వానాకాలం ముగిసి శీతాకాలం ఎంటర్ అయినప్పటికి వరుణుడు మాత్రం వదలనంటున్నాడు. గత కొన్ని రోజుల క్రితం మొంథా తుఫాన్ ఏపీ, తెలంగాణలో బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. కుండపోత వర్షాలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అయ్యాయి. వాగులు, వంకలు, నదులు పొంగి పొర్లాయి. భారీ వరదలతో లోతట్టు ప్రాంత్రాలు జలమయమయ్యాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. రోడ్లు ధ్వంసం అయ్యాయి. ఆ తుఫాన్ ప్రభావం వీడి రోజులు గడవకముందే నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం బయపెడుతోంది.
Also Read:Andhra Pradesh:విశాఖలో మేనేజ్ మెంట్ ఇన్ స్టిట్యూట్ హోటల్ ప్రాజెక్ట్.. 2000 మందికి ఉపాధి
అల్పపీడనం కొనసాగుతుందని దీంతో ఆంధ్రప్రదేశ్ లో రాబోయే రెండ్రోజులు భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మత్య్సకారులు వేటకు సముద్రంలోకి వెళ్లొద్దని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.