సీసీఐ ప్రవేశపెట్టిన నూతన నిబంధనల నేపథ్యంలో కాటన్ మిల్లర్స్ అసోసియేషన్ బందుకు పిలుపునిచ్చారు. దీంతో రెండో రోజు రాష్ట్రవ్యాప్తంగా పత్తి కొనుగోళ్ల బంద్ కొనసాగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ తో పాటు అన్ని మార్కెట్ లో పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా 322 మిల్లులు బందులో పాల్గొన్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నిలిచిపోయిన సుమారు మూడు లక్షల ఇరవై వేల క్వింటాళ్ల పత్తి కొనుగోళ్లు. అందులో ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో సుమారు పదివేల క్వింటాళ్ల పత్తి కొనుగోలు నిలిచిపోయింది.
Also Read:Umar: ఢిల్లీ బ్లాస్ట్‌కు ముందు ఏం జరిగింది.. వెలుగులోకి ఉమర్ సంచలన వీడియో
ప్రభుత్వం తమ వినతులపై శ్రద్ధ వహించే వరకు బంద్ కొనసాగుతుందని కాటన్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బొమ్మినేని రవీందర్ రెడ్డి తెలిపారు. కపాస్ కిసాన్ యాప్లో నమోదు చేసుకుని స్లాట్ బుకింగ్ మిల్లుల్లో అమ్మకాలు చేయడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారని వ్యాపారులు చెబుతున్నారు. జిన్నింగ్ మిల్లులను ఎల్1, ఎల్2, ఎల్ 3 ఇలా 12 కేటగిరీలుగా విభజించడం వల్ల ఇటు మిల్లర్లకు అటు రైతులకు నష్టం జరుగుతుందంటున్నారు వ్యాపారులు. జిన్నింగ్ మిల్ అసోసియేషన్ బందుకు రైతులు సహకరిస్తున్నారని వ్యాపారులు అంటున్నారు. ఆసియాలోనే అతిపెద్ద రెండో వ్యవసాయ మార్కెట్ అయిన ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో ప్రతిరోజు 15000 బస్తాల పత్తి అమ్మకాలు కొనుగోలు జరుగుతాయి.
Also Read:IT Raids: హైదరాబాద్ లో ప్రముఖ హోటళ్ల చైర్మన్లు, డైరెక్టర్ల ఇళ్లలో ఐటీ రైడ్స్.. ఏకకాలంలో 15 చోట్ల..
పత్తి వ్యాపారుల బంద్ నేపథ్యంలో.. తీసిన పత్తిని అమ్ముకోలేక ఇబ్బంది పడనున్న పత్తి రైతులు.. ఇప్పటికే అకాల వర్షాలతో దిగుబడి తగ్గిపోవడం తేమ ఇతర కారణాలతో ఇబ్బంది పడుతున్న రైతులకు పత్తి కొనుగోలు నిలిచిపోవడంతో మరింత భారం పడుతుంది. పత్తి రైతుల ఇబ్బందులపై బిఆర్ ఎస్ స్పందించింది. పత్తి రైతులకు మద్దతుగా బిఆర్ ఎస్ నేతలు మార్కెట్ బాట పట్టారు. నేడు ఎనుమాముల మార్కెట్ తో పాటు మహబూబాబాద్ కేసముద్రం వ్యవసాయ మార్కెట్లను మాజీ మంత్రి హరీష్ రావు సందర్శించనున్నారు.