భారత ఓపెనింగ్ యువ బ్యాట్స్‌మెన్ అభిషేక్ శర్మ క్రికెట్ హిస్టరీలో సరికొత్త రికార్డ్ నెలకొల్పాడు. క్యాలెండర్ ఇయర్ లో 100 సిక్సర్లు కొట్టిన తొలి భారతీయ ఆటగాడిగా అభిషేక్ శర్మ నయా హిస్టరీ సృష్టించాడు. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో పంజాబ్, సర్వీసెస్ మధ్య జరిగిన సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ, 2025-26 మ్యాచ్‌లలో భారత స్టార్ క్రికెటర్ అభిషేక్ శర్మ ఒక క్యాలెండర్ ఇయర్ లో 100 సిక్సర్లు కొట్టిన తొలి భారతీయ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అభిషేక్ శర్మ ఈ టోర్నమెంట్‌లో తన విధ్వంసకర ఫామ్‌ను కొనసాగించాడు, 34 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, మూడు సిక్సర్లతో సహా 62 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో, 100-6 మార్కును అధిగమించాడు, ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడు అయ్యాడు.
Also Read:Penguins: ఘోరం.. 60,000 పెంగ్విన్‌లు మృతి.. కారణం ఏంటంటే?
ఈ సంవత్సరం టీ20 క్రికెట్‌లో కేవలం 36 ఇన్నింగ్స్‌లలో 101 సిక్సర్లు కొట్టాడు. ఈ సంవత్సరం ఈ ఫార్మాట్‌లో శర్మ 1,499 పరుగులు చేశాడు, సగటున 42.82, స్ట్రైక్ రేట్ 204.22. అభిషేక్ శర్మ తొమ్మిది హాఫ్ సెంచరీలు, మూడు సెంచరీలు సాధించాడు. సర్వీసెస్‌తో జరిగిన మ్యాచ్‌లో శర్మ బంతితో తన ప్రతిభను కనబరిచాడు. రెండు వికెట్లు పడగొట్టి పంజాబ్ విజయానికి కారకుడయ్యాడు. అభిషేక్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. అంతకుముందు, అభిషేక్ శర్మ బెంగాల్‌పై కేవలం 32 బంతుల్లోనే ఏడు ఫోర్లు, 11 సిక్సర్లతో సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్‌లో, 52 బంతుల్లో 148 పరుగులు చేసి, ఎనిమిది ఫోర్లు, 16 సిక్సర్లతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.
Also Read:Forex Reserve: వరుసగా రెండవ వారం పడిపోయాయిన భారత విదేశీ మారక నిల్వలు.. పెరిగిన బంగారం నిల్వలు
25 ఏళ్ల అభిషేక్ శర్మ ప్రస్తుతం టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసిన మూడవ ఆటగాడిగా ఉన్నాడు. అతను ఆరు ఇన్నింగ్స్‌లలో 304 పరుగులు చేశాడు. సగటు 50.66, అద్భుతమైన స్ట్రైక్ రేట్ 249.18, ఇందులో ఒక సెంచరీ, రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి. శర్మ ప్రస్తుతం T20I లలో నంబర్ వన్ ర్యాంక్ పొందిన బ్యాట్స్‌మన్‌గా ఉన్నాడు. 920 రేటింగ్ పాయింట్లు సాధించాడు. డిసెంబర్ 9న దక్షిణాఫ్రికాతో ప్రారంభమయ్యే ఐదు మ్యాచ్‌ల T20I సిరీస్‌లో అభిషేక్ శర్మ ఆడనున్నాడు.