మార్కెట్ లో స్మార్ట్ ఫోన్స్ హల్ చల్ చేస్తున్నప్పటికీ ఫీచర్ ఫోన్ల వాడకం మాత్రం ఆగిపోలేదు. ఇప్పటికీ చాలా మంది ఫీచర్ ఫోన్లను యూజ్ చేస్తున్నారు. ఫీచర్ ఫోన్లలో కూడా అద్భుతమైన ఫీచర్స్ ఉండడంతో మరింత క్రేజ్ పెరిగింది. తాజాగా HMD తన కొత్త ఫీచర్ ఫోన్లు, HMD 100, HMD 101 లను భారత మార్కెట్లో విడుదల చేసింది. రూ.1,000 కంటే తక్కువ ధర కలిగిన ఈ ఫోన్లు మన్నిక, సరళమైన ఇంటర్‌ఫేస్, పవర్ ఫుల్ ఫీచర్లను కలిగి ఉన్నాయి. HMD 100, HMD 101 1.77-అంగుళాల డిస్ప్లేలను కలిగి ఉన్నాయి.
HMD 100, HMD 101 ధర
HMD 100, HMD 101 ధర రూ.949 గా కంపెనీ నిర్ణయించింది. రెండు ఫీచర్ ఫోన్‌లు డిసెంబర్ 5, 2025 నుంచి HMD అధికారిక సైట్, ఇ-కామర్స్ సైట్‌లు, ప్రముఖ రిటైల్ షాప్స్ ద్వారా సేల్ కు అందుబాటులో ఉంటాయి.
HMD 100 ఫీచర్లు
HMD 100 160×128 పిక్సెల్స్ రిజల్యూషన్, 4:5 యాస్పెక్ట్ రేషియోతో 1.77-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది S30+ పై రన్ అవుతుంది. HMD 100 అధునాతన డిజైన్‌ను కలిగి ఉంది. కంపెనీ 1-సంవత్సరం రీప్లేస్‌మెంట్ వారంటీని అందిస్తుంది. ఇది బూడిద, నీలి, ఎరుపు రంగులలో వస్తుంది. బ్యాటరీ లైఫ్ విషయానికొస్తే, ఇది 800mAh బ్యాటరీని కలిగి ఉంది. డ్యూయల్ LED ఫ్లాష్‌లైట్, వైర్‌లెస్ FM, ఫోన్ టాకర్, 10 భారతీయ భాషలకు ఇన్‌పుట్ సపోర్ట్, 23 భారతీయ భాషలకు రెండరింగ్ సపోర్ట్ ఉన్నాయి.
HMD 101 ఫీచర్లు
HMD 101 1.77-అంగుళాల డిస్‌ప్లేను 160×128 పిక్సెల్‌ల రిజల్యూషన్, 4:5 యాస్పెక్ట్ రేషియోతో కలిగి ఉంది. ఇది ఇన్ బిల్ట్ MP3 ప్లేయర్, వైర్‌లెస్ FM రేడియోను కూడా కలిగి ఉంది. ఫోన్ స్టోరేజ్ ను మైక్రో SD కార్డ్ ద్వారా విస్తరించవచ్చు. ఇది S30+లో రన్ అవుతుంది. ఈ ఫోన్‌లో డ్యూయల్ LED ఫ్లాష్‌లైట్, ఆటో కాల్ రికార్డింగ్, ఫోన్ టాకర్, 10 భారతీయ భాషలకు ఇన్‌పుట్ సపోర్ట్, 23 భారతీయ భాషలకు రెండరింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇవన్నీ వినోదం, కాల్స్, టెక్స్ట్ మెసేజ్ ల సమయంలో సహాయపడతాయి. ఈ ఫోన్‌తో కంపెనీ 1-సంవత్సరం రీప్లేస్‌మెంట్ గ్యారెంటీని అందిస్తుంది.