హైడ్రా అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తోంది. చెరువులు,నాళాలు, ప్రభుత్వ స్థలాలు, బఫర్ జోన్ లోని స్థలాలను కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కబ్జాదారుల నుంచి వందల కోట్ల విలువైన భూములను రక్షిస్తుంది హైడ్రా. ఈ క్రమంలో శంషాబాద్ లో 12 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. ప్రభుత్వ భూమిలో ఏర్పాటు చేసిన నిర్మాణాలతో పాటు ప్రహరీ గోడను తొలగించింది. 12 ఎకరాల చుట్టూ ఫెన్సింగ్ వేసి, ప్రభుత్వ భూమిగా బోర్డు […]
కూకట్ పల్లిలో అత్యంత దారుణంగా అత్యంత దారుణంగా హత్యకు గురైంది రేణు అగర్వాల్ అనే మహిళ. ఇంట్లో పనికి చేరిన వాళ్లే డబ్బు, నగలు కాజేసేందుకు మహిళ ప్రాణాలు తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి సంచలన విషయాలు వెల్లడించారు. సైబరాబాద్ సీపీ మాట్లాడుతూ.. కూకట్ పల్లి పీఎస్ లిమిట్స్ లో పదో తేదీన రేణు అగర్వాల్ మర్డర్ జరిగింది.. రేణు […]
మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు సుజాతక్క పోలీసుల ఎదుట లొంగిపోయింది. గద్వాల్ కు చెందిన సుజాతక్క చిన్నప్పుడే అడవిబాట పట్టింది. గద్వాలకు చెందిన సుజాతక్క అలియాస్ పోతుల కల్పన. 1984లో మావోయిస్టు అగ్ర నేత మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్ జీతో వివాహం జరిగింది. కొన్నాళ్ల క్రితమే ఎన్కౌంటర్లో కిషన్ జి చనిపోయారు. సుజాతక్క సెంట్రల్ కమిటీ మెంబర్ గా పని చేసింది. జనతన సర్కార్ ఇంచార్జ్ గా పని చేసిన ఆమెపై 104 కేసులు నమోదయ్యాయి. మొత్తం […]
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదుర్ మండల కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. బంగారం కోసం వృద్ధ మహిళను చేద బావిలో తోసేశారు గుర్తుతెలియని దుండగులు. ఈరగని రాధమ్మ (75) అనే వృద్ధ మహిళ ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్న సమయంలో అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడ గుర్తు తెలియని దుండగులు ఈ దారుణానికి ఒడిగట్టారు. వృద్ధ మహిళ మెడలో ఉన్న బంగారు చైన్ ను లాగే ప్రయత్నం చేసిన దుండగులు.. మెడలో ఉన్న చైన్.. ఆ వృద్దురాలు వదలకపోవడంతో తల మీద గాయపరిచి […]
మెదక్ జిల్లాలోని శివ్వంపేట మండలంలోని శభాష్ పల్లిలో సభ్య సమాజం తలదించుకునే ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ప్రియుడిమోజులో పడి కన్న కూతురును కాటికిపంపింది కసాయి తల్లి. కడుపు తీపి లేని ఆ తల్లికి కన్నపేగు బంధానికంటే ప్రియుడే ఎక్కువైపోయాడు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని రెండేళ్ల కూతురిని కసాయి తల్లి, ప్రియుడు హత్య చేశారు. కాగా మమతకు ఐదేళ్ల క్రితం సిద్దిపేట జిల్లా రాయపోల్ గ్రామానికి చెందిన భాస్కర్ తో పెళ్లైంది. ఇద్దరు పిల్లలు కూడా […]
ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం ద్వారా, కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం అర్హత కలిగిన రైతులకు 6 నెలల మొత్తాన్ని అందిస్తుంది. ఈ మొత్తాన్ని 3 వాయిదాలలో ఇస్తారు. ఈ పథకంతో పాటు, ప్రభుత్వం రైతులకు పెన్షన్ ఇచ్చే మరో పథకాన్ని నిర్వహిస్తుంది. ఈ పెన్షన్ పథకం ద్వారా, ప్రభుత్వం రైతులకు ప్రతి నెలా కనీసం రూ. 3000 రూపాయలు ఇస్తుంది. చాలా మంది రైతులకు కిసాన్ పెన్షన్ పథకం గురించి తెలియదు. ప్రధానమంత్రి కిసాన్ మాన్ […]
గోల్డ్ ధరలు నేడు ఊరటనిచ్చాయి. నేడు తులం గోల్డ్ ధర రూ. 110 తగ్గింది. కిలో సిల్వర్ ధర రూ. 1000 పెరిగింది. రూ. లక్షన్నర దిశగా వెండి పరుగులు తీస్తోంది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.11,117, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.10,190 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 100 […]
అసాంఘిక కార్యాకలాపాలకు శ్మశాన వాటికను అడ్డాగా మార్చుకుంది ఓ మహిళ. శ్మశానంలోని గదిలో వ్యభిచార దందా నడుపుతోంది. గుట్టుచప్పుడు కాకుండా నడిపిస్తోంది. శ్మశానంలో అయితే ఎవరికీ అనుమానం కలుగదని భావించింది. కానీ తప్పు చేసిన వాళ్లు ఏదో ఒక రోజు పట్టుబడాల్సిందే కదా.. ఈ క్రమంలో విషయం తెలిసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి తనఖీలు చేసి గుట్టురట్టు చేశారు. ఈ ఘటన పంజాగుట్టలో చోటుచేసుకుంది. పంజాగుట్ట పరిధిలోని శ్మశాన వాటికను వ్యభిచార గృహంగా మార్చింది ఓ మహిళ. […]
తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో వాతావరణం మేఘావృతమై ఉంది. అక్కడక్కడ వాన పడుతోంది. కాగా భారీ వర్షాలతో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నిండుకుండలా మారాయి. ఈ రెండు జలాశయాల నుంచి మూసీకి వరద ప్రవాహం పెరిగింది. మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో ముసరాంబాగ్ బ్రిడ్జి మూసివేశారు అధికారులు. నిన్న మధ్యాహ్నం నుంచి బ్రిడ్జి మూసివేశారు. ట్రాఫిక్ పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ […]