పుత్తడి ధరల్లో నేడు మళ్లీ మార్పులు చోటుచేసుకున్నాయి. నిన్నటి వరకు భారీగా పెరిగి షాకివ్వగా.. నేడు స్వల్పంగా పెరిగి ఊరటనిచ్చాయి. తులంపై జస్ట్ రూ. 10 పెరిగింది. కిలో సిల్వర్ పై రూ. 100 తగ్గింది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.10,261, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,406 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం […]
భారత రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌కు ఐఎంఎఫ్‌లో కీలక బాధ్యత లభించింది. అంతర్జాతీయ ద్రవ్య నిధిలో 3 సంవత్సరాల పాటు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమించడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 2016లో రఘురామ్ రాజన్ తర్వాత పటేల్ ఆర్బిఐ 24వ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన పదవీకాలంలోనే ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు వంటి పెద్ద నిర్ణయం తీసుకుంది. 2018 సంవత్సరంలో, ఆయన వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేశారు. ఆ కారణంగా వ్యక్తిగత […]
తెలంగాణలో కురుస్తున్న కుండపోత వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. భారీ వరదల కారణంగా రోడ్లు ధ్వంసం అయ్యాయి. రాకపోకలకు తీవ్ర అంతారంయ ఏర్పడింది. ఇక ఇప్పుడు నార్సింగి ఔటర్ సర్వీస్ రోడ్డు, ఔటర్ ఎంట్రీ, ఎగ్జిట్ మూసివేశారు అధికారులు. ఇతర మార్గాల ద్వారా వెళ్లాలని ప్రయాణికులకు సూచించారు. ఉస్మాన్ సాగర్ 8 గేట్లు ఎత్తి 3000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు అధికారులు. దీంతో మూసీ నది ఉదృతంగా ప్రవహిస్తోంది. మంచిరేవుల బ్రిడ్జి పైనుంచి మూసీ నది […]
ఆ మహిళకు పెళ్లై మూడేళ్లు అయ్యింది. సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ అయిన ప్రవీణ్‌ను వివాహం చేసుకుంది. ఆమె ఇన్ఫోసిస్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. ఒకటిన్నర సంవత్సరాల పాప కూడా ఉంది. కానీ ఆమె జీవితాన్ని వరకట్న వేధింపులు బలిగొన్నాయి. కర్ణాటకలోని దక్షిణ బెంగళూరులోని సుద్దగుంటెపాళ్యంలో 27 ఏళ్ల మహిళా ఇంజనీర్ శిల్ప ఆత్మహత్య చేసుకున్న దిగ్భ్రాంతికరమైన కేసు వెలుగులోకి వచ్చింది. ఆమె భర్త, అత్తమామల వరకట్న వేధింపుల కారణంగా తమ కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని […]
తెలంగాణ చీఫ్ సెక్రటరీ రామకృష్ణా రావు పదవీ కాలం పొడిగించింది కేంద్రం. మరో ఏడు నెలల పాటు సీఎస్ పదవీ కాలాన్ని పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. 2026 మార్చి నెల వరకు పదవీ కాలం పొడిగించింది. ఈ నెల 31న రామకృష్ణా రావు పదవీ విరమణ చేయాల్సి ఉండగా ఆయన సర్వీసు పొడిగించాలని డివోపిటిని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దీంతో మరో 7 నెలలు సర్వీసు పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు ఇచ్చింది. ఏఐఎస్ (సీఎస్–ఆర్ఎం) […]
స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌లో జరిగిన డైమండ్ లీగ్ ఫైనల్లో భారతదేశపు స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా రెండవ స్థానంలో నిలిచాడు. ఫైనల్లో నీరజ్ అత్యుత్తమ త్రో 85.01 మీటర్లు. జర్మనీకి చెందిన జూలియన్ వెబర్ ఛాంపియన్‌గా నిలిచాడు. వెబర్ అత్యుత్తమ త్రో 91.51 మీటర్లు. ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ నీరజ్ 2022లో డైమండ్ లీగ్ ఫైనల్‌ను గెలుచుకోవడం ద్వారా డైమండ్ ట్రోఫీని అందుకున్నాడు. నీరజ్ 2023, 2024లో రెండవ స్థానంలో నిలిచాడు. Also Read:YS Jagan : […]
కామారెడ్డిలో వర్షాలు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షాలతో చోటుచేసుకున్న వరదలు జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. బీబీపేట పెద్ద చెరువు ప్రమాదకరంగా మారింది. చెరువుకు బుంగ పడటం తో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందస్తు రక్షణ చర్యల్లో భాగంగా బీబీపేట దిగువన ఉన్న షేర్ బీవీపేట గ్రామస్తులను ఖాళీ చేయించారు. జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలకు మరో రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించింది విద్యా శాఖ. Also Read: Telangana Flood Rescue : తెలంగాణలో ఇవాళ 1,444 […]
ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీ టీవీఎస్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ టీవీఎస్ ఆర్బిటర్‌ను విడుదల చేసింది. ఈ స్కూటర్ మార్కెట్లో అందుబాటులో ఉన్న ఇతర మోడళ్ల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. కంపెనీ ఈ స్కూటర్‌కు బాక్సీ, ఫ్యూచరిస్టిక్ డిజైన్ లో తీసుకొచ్చింది. టీవీఎస్ ఆర్బిటర్‌లో కనెక్ట్ చేయబడిన మొబైల్ యాప్, వైజర్‌తో ముందు LED హెడ్‌ల్యాంప్, ఇన్కమింగ్ కాల్ డిస్ప్లేతో కూడిన కలర్ LCD ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రారంభ […]
దేశ వ్యాప్తంగా కొలువుదీరిన గణేషుడు భక్తుల నుంచి పూజలందుకుంటున్నాడు. పూజలు, భజనలతో గణపయ్య భక్తులు భక్తిపారవశ్యంలో మునిగితేలుతున్నారు. కాగా కొందరు మూడో రోజు నుంచే నిమజ్జనం చేస్తుంటారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ గణేష్ నిమజ్జనానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. గణేష్ నిమజ్జనానికి హైదరాబాద్ పోలీసులు సిద్ధం అని తెలిపారు. ఈ ఏడాది నిమజ్జనానికి 30 వేల మంది పోలీసులతో బందో బస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 20 వేల మంది హైదరాబాద్ […]
జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రెడీ అయ్యింది. జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 976 పోస్టులను భర్తీ చేయనున్నారు. జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు ఆర్కిటెక్చర్/ఇంజనీరింగ్/టెక్నాలజీ/కంప్యూటర్ సైన్స్/కంప్యూటర్ ఇంజనీరింగ్ లేదా ఐటీ సబ్జెక్టులో బ్యాచిలర్ డిగ్రీ, ఇతర నిర్ణీత అర్హత కలిగి ఉండాలి. దరఖాస్తు చేసుకోవడానికి గేట్ […]