వందే భారత్ ట్రైన్స్ రవాణా వ్యవస్థను కొత్త పుంతలు తొక్కిస్తున్నాయి. హై స్పీడ్ తో దూసుకెళ్తూ ప్రయాణికుల సమయాన్ని ఆదా చేస్తున్నాయి. ఇప్పటికే పలు మార్గాల్లో వందే భారత్ చైర్ కార్ ట్రైన్స్ పరుగులు తీస్తున్నాయి. అయితే రైలు ప్రయాణికులకు మరింత సౌకర్యం కల్పించేందుకు భారతీయ రైల్వే రెడీ అయ్యింది. వందే భారత్ స్లీపర్ ట్రైన్స్ ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ ట్రైన్ ఈ రూట్ లో పట్టాలెక్కేందుకు సిద్ధమవుతోంది.
Also Read:Renting Husbands: ఈ దేశంలో అద్దెకు భర్తలు దొరుకుతారు.. ఎక్కడో తెలుసా!
తేజస్ లాంటి వేగం, రాజధాని లాంటి సౌకర్యం, వందే భారత్ అధునాతన సాంకేతికత ఇప్పుడు ఢిల్లీ-పాట్నా మార్గంలో భారతదేశపు మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైలు పరుగులు తీయనున్నది. మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైలు డిసెంబర్ చివరి నాటికి పాట్నా- ఢిల్లీ మధ్య కార్యకలాపాలు ప్రారంభించనున్నది. ఈ చారిత్రాత్మక ప్రారంభానికి రైల్వేలు చివరి దశ సన్నాహాలు చేస్తున్నాయి. ప్రయాణీకులు ఆ రోజు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
వందే భారత్ స్లీపర్ రైలు మార్గాలు
హిందూస్థాన్‌లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం, బెంగళూరులోని BEML, భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ ఫ్యాక్టరీలో నిర్మిస్తున్న వందే భారత్ స్లీపర్ రెండు రేక్‌లలో ఒకటి ఇప్పటికే పూర్తయింది. మొదటి రేక్ డిసెంబర్ 12న ఉత్తర రైల్వేకు బయలుదేరుతుంది, ఆ తర్వాత ఢిల్లీ-పాట్నా మార్గంలో ట్రయల్ రన్ జరుగుతుంది. ఈ హైటెక్ రైలులో మొత్తం 16 కోచ్‌లు ఉంటాయి, వీటిలో 827 బెర్త్‌లు ఉంటాయి, థర్డ్ ఏసీలో 611, సెకండ్ ఏసీలో 188, ఫస్ట్ ఏసీలో 24 బెర్త్‌లు ఉంటాయి.
మెరుగైన ఇంటీరియర్స్, ప్రత్యేక ఫీచర్స్
వందే భారత్ స్లీపర్ రైలును ఆధునిక సౌకర్యాలతో రూపొందించారు. ఇందులో ఆటోమేటిక్ డోర్లు, బయో టాయిలెట్లు, CCTV కెమెరాలు, వ్యక్తిగత రీడింగ్ లైట్లు, ప్రీమియం నాణ్యమైన సౌకర్యవంతమైన ఇంటీరియర్‌లు ఉంటాయి. ఈ రైలు గంటకు గరిష్టంగా 160 కిలోమీటర్ల వేగంతో నడిచేలా రూపొందించారు. ఇది కవచ్ వ్యవస్థ, క్రాష్ రెసిస్టెంట్ స్ట్రక్చర్ వంటి అధునాతన భద్రతా టెక్నాలజీతో అమర్చబడి ఉంటుంది. అవసరమైతే, కోచ్‌ల సంఖ్యను 24కి పెంచవచ్చు.
Also Read:IndiGo Crisis: ఇండిగో 95 శాతం కనెక్టవిటీ పునరుద్ధరణ, 1500 విమానాలు
వందే భారత్ స్లీపర్ మార్గం
వందే భారత్ స్లీపర్ రైలును న్యూఢిల్లీ రాజేంద్ర నగర్ తేజస్ రాజధాని ఎక్స్‌ప్రెస్ తరహాలో నడపాలని ప్లాన్ చేస్తున్నారు. ఇది వారానికి ఆరు రోజులు నడిచే అవకాశం ఉంది. పాట్నా నుండి, రైలు సాయంత్రం రాజేంద్ర నగర్ టెర్మినల్ నుండి బయలుదేరి మరుసటి రోజు ఉదయం ఢిల్లీకి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణ షెడ్యూల్ తేజస్ రాజధాని మాదిరిగానే ఉంటుంది. ఈ నెలాఖరు నాటికి వందే భారత్ స్లీపర్ రైలు రెగ్యులర్ కార్యకలాపాలను ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని దానాపూర్ డివిజన్ ధృవీకరించింది.