేవదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్, ఆలయ ఈవో వీకే శీనానాయక్, దుర్గ గుడి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ పాల్గొన్నారు. దర్శనం అనంతరం మారిషష్ దేశాధ్యక్షుల దంపతులకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు.
Read Also: Sankranthi 2025 : సంక్రాంతికి అందాల జాతర చేసేందుకు రెడీ అయిన భామలు
కాగా, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి-గుంటూరు వేదికగా జరుగుతోన్న 3వ ప్రపంచ తెలుగు మహాసభలు 2026కి మారిషస్ అధ్యక్షుడు ధర్మబీర్ గోఖూల్ ముఖ్య అతిథిగా విచ్చేసిన విషయం విదితమే.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు భాషను కేవలం ఒక కమ్యూనికేషన్ సాధనంగా కాకుండా, అది ఒక జీవంతమైన నాగరికతకు గొప్ప ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతీక కొనియాడారు మారిషస్ అధ్యక్షుడు ధర్మబీర్ గోఖూల్..