సరూర్ నగర్ భర్త హత్యకేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భర్త శేఖర్(40) ని తన భార్య డంబెల్స్ తో మోది హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. భర్త శేఖర్ నిద్రిస్తున్న సమయంలో భార్య చిట్టి డంబెల్స్ తో మోదగా, ప్రియుడు హరీష్ గొంతు నులిమి హత్యకు పాల్పడ్డారు. కొద్దీ రోజుల క్రితమే భార్య చిట్టికి హరీష్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడినట్లు తెలిపారు. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. శేఖర్,చిట్టీలకు కూతురు,కుమారుడు పిల్లలున్నారు. […]
కేరళలోని కొచ్చిలోని కెనరా బ్యాంక్ శాఖ వద్ద ఒక విచిత్రమైన నిరసన కనిపించింది. ఆఫీసు, క్యాంటీన్లలో గొడ్డు మాంసం నిషేధించాలన్న ఆదేశాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యోగులు బయటకు వచ్చి గొడ్డు మాంసం, పరాఠాలు వడ్డిస్తూ నిరసన తెలిపారు. ఇటీవల కేరళలో బాధ్యతలు స్వీకరించిన బీహార్ స్థానికుడైన రీజినల్ మేనేజర్, కెనరా బ్యాంక్ క్యాంటీన్లలో గొడ్డు మాంసం నిషేధించాలని ఆదేశించినట్లు వార్తలు వస్తున్నాయని నిరసనకారులు ఆరోపించారు. బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (BEFI) మొదట మేనేజర్ మానసిక వేధింపులు, […]
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి (ఆగస్టు 30) ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాలు మొత్తం 3 రోజులపాటు కొనసాగుతాయని అంచనా వేస్తున్నారు. ఈ సమావేశాల్లో ప్రధానంగా కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై చర్చ జరగనుంది. తెలంగాణ క్యాబినెట్ ఇటీవలే ఈ రిపోర్టును ఆమోదించింది. పూర్తి స్థాయిలో రూపొందించబడిన రిపోర్టు మొత్తం 600 పేజీలకు పైగా ఉంది. అసెంబ్లీ సభ్యులకు ఈ రిపోర్టును అందజేసి, అన్ని పార్టీల అభిప్రాయాలను సవివరంగా తెలుసుకొని, తర్వాత పూర్తి స్థాయిలో చర్చలు నిర్వహించడం లక్ష్యంగా […]
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మెట్రో రైల్ సంస్థ మెట్రో సేవలను పొడిగించింది. ఆగస్ట్ 30న ప్రత్యేకంగా పొడిగించిన సేవలు అందిస్తోంది. అన్ని టెర్మినల్ స్టేషన్ల నుంచి చివరి రైలు రాత్రి 11:45 గంటలకు బయలుదేరుతుంది. మీ పండల్ దర్శనాలు ఇప్పుడు మరింత సులభం, టెన్షన్ లేకుండా..ఎక్కువ సమయం.. ఎక్కువ భక్తి.. ఎక్కువ సౌకర్యం.. అంటూ హైదరాబాద్ మెట్రో ప్రకటించింది. నగరంలో గణపతి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. గణేషుడిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తులకు ప్రయాణంలో ఇబ్బందులు తలెత్తకుండా […]
మెదక్ జిల్లాలో ఆర్మీ జవాన్లకి పెను ప్రమాదం తప్పింది. రెస్క్యూ కోసం ట్రయల్ వేస్తుండగా బోటు బోల్తా పడింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది జవాన్లను రక్షించేందుకు రంగంలోకి దిగారు. తాళ్ల సాయంతో జవాన్లను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. కాగా ఈ నెల 27న వినాయకుని విగ్రహం కొనుగోలు చేసేందుకు కామారెడ్డి జిల్లా లింగంపల్లి గ్రామానికి చెందిన 8 మంది చిన్నారులు మెదక్ కు వచ్చారు. భారీగా కురిసిన వర్షాలతో పోచారం వరద ఎక్కువ కావడంతో మూడు రోజులుగా […]
ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్ సంగ్ మరో కొత్త స్మార్ట్ ఫోన్ ను రిలీజ్ చేసింది. సామ్ సంగ్ గెలాక్సీ ఏ17 5G స్మార్ట్‌ఫోన్ భారత్ లో విడుదలైంది. ఇది సామ్ సంగ్ A-సిరీస్ లైనప్‌లో తాజా బడ్జెట్ స్మార్ట్‌ఫోన్. సామ్ సంగ్ తాజా Galaxy A17 5G స్మార్ట్‌ఫోన్ AMOLED డిస్ప్లేతో వస్తోంది. కంపెనీ ఈ ఫోన్‌ను 5000 mAh బ్యాటరీ, 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరాతో మార్కెట్లో విడుదల చేసింది. Also Read:Power Star […]
వరంగల్ జిల్లా ఖిలావరంగల్ తహసిల్దార్ బండి నాగేశ్వర్ రావు ఇంటిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడులు చేశారు. హనుమకొండ ప్రశాంత్ నగర్ లోని ఆయన ఇంటిపై వరంగల్ ఏసీబీ అధికారులు ఉదయం నుంచి సోదాలు జరుపుతున్నారు. తహసిల్దార్ నాగేశ్వరరావు సొంత జిల్లా ఖమ్మంలో సైతం ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. బండి నాగేశ్వర్ రావు గతంలో ధర్మసాగర్, కాజీపేట, హసన్ పర్తి మండలాల్లో తహసిల్దారుగా పనిచేశారు. ఆ సమయంలో ఆయనపై ఆరోపణలు వచ్చినట్లు తెలిసింది. […]
నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వ సంస్థ గుడ్ న్యూస్ అందించింది. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వివిధ పోస్టుల నియామకాల కోసం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 1543 పోస్టులను భర్తీ చేయనున్నారు. పవర్ గ్రిడ్ ఫీల్డ్ ఇంజనీర్, ఫీల్డ్ సూపర్వైజర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఫీల్డ్ ఇంజనీర్ మరియు ఫీల్డ్ సూపర్వైజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు గుర్తింపు పొందిన విద్యా సంస్థల నుంచి BE, BTech, […]
పుత్తడి ధరల్లో నేడు మళ్లీ మార్పులు చోటుచేసుకున్నాయి. నిన్నటి వరకు భారీగా పెరిగి షాకివ్వగా.. నేడు స్వల్పంగా పెరిగి ఊరటనిచ్చాయి. తులంపై జస్ట్ రూ. 10 పెరిగింది. కిలో సిల్వర్ పై రూ. 100 తగ్గింది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.10,261, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,406 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం […]
భారత రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌కు ఐఎంఎఫ్‌లో కీలక బాధ్యత లభించింది. అంతర్జాతీయ ద్రవ్య నిధిలో 3 సంవత్సరాల పాటు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమించడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 2016లో రఘురామ్ రాజన్ తర్వాత పటేల్ ఆర్బిఐ 24వ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన పదవీకాలంలోనే ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు వంటి పెద్ద నిర్ణయం తీసుకుంది. 2018 సంవత్సరంలో, ఆయన వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేశారు. ఆ కారణంగా వ్యక్తిగత […]