ఆన్ లైన్ మోసాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. సైబర్ క్రిమినల్స్ సరికొత్త ఎత్తుగడలతో అమాయకులను మోసం చేస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. తాజాగా ఓ మహిళ రూ. 24 రిఫండ్ కోసం ప్రయత్ని్స్తూ రూ. 87 వేలు పోగొట్టుకుంది. అహ్మదాబాద్‌లో షాకింగ్ ఆన్‌లైన్ మోసం కేసు వెలుగులోకి వచ్చింది. చంద్‌ఖేడా ప్రాంతంలో నివసించే ఆ మహిళ జెప్టోలో కూరగాయలు ఆర్డర్ చేసింది. కానీ చిన్న వాటికి బదులుగా పెద్ద వంకాయలు రావడంతో ఆమె వాటిని తిరిగి పంపడానికి ప్రయత్నించింది.
Also Read:Smriti Mandhana: ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్న స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్..
అయితే డెలివరీ బాయ్ డబ్బు తిరిగి ఇవ్వడానికి నిరాకరించి, తన దగ్గర నంబర్ లేదని చెప్పి కస్టమర్ కేర్ కు కాల్ చేయమని ఆమెకు సలహా ఇచ్చాడు. ఆ తర్వాత ఆ మహిళ ఆన్‌లైన్‌లో కస్టమర్ కేర్ నంబర్‌ను వెతికి, ఓ వ్యక్తితో మాట్లాడగా మరొక నంబర్ ఇచ్చాడు. ఆ నంబర్‌కు కాల్ చేయగానే, ఆమెను వాట్సాప్ కు CUSTOMERSUPPORT.APK అనే ఫైల్‌ను పంపారు.
Also Read:Goa Fire Accident : నైట్ క్లబ్‌లో అగ్ని ప్రమాదంపై సీఎం ప్రమోద్ సావంత్ సీరియస్ !
ఫైల్‌ను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత, ఆ మహిళను ఆమె బ్యాంక్ ఖాతా వివరాలను అడిగారు, ఆ తర్వాత ఆమె మూడు బ్యాంక్ ఖాతాల నుండి మొత్తం 87,000 రూపాయలు విత్‌డ్రా చేసుకున్నారు సైబర్ మోసగాళ్లు. బ్యాంకు నుంచి మెసేజ్ అందిన వెంటనే, ఆ మహిళ మోసపోయానని గ్రహించి 1930 హెల్ప్‌లైన్‌లో ఫిర్యాదు చేసి, ఆపై పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసింది.