డబ్బులు అర్జెంటుగా అవసరంపడినప్పుడు ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ వద్ద అడుగుతారు. డబ్బు దొరక్కపోతె బ్యాంకులో లోన్ తీసుకునేందుకు రెడీ అవుతుంటారు. కానీ, బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు అంత ఈజీగా లోన్స్ ఇవ్వవు. మంచి క్రెడిట్ స్కోర్ ఉంటేనే లోన్స్ మంజూరు చేస్తుంటాయి. లేదంటే లోన్ అప్లికేషన్స్ ను రిజెక్ట్ చేస్తుంటాయి. అయితే ఇదే విషయంపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. మొదటి సారి లోన్లు తీసుకునేవారికి మినిమమ్ సిబిల్ స్కోర్ ఉండాల్సిన అవసరం లేదని లోక్‌సభలో ఆర్థిక […]
అనుమానాలు, అదనపు కట్నాలు, అక్రమసంబంధాలు వివాహబంధంలో చిచ్చుపెడుతున్నాయి. భార్యలను అత్యంత దారుణంగా చంపేస్తున్నారు కొందరు భర్తలు. రెండ్రోజుల క్రితం గ్రేటర్ నోయిడాలో అదనపు కట్నం కోసం వేధించి భార్యకు నిప్పు పెట్టి చంపేశాడు. మేడిపల్లిలో భార్యపై అనుమానంతో ముక్కలుగా నరికి ప్రాణం తీశాడు భర్త. తాజాగా మరో ఘోరం చోటుచేసుకుంది. వరంగల్ లోని హంటర్ రోడ్డులో భార్య గౌతమిని(21) హత్య చేశాడు భర్త గణేష్( 22). మొహంపై దిండుపెట్టి నొక్కి హత్యకు పాల్పడ్డాడు. Also Read:Love: పెళ్లైన […]
ఖమ్మం జిల్లాలోని తిరుమలయపాలెం మండలం ఎర్రగడ్డ గ్రామంలో దారుణం వెలుగుచూసింది. యువతి కోళ్లపూడి రమ్య ఇప్పటికే పెళ్లైన అదే గ్రామానికి చెందిన నరేష్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. ఈ క్రమంలో ప్రేమ పేరుతో వైజాగ్ తీసుకెళ్లాడు. పదిహేను రోజులపాటు అక్కడే గడిపారు. ఆ తర్వాత యువతిని అక్కడే వదిలేసి ఇంటికి వచ్చాడు వివాహితుడు నరేష్. యువతి ఎన్నిసార్లు ఫోన్ చేసిన నరేష్ స్పందించలేదు. దీంతో మనస్థాపానికి గురైన యువతి వైజాగ్ లాడ్జిలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. […]
హైదరాబాద్‌లోని మేడిపల్లి ప్రాంతంలో గర్భంతో ఉన్న తన భార్యను కిరాతకంగా హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించింది. ప్రేమ వివాహమే అయినప్పటికీ భార్యపై అనుమానం పెంచుకున్న భర్త మహేందర్ రెడ్డి, ఆమెను దారుణంగా హతమార్చి శరీరాన్ని ముక్కలుగా చేసి మూసి నదిలోపడేశాడు. ఈ ఘటన మరువక ముందే మరో ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. భార్య ను హత్య చేసి అడవుల్లో తగుల బెట్టాడు ఓ భర్త. వీరిద్దరు 2014లో ప్రేమ వివాహం చేసుకున్నట్లు సమాచారం. […]
ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బులంద్‌షహర్‌లోని జాతీయ రహదారి 34లోని ఘటల్ గ్రామం సమీపంలో, రాజస్థాన్‌లోని కాస్గంజ్ నుంచి గోగామెడికి వెళ్తున్న గోగాజీ భక్తులతో బయలుదేరిన ట్రాక్టర్‌ను కంటైనర్ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న 8 మంది మరణించగా, 43 మంది గాయపడ్డారు. ప్రమాద సమయంలో ట్రాక్టర్లో 60 మంది భక్తులు ఉన్నారని బులంద్‌షహర్ ఎస్ఎస్పి దినేష్ కుమార్ సింగ్ తెలిపారు. Also Read: Saudi hero: ఆ వ్యక్తి ధైర్యసాహసాలకు […]
ఉక్రెయిన్‌పై బాంబు దాడులను ఆపమని రష్యాను బలవంతం చేయడానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడుగా ఆర్థిక ఒత్తిడి విధానాన్ని అవలంబించారని, భారత్ పై ద్వితీయ సుంకాలను విధించడం కూడా ఇందులో భాగమని అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ తెలిపారు. జేడీ వాన్స్ మాట్లాడుతూ.. రష్యాకు చమురు ఆర్థిక వ్యవస్థ నుంచి వచ్చే ఆదాయాన్ని తగ్గించడం, తద్వారా అది యుద్ధాన్ని కొనసాగించలేకపోవడం ఈ చర్యల లక్ష్యం అని అన్నారు. అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య […]
ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు తీపికబురును అందించింది. వైద్యారోగ్య శాఖలో ఉద్యోగులకు ప్రమోషన్స్ కల్పించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వైద్యులు, అధికారులు కలిపి మొత్తం 223 మందికి ప్రమోషన్లు కల్పించాలని నిర్ణయం తీసుకుంది. ఆయుష్ విభాగంలో అదనపు సంచాలకుల పోస్టుకు ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ప్రజారోగ్య విభాగంలో డిప్యూటీ డైరెక్టర్లకు జాయింట్ డైరెక్టర్లుగా పదోన్నతులు కల్పించాలని నిర్ణయించింది. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోనున్నట్లు తెలిపింది.
కొత్త స్మార్ట్ ఫోన్ కొంతకాలం వాడిన తర్వాత స్లో అవడం కామన్. పాతబడిన తర్వాత కొత్తది తీసుకోవాలని ప్లాన్ చేస్తుంటారు. అయితే ఫోన్ లో చిన్న మార్పులు చేయడం ద్వారా పాత ఫోన్ ను వేగవంతం చేయవచ్చని చెబుతున్నారు టెక్ ఎక్స్ పర్ట్స్. కొత్త మొబైల్ కొనాల్సిన అవసరం లేదంటున్నారు. చిన్న ట్రిక్స్ తో ఫోన్ లైఫ్ టైమ్ ను పెంచుకుని మరికొంత కాలం ఏ ఇబ్బంది లేకుండా యూజ్ చేసుకోవచ్చంటున్నారు. ఆ వివరాలు తెలుసుకుందాం. సాఫ్ట్వేర్ […]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు గుడ్ న్యూస్ అందించింది. రేపటి నుంచి ఇంటింటికీ ఉచితంగా స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు తెలిపింది. నాలుగు విడతల్లో స్మార్ట్ కార్డుల పంపిణీ చేయనున్నారు. ఆయా రేషన్ షాపుల వద్ద లబ్ధిదారులకు అందజేయనున్నారు. మొదటి విడత లో రేపటి నుంచి 9 జిల్లాల్లో కార్డుల పంపిణీ చేపట్టనున్నారు. విజయనగరం, విశాఖపట్నం, ఎన్టీఆర్, తిరుపతి, నెల్లూరు, శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లాల్లో రేషన్ కార్డుల జారీ చేయనున్నారు. రెండో […]
చెతేశ్వర్ పుజారా క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. చాలా కాలంగా జట్టుకు దూరంగా ఉండటం మరియు సెలెక్టర్లు పట్టించుకోకపోవడంతో అతను ఈ నిర్ణయం తీసుకున్నాడు. 37 ఏళ్ల పుజారా 103 టెస్ట్ మ్యాచ్‌లు, 5 వన్డేల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. పుజారా చివరిసారిగా ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ (2023)లో భారత్ తరపున ఆడాడు. చెతేశ్వర్ పుజారా రిటైర్మెంట్ తర్వాత, కాంగ్రెస్ నాయకుడు, లోక్‌సభ ఎంపీ శశి […]