జగద్గిరిగుట్ట యస్బెస్టస్ కాలనిలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. పేలుడు ధాటికి ఇల్లు కూలిపోయింది. ఈ ప్రమాదంలో రెండు కుటుంబాల్లోని ఏడుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని ఒరిస్సా వాసులుగా గుర్తించారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీలసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. సహాయక చర్యలు ప్రారంభించి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఉస్మానియా ఆసుపత్రిలో బాధితులు చికిత్స పొందుతున్నారు. సిలిండర్ పేలడంతో కాలనీ వాసులు భయంతో ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. ఆ ప్రాంతమంతా భయానక […]
అల్పపీడనం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలతో రాష్ట్రం తడిసిముద్దైపోయింది. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జనజీవనం అస్తవ్యస్తమైపోయింది. హైదరాబాద్ లో రాత్రి నుంచి వర్షం కురుస్తోంది. పలుచోట్ల ముసురు, అక్కడక్కడ మోస్తరు వర్షం పడుతోంది. దీంతో ప్రజలు బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఇవాళ నగరానికి ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ముసురు వానలు పడుతుండడంతో వినాయక చవితి వేడుకలకు ఆటంకం ఏర్పడింది. Also Read:Doda Cloudburst: […]
మంగళవారం వరుసగా మూడో రోజు జమ్మూ డివిజన్లో కుండపోత వర్షం విధ్వంసం సృష్టించింది. శ్రీ మాతా వైష్ణో దేవి యాత్ర మార్గంలోని అర్ధ్కుమ్వారీ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటం, దోడాలో క్లౌడ్ బరస్ట్ కారణంగా మొత్తం 13 మంది ప్రాణాలు కోల్పోయారు. కాట్రాలో తొమ్మిది మంది భక్తులు, దోడాలో నలుగురు మరణించారు. యాత్ర మార్గంలో కొండచరియలు విరిగిపడి 22 మంది భక్తులు గాయపడ్డారు. Also Read:Fake Liquor Labels: మీరు తాగుతున్న మద్యం క్వాలిటీనేనా? అసలు మ్యాటరేంటంటే? జమ్మూలోని […]
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీని సందర్శించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. తెలంగాణ పదానికి ప్రత్యామ్నాయం ఉస్మానియా యూనివర్సిటీ.. తెలంగాణ, ఉస్మానియా రెండూ అవిభక్త కవలల్లాంటివి.. 1938 సాయుధ రైతాంగ పోరాటానికి ఊపిరిలూదిన గడ్డ ఇది.. దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన శివరాజ్ పాటిల్, పీవీ నర్సింహారావు ఈ యూనివర్సిటీ విద్యార్థులే.. ఉత్తమ పార్లమెంటేరియన్ గా గుర్తింపు పొందిన జైపాల్ రెడ్డి ఈ యూనివర్సిటీ విద్యార్థినే.. తెలంగాణ నలుమూలలా ఏ సమస్య వచ్చినా […]
పుణేలో ఓ హృదయ విదారక సంఘటన చోటుచేసుకుంది. భర్త ప్రాణాలను కాపాడేందుకు భార్య తన కాలేయాన్ని దానం చేసింది. అయితే వైద్యులు చేసిన కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలో దురదృష్టవశాత్తూ భార్యాభర్తలు ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళ్తే, పుణేకు చెందిన ఓ వ్యక్తి కొంతకాలంగా తీవ్రమైన లివర్ సమస్యతో బాధపడుతూ ఉన్నాడు. వైద్యులు కాలేయ మార్పిడి మాత్రమే చివరి మార్గమని సూచించారు. ఈ పరిస్థితుల్లో తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా భార్య ముందుకు వచ్చి భర్తకు కాలేయం […]
ప్రేమించి పెళ్లి చేసుకుని ఆ తర్వాత భార్య స్వాతిపై అనుమానం పెంచుకుని.. గర్భవతి అన్న కణికరం లేకుండా అత్యంత దారుణంగా హత్య చేశాడు భర్త మహేందర్ రెడ్డి. తమ కూతురు మృతికి కారణమైన మహేందర్ రెడ్డిని కఠినంగా శిక్షించాలంటూ కుటుంబీకులు నిందితుడి ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో మహేందర్ రెడ్డి గురించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. గతంలోనే స్వాతి హత్యకు ప్లాన్ చేశాడని ఎన్టీవీతో స్వాతి చెల్లెలు శ్వేత తెలిపింది. కామారెడ్డిగూడ శివారులో […]
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికాసేపట్లో ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఓయూలో 80 కోట్ల వ్యయంతో నిర్మాణమై 1200 మంది విద్యార్థులకు వసతి కల్పించే రెండు హాస్టల్స్ ను ప్రారంభించనున్నారు. గిరిజన సంక్షేమం శాఖ ఆర్థిక సహాయంతో మరో 300 మంది విద్యార్థులకు వసతి కల్పించే రెండు కొత్త హాస్టల్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న సీఎం దాదాపు 10 కోట్ల నిధులతో డిజిటల్ లైబ్రరీ రీడింగ్ రూం పనులకు కూడా ప్రారంభించనున్నారు. Also Read:Agent […]
హైదరాబాద్ లోని మేడిపల్లిలో గర్భిణి అయిన భార్యను అనుమానంతో ముక్కలు ముక్కలుగా నరికి చంపాడు భర్త మహేందర్ రెడ్డి. డెడ్ పార్ట్స్ ను మూసీలో పడేశాడు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. ఈ క్రమంలో స్వాతి సోదరి శ్వేత మహేందర్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. NTV తో స్వాతి సోదరి శ్వేత మాట్లాడుతూ.. మహేందర్ రెడ్డి నన్ను కూడా వేధించాడు.. కాలేజీ కి వచ్చి నన్ను చాలాసార్లు ఇబ్బంది పెట్టాడు.. మా అక్కను హింసించి హత్య […]
నేడు మరోసారి పుత్తడి ధరలు స్వల్పంగా తగ్గాయి. నేడు తులం గోల్డ్ ధర రూ. 110 తగ్గింది. కిలో సిల్వర్ ధర రూ. 1000 పెరిగింది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.10,151, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,305 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 100 తగ్గింది. దీంతో రూ.93,050 వద్ద […]
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం రాయికల్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. తల్లి పొలం పనుల్లో నిమగ్నమై ఉండగా.. ఆడుకుంటూ వెళ్లి వ్యవసాయబావిలో పడిపోయాడు 18 నెలల బాలుడు. కౌశిక్ నందు అనే బాలుడు బావిలో పడి మృతిచెందాడు. బాలుడిని వ్యవసాయ బావి వద్ద కూర్చోబెట్టి తల్లి పొలానికి నీళ్లు పెడుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తల్లి కళ్ళముందే బాలుడు మృతి చెందడంతో గుండెలవిసేలా రోదించింది. పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సాయంతో […]